Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాటకు జేజేలు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

పాటకు జేజేలు

Sun 27 Nov 00:48:59.69833 2022

            'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..ఏ బండ్లె పోతవ్‌ కొడుకో నైజాం సర్కరోడా.. నాజీల మించినవురో నైజాం సర్కరోడా' ఈ పాట నిజాం రాజు గుండెల్లో నిప్పులవాగై కురిసింది. 'నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..నా తెలంగాణ'అని సాగే ఈ పాట తెలంగాణ మాగాణి విశిష్టతను తెలియజేసింది. 'భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పూవులు, త్యాగాల గుర్తులు. మా భూములు.. మాకేనని మర్లబడ్డ రాగమా..తిరగబడ్డ గానమా.. పోరు తెలంగాణామా.. కోట్లాది ప్రాణమా' అంటూ ధూంధాం చేసిన ఈ పాట ఉద్యమ తీవ్రతను హెచ్చరించింది.
            పదం పదం కలిస్తే జానపదం.. పల్లవి చరణం కలిస్తే గీతం.. రచన కవిత్వం కలిస్తే సాహిత్యం.. వీటన్నింటినీ ఒకేచోట చేరిస్తే అది 'తెలంగాణ లిటరరీ ఫెస్ట్‌'. ఈనెల 20,21,22 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన 'పాటకు జేజేలు' ఎంతగానో అలరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన గాయకులు, కవులకు సభా ప్రాంగణం స్వాగతం పలికింది. కార్యక్రమ నిర్వహణ అంగరంగా వైభవంగా సాగింది. 'ఒకే దారానికి పూలు గుచ్చితే దండైనట్టు', సుమారు 600 మంది కవులు, కళాకారులు, రచయితలు వారి కష్టాలు, కన్నీళ్లు, ఆనందాలు, సంతోషాలు పాటల, మాటల రూపంలో ఒకే వేదికలో పంచుకోవడం ఎంతో అనుభూతిని కలిగించింది. బాల కవుల నుంచి మొదలుకుని పండు ముదుసలి వరకు ఆద్యంతం ఈ ఫెస్ట్‌ను అంటిపెట్టుకుని ఉండటం మంచి పరిణామం.పాటకు రాగం, తానం, పల్లవి ఎంత ముఖ్యమని చెబుతామో అంతకన్నా ముందు రచయిత హృదయం గొప్ప అని పాటమ్మ తెలియజేసింది.
కళారంగానికి, సాహిత్యానికి ఉన్న బంధం విడదీయలేనిది. కథకు, కవిత్వానికి ఊహజనిత ఉంటుంది.అదే పాటకు సంఘటన, సన్నివేశం ఆధారం అవుతుంది. కవిత, పాట ఈ రెండింటికీ అవినాభవ సంబంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. 'రవి గాంచని చోట కవిగాంచును' అంటారు. ప్రపంచంలో సూర్యుని కిరణాలు పడని ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ కూడా కవి తన కలంతో వెలుగును అందించడానికి సిద్ధంగా ఉంటాడని దీనర్థం. పాట కూడా అంతే. మాటలు రాని నాడే పాట పుట్టింది. గుండె లోతుల్లోంచి పాట రావాలన్నా, శ్రోతల్ని మైమరపించాలన్నా భావం అంతరంగం నుంచి ఉప్పొంగాలి. చిగురించే మొక్కలా ఉద్భవించాలి. అయినా పాట లేనిదెక్కడీ. తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తూనే కేవ్‌కేవ్‌మని ఏడ్చే శబ్ధం ఒక పాట. గోరు ముద్దలు తినిపిస్తూ 'చందమామ రావే' అని పిలిచి కడుపు నింపేదీ ఓ పాటే. మారం చేసినప్పుడు 'జోలాలి'తో చక్కని నిద్రపుచ్చేది పాటే.అవే 'బుడిబుడి అడుగులు' పాటతో కొంత కాలానికి నడక నేర్చుకుంటాం. 'జనగణమణ' అంటూ బడిలో చేరతాం. ఆడుతూ పాడుతూ స్నేహితులతో సరదాలు పంచుకుంటాం. పెండ్లి బాజాలతో ఒక్కటవుతాం. కుటుంబంతో సరాగాలు పాడుతాం. వెళ్లిపోతూ 'పుట్టిన వాడు గిట్టక తప్పదు' అంటూ విషాద గీతాన్ని నింపుతాం. మనిషి పుట్టినప్పటి నుంచి ఊపిరొదిలే వరకు పాటతోనే పయనిస్తాం. పాటతోనే జీవిస్తాం. పాటతోనే పోతాం. ఇదే నిజం. అయితే మనిషి మరణించినా మరణం లేనిది ఏదైనా ఉందంటే అది పాటక్కటే. అందుకే నాగరికత నుంచి నేటి అంతరిక్షం వరకు పాట బావుటా అయి ప్రజ్వలిస్తూనే ఉంది.
మూడు రోజుల పాటు ఉర్రూతలూగించిన ఈ ఫెస్ట్‌లో పాటకు పట్టాభిషేకం కట్టారు. ఎంతో మంది డాక్టరేట్లు పొందిన వారు, ఉన్నతస్థానాల్లోని అధికారులు, సినీ దర్శకులు, రైటర్లు, కవులు, కళాకారులు, ప్రముఖులు పాటలో జీవితం ఎలా మమేకమైందో చెప్పి స్ఫూర్తినిచ్చారు. 'కడుపు నింపేది కాదు కవిత్వం, కన్నెర్ర జేసేది కవిత్వం' అంటాడు ఓ కవి. కడుపు కోసం కవిత్వం రాస్తే జీవిత లక్ష్యం నెరవేరదు.కష్టజీవుల కన్నీళ్లను అక్షరీకరించడమే తక్షణ కర్తవ్యం.మనిషి జీవితం పనితోనే సాగుతుందనేది వాస్తవం. 'టపటపటప టపటపటప చెమటబట్లు తాళాలై పడుతుంటే.. కరిగి కండరాల నరాలే స్వరాలు కడు తుంటే పాటా పనితోపాటే పుట్టింది. పనీ పాటతోటే జటకట్టింది' అనే ఈ పాట తన పుట్టుకను తెలిపే బతుకు పాటైంది. కర్షకుని చెమట విలువను చాటింది.అదే పాట తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన శక్తిని ప్రదర్శించింది.ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో బలిదానాలు చేశారు. వారు చిందించిన రక్తమే ఏరులై పారి మళ్లీ పాటై పోటెత్తింది. ఈ ఉద్యమ పాట ఎంతో మంది వీరులను తయారు చేసింది. అన్యాయాలను ప్రశ్నించే గొంతుకగా నిలిచింది. 'బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..ఏ బండ్లె పోతవ్‌ కొడుకో నైజాం సర్కరోడా.. నాజీల మించినవురో నైజాం సర్కరోడా' ఈ పాట నిజాం రాజు గుండెల్లో నిప్పులవాగై కురిసింది. 'నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..నా తెలంగాణ'అని సాగే ఈ పాట తెలంగాణ మాగాణి విశిష్టతను తెలియజేసింది. 'భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు, చిదిమేసిన పూవులు, త్యాగాల గుర్తులు. మా భూములు.. మాకేనని మర్లబడ్డ రాగమా..తిరగబడ్డ గానమా.. పోరు తెలంగాణామా.. కోట్లాది ప్రాణమా' అంటూ ధూంధాం చేసిన ఈ పాట ఉద్యమ తీవ్రతను హెచ్చరించింది.
దేశ సంస్కృతిలోనే అతిపెద్ద పండగైన బతుకమ్మలోనూ మహిళలు గైకట్టి పాడిన ఉయ్యాల పాట రాచరికాన్ని ప్రశ్నించింది. బానిసత్వాన్ని నిలదీసింది.ఇలా ఎన్నో పాటలు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం, మలి దశ ఉద్యమం ధీరత్వాన్ని చూపించాయి. కొన్ని ప్రభుత్వాలను కూల్చాయి. తెలంగాణను సాధించేలా చేశాయి. భవిష్యత్తు ఆశలకు రూపాన్నిచ్చాయి. ఇవే కాదు.. ప్రేమ పాటలు, యుగళ పాటలు, విరహ పాటలు, విప్లవ పాటలు, భక్తి పాటలు, భావ పాటలు శతాబ్దాలుగా జనజీవనంతో ముడిపడి ముందుకు సాగుతున్నాయి. అయితే ఇందులో ఆకలిని చేధించడానికి వచ్చిన పాటలు కొన్ని. ఆవేదనలు, ఆందోళనల నుంచి పుట్టినవి మరికొన్ని. చాలావరకు అణిచివేతను ఎదురిస్తున్న ఆవేశ, ఆక్రోశాలే ఈ బతుకు పాటలు. ఇవి నిత్యం పోరాటాల పురిటిగడ్డను వినిపిస్తున్న సజీవ సాక్ష్యాలు. తరతరాలుగా జనాన్ని చైతన్యం చేస్తున్న ఓ పాటమ్మా..నీకు వేల వేల వందనాలు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి
సంస్కృతి
మద్యపాణం
కొత్తకాంక్ష
పుస్తక మహోత్సవం
ఉన్మాదం
అందరివాడు
మానని గాయం
నయవంచన

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.