నవతెలంగాణ - హైదరాబాద్
దర్శకుడు కె.విశ్వనాథ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ రోజు విశ్వనాథ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. విశ్వనాథ్ కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విశ్వనాథ్ సమాజానికి అవసరమైన ఆణిముత్యాల్ లాంటి సినిమాలు అందించారని చంద్రబాబు కొనియాడారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 05 Feb,2023 06:20PM