నవతెలంగాణ- తిరుపతి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును టీటీడీ అధికారులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలను అక్కడి నుంచి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలోకి ఇవాళ ఉదయం తరలించారు. ప్రత్యేకమైన ట్రాలీలు, క్రేన్ల ద్వారా లారీల్లో హుండీలను తీసుకెళ్లారు.
భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం లెక్కింపును ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ పరకామణిలో రెండు వందల మంది సిబ్బంది ఒకేసారి కూర్చొని కానుకలు లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సారీ హుండీ కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా టీటీడీ అధికారులు పెద్ద అద్దాలను ఏర్పాటు చేసి క్యూలైన్లలో భక్తులను అనుమతిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 12:39PM