Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వికృతి | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

వికృతి

Sun 30 Oct 00:16:57.325601 2022

          మతఛాందసవాదులు చేస్తున్న ప్రచారం తప్ప ఆ వాదనలో సత్యం లేదు. వివక్షతలను పెంచి పోషించే మనువాద భావజాలం ఒక వైపు పెరిగిపోతుంటే, రెండో వైపు విచ్చలవిడితనపు ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆధునికత పేరుతో మనుషులను మర బొమ్మలుగా చేస్తున్న వ్యాపార సంస్కృతి ఆడపిల్లలను కూడా ఒక సరుకుగా చూపెడుతున్నది. సెల్‌ఫోను, వెబ్‌సైట్లలో వికృత చిత్రాలు విధ్వంసపూరిత ప్రదర్శనలు యువత మదిని రెచ్చగొడుతున్నాయి. పర్యవసానంగా రోగగ్రస్తమైన మానసికత పెరిగిపోతున్నది. ఒక వైపు వివక్షతల దాడి, మరోవైపు విశృంఖలత దాడి వెరసి సాంస్కృతిక విలువల విధ్వంసం. ఇదీ నేటి పరిస్థితి.
            సమాజంలో వికృత చేష్టలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వినటానికి, చూడటానికి ఎంతో బాధవేస్తోంది. ఎందుకు ఈ వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి! ఎందుకీ ఆలోచనలు పెరుగుతున్నాయి! ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎప్పుడు విషనాగు విషం చిమ్ముతుందో తెలియకుండా వుంది. భయంభయంగా వుంది. మొన్న హైద్రాబాద్‌ నగరంలో దయానందుని పేరుతో నడుపుతున్న పాఠశాలలో నాలుగేండ్ల ఎల్కేజీ పాపపై రెండు నెలలుగా లైంగిక దాడి ఘటన విని మనసు చెలించిపోయింది. స్వయానా పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, ఎవరి దృష్టికీ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బడులంటే విజ్ఞానం వికసించే స్థలాలు. సాంస్కృతిక విలువల కార్ఖానాలు. పవిత్ర ప్రదేశాలు. అందులో దయానంద సరస్వతి బోధనాదర్శాలతో నడుపుతున్న పాఠశాలలో ఈ వికృత చేష్ట జరగటం మరింత దారుణం. ఇదే రాజధాని నగరంలో ఒక అనాథాశ్రమంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనా జరిగింది. ఆశ్రయాలు, పాఠశాలలు, కార్యాలయాలు, పని ప్రదేశాలు ఎక్కడయినా సరే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి మాత్రమే కాదు ఇలాంటివి దేశం మొత్తంలో పెరిగాయి. విలువలు, సంస్కారం నేర్పాల్సిన ప్రదేశాలలో, భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పెద్దల నుంచే ఈ మానసిక వికారపు పనులు జరగటం వల్ల విశ్వసనీయత లేకుండా పోయింది. తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వీరికి భరోసానిచ్చే ప్రయత్నాలేవీ కొనసాగటం లేదు. రక్షణ కోసం చేస్తున్న ఏర్పాట్లూ లేవు.
బడిలో జరిగిన ఈ సంఘటనను చాలా చిన్నదిగా భావిస్తున్న వాళ్లూ వున్నారు. ఆడపిల్లలపై జరిగే లైంగిక దాడుల సందర్భంగా చాలా మంది పాలకులు చేస్తున్న విమర్శలు ఏమంటే, దుస్తులు సరిగా వేసుకోకపోవటం, అర్ధరాత్రిళ్లు ఆడపిల్లలు తిరగటం వల్ల ఇలాంటివి జరుగుతాయని మాట్లాడతారు. మరిప్పుడు నాలుగేండ్ల పసిపాప ఏం రెచ్చగొట్టింది? మతఛాందసవాదులు చేస్తున్న ప్రచారం తప్ప ఆ వాదనలో సత్యం లేదు. వివక్షతలను పెంచి పోషించే మనువాద భావజాలం ఒక వైపు పెరిగిపోతుంటే, రెండో వైపు విచ్చలవిడితనపు ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆధునికత పేరుతో మనుషులను మర బొమ్మలుగా చేస్తున్న వ్యాపార సంస్కృతి ఆడపిల్లలను కూడా ఒక సరుకుగా చూపెడుతున్నది. సెల్‌ఫోను, వెబ్‌సైట్లలో వికృత చిత్రాలు విధ్వంసపూరిత ప్రదర్శనలు యువత మదిని రెచ్చగొడుతున్నాయి. పర్యవసానంగా రోగగ్రస్తమైన మానసికత పెరిగిపోతున్నది. ఒక వైపు వివక్షతల దాడి, మరోవైపు విశృంఖలత దాడి వెరసి సాంస్కృతిక విలువల విధ్వంసం. ఇదీ నేటి పరిస్థితి.
జరుగుతున్న సంఘటనలను కేవలం ఆ సంఘటనకే పరిమితం చేయలేము. అది చర్యగా బయటపడినపుడు మాత్రమే చూడగలుగుతున్నాము. కానీ సమాజంలో ఆ రకమైన దుర్మార్గ ఆలోచనలకు వికృత చేష్టలకు కారణభూతమైన సాంస్కృతిక విధ్వంసాన్ని అరాచకాన్ని అడ్డుకోకపోతే మన భావితరాలు రోగగ్రస్తులుగా తయారవుతారు. హింసించడం, చంపడం, క్రూరత్వానికి పూనుకోవడం మొదలైన దుర్మార్గాలన్నీ వైయక్తికమైనవి మాత్రమే కావు. ఒకానొక అపసవ్య సమాజపు సంస్కృతీ హీనత్వానికి ప్రతిఫలంగానే వాటిని చూడాల్సి వుంటుంది. ప్రజల బాగోగులను చూడాల్సిన బాధ్యత పరిపాలకులపై వున్నది. సమాజ తీరును సరిచేయాల్సీ వుంది. కానీ అందుకు వారు సంసిద్ధంగా లేరు. ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన సమయమిది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి
సంస్కృతి
మద్యపాణం
కొత్తకాంక్ష
పుస్తక మహోత్సవం
ఉన్మాదం
అందరివాడు
మానని గాయం
పాటకు జేజేలు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.