నవతెలంగాణ - అమరావతి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలేంటో త్వరలోనే తెలుస్తాయని అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి చెప్పారు. నిజం బయటికి రావాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. త్వరలో ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుందని అన్నారు. కేసు విచారణను హైదరాబాద్‌కు బదిలీ చేయడం మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి సమన్లు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీఐ అధికారులు పక్కా సమాచారంతోనే అందరిని విచారణకు పిలుస్తున్నారని.. అందులో భాగంగానే ఇటీవల అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారని గుర్తుచేశారు. ఎవిడెన్స్ లేనిదే ఎవరినీ విచారణకు పిలవరని అన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనే దానిపై అన్ని వాస్తవాలను.. సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 03:40PM