నవతెలంగాణ - ఢీల్లి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరవు భత్యాన్ని(డీఏ) నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. దీనిని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. గతేడాది డిసెంబరుకు సంబంధించిన పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉంది అని, ఆర్థిక శాఖ ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు ఉంచనుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 05:08PM