నవతెలంగాణ - న్యూఢిల్లీ
కేంద్ర బడ్జెట్ 2023-24ను ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బహీఖాతా ట్యాబ్లెట్‌తో.. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కృష్ణారావ్ కరడ్, ఆర్ధిక శాఖ అధికారులు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఎరుపు రంగు బహీఖాతాతో మంత్రి కనిపించారు. అయిదోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ట్యాబ్లెట్‌లో ఆమె బడ్జెట్‌ను చదువుతారు. ఇది పేపర్‌లెస్ బడ్జెట్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ముర్మును కలిసిన మంత్రి నిర్మల.. బడ్జెట్‌పై ఆమెకు సమాచారం అందజేశారు. బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా దక్కనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 10:15AM