నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ కాన్వాయ్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఏబీవీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కేటీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్ లో బయల్దేరారు. మరోవైపు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకోబోతున్న సమయంలో బీఆర్ఎస్ కు చెందిన ఓ జెడ్పీటీసీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏబీవీపీకి చెందిన ఒక కార్యకర్తను కాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm