నవతెలంగాణ - మెదక్
మెదక్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభమైంది. మొదట మనోహరాబాద్‌లో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం ఐటీసీ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. రూ.450కోట్ల పెట్టుబడితో ఐటీసీ ఈ పరిశ్రమను నిర్మించింది. ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందింది. మనోహరాబాద్ పరిశ్రమ సిబ్బందిలో 50 శాతం మహిళలు ఉన్నారు. పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. రైతుల ఆదాయం పెంచేందుకే నీలి విప్లం వచ్చిందని కేటీఆర్ అన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 12:21PM