నవతెలంగాణ - తిరుపతి
గూడూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం తెలిసి వార్డెన్ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజి హాస్టల్ లో ధరణీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
ఈ తరుణంలో ధరణీశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఇతర విద్యార్థులు కాలేజి హాస్టల్ వార్టెన్ శ్రీనివాసులునాయుడుకు తెలియజేశారు. దాంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులునాయుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు మరణాలతో నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది.