నవతెలంగాణ-హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తూ.. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఈ ఆర్డర్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అడిగారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది.
Mon Jan 19, 2015 06:51 pm