నవతెలంగాణ - శ్రీకాకుళం
ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధిహామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో మరోకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ముగ్గురు మందాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Feb,2023 06:15PM