నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారాన్ని వ్యక్తం చేశారు. సినీ ప్రపంచంలో విశ్వనాథ్ ఒక దిగ్గజమని కొనియాడారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు మోడీ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm