నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో భారీ పేలుడు జరిగింది. లాలంకోడూరు సమీపంలోని జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm