నవతెలంగాణ -ఢీల్లి
జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈ నెల 18న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢీల్లిలో భేటీ జరగనున్నట్టు జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా తెలిపింది.
పాన్ మసాలా, గుట్కా సంస్థలపై పన్ను విధించే అంశంతో పాటు అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటుపై మంత్రుల బృందం ఇచ్చిన నివేదికలపై ఈ 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, రేస్ కోర్స్‌లపై జీఎస్టీ విధించేందుకు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సులపైనా ఈసారి చర్చించనున్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Feb,2023 09:34PM