నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రింటర్ పాడవడంతో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో విద్యార్థులకు పంపించి పరీక్ష రాయించింది ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. 20 మార్కుల ఈ పరీక్షను కూడా మామూలుగానే నిర్వహించాలి. అయితే, ప్రింటర్ పాడైందన్న కారణంతో ఆదిలాబాద్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విద్యార్థులకు నిన్న వాట్సాప్‌లో ప్రశ్న పత్రం పంపించారు. విద్యార్థులు దానిని తమ స్మార్ట్‌ఫోన్లలో చూసి జవాబులు రాస్తూ కనిపించారు. సెల్‌ఫోన్ దగ్గరుంటే కాపీ కొట్టరా? అన్న ప్రశ్నకు ప్రిన్సిపల్ జగ్‌రాం అంతర్బేది మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టి పరీక్ష రాయించామని, వారిపై ఓ కన్నేసి ఉంచామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm