నవతెలంగాణ - వాషింగ్టన్
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ వీసాలు జారీ చేయనున్నారు. ‘మార్చి 17లోపు రావాల్సినన్ని దరఖాస్తులు వచ్చేస్తే.. లాటరీ ద్వారా ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తాం. ఒకవేళ రాకపోతే పక్కాగా రిజిస్ట్రేషన్లు సమర్పించిన అందరికీ వీసాలు ఇస్తాం.’ అని యూఎస్ పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల (యూఎస్‌సీఐఎస్) సంస్థ ప్రకటించింది. సంవత్సరానికి 85 వేల హెచ్1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఇందులో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే ఇస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 09:30AM