నవతెలంగాణ-హైదరాబాద్ : సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20లో భారత్‌కు షాక్.. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఔట్. మైఖేల్ బ్రాస్‌వెల్ వేసిన రెండో ఓవర్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇషాన్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, బంతి ఆఫ్ స్టంప్‌కి తగలడంతో ఇషాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. గత మ్యాచుల్లో మాదిరిగానే కివీస్ కెప్టెన్ శాంటర్న్ రెండో ఓవర్‌లోనే స్పిన్నర్‌ను దించాడు. ఊహించినట్టుగానే స్పిన్ బౌలింగ్‌లో ఇషాన్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (33), రాహుల్ త్రిపాఠి (20) దాటిగా ఆడుతున్నారు. . ఆరు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్.. 58/1
Mon Jan 19, 2015 06:51 pm