నవతెలంగాణ - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనమయ్యారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం తెలంగాణ వెలుపల తొలిసారిగా నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. మరికాసేపట్లో నాందేడ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మొదట సభా వేదిక సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నాందేడ్‌లోని చారిత్రక గురుద్వారాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు జాతీయ, మహారాష్ట్ర మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారు. 5 గంటలకు నాందేడ్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 01:07PM