Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మానని గాయం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

మానని గాయం

Sun 04 Dec 00:09:59.819877 2022

              కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహణలో దుష్ఫ్రభావాలకు లోనై ఇద్దరు యువతులు మృతి చెందారని, ఆ మరణాలకు కేంద్రం బాధ్యత వహించి పరిహారం ఇప్పించాలని వారి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. అయితే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరణించివారికి తాము బాధ్యత వహించబోమని కేంద్రం మరో అఫిడవిట్‌ను సమర్పించింది. ఎంతటి నిస్సిగ్గు చర్య ఇది.? మరణాలకు తాము బాధ్యత వహించబోమని చెప్పడమంటేనే పాలన నుంచి పరోక్షంగా వైదొలగడమే.
              మనిషిని మానసికంగా కృంగదీసింది.. శారీరకంగా నష్టపరచింది.. ఆర్థికంగా కుదేలు చేసింది.. బంధాన్ని కూడా బంధించింది.. ఆ మహమ్మారి కోవిడ్‌-19. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచం కునారిల్లింది. కోటికిపైగా మరణించి ఉంటారని ప్రాథమిక అంచనా. కరోనా బారినపడివారు, మానసిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నవారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు నేటికీ చాలా మందే ఉన్నారు. అయితే కరోనా కట్టడిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ వెనుకబడిందన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో చర్యలు తీసుకోక పోవడం మూలానా మరణాలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రజల్లో ఓ వైపు నిరాశ, మరోవైపు ఆందోళన, ఇంకోవైపు చావుభయం అన్నీ ఒకేసారి వెంటాడాయి. ఒకానొక దశలో పాలనా యంత్రాంగం చేతులెత్తేసింది. వ్యవస్థ గాడి తప్పుతుండగా ఒక్కసారిగా లాక్‌డౌన్‌ విధించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పిల్లలు చదువులకు దూరమయ్యారు. వైరస్‌ను అరికట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. కరోనా వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రానిది. అయితే తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దుష్ఫ్రభావానికి లోనై మరణించివారికి పరిహారం ఇచ్చేదిలేదని చెప్పడం సహేతుకమేనా?. ఆలోచించాల్సిన అవసరమున్నది.
చైనా ల్యాబ్‌ నుంచి వైరస్‌ పుట్టిందని ఒక దుష్ఫ్రచారం. కానీ అది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఆ పుకారును తొలగించేందుకు ఆ దేశానికి ఎంతోకాలం పట్టలేదు. కొద్ది నెలల్లోనే కరోనాను కట్టడి చేసి ఇతర దేశాలకు సవాల్‌ విసిరింది. మరి భారత్‌లో కేంద్రం అసమర్థ చర్యలతో ఈ వ్యాధి దాదాపు రెండేండ్ల పాటు తిష్టేసుకుని కూర్చుంది. ఎన్నో కుటుంబాలను కబళించింది. ఎంతోమంది చనిపోయిన తర్వాత గానీ దృష్టి సారించలేదు. ఫార్మసీ రంగం పరిశోధనల ఫలితంగా కరోనాకు టీకాను తయారు చేసింది. ముందు కొవిషీల్డ్‌, తర్వాత స్పుత్నిక్‌వికి కేంద్రం ఆమోద ముద్రవేసింది. వైద్య నిపుణులు ఏ మెడిసిన్‌ కనిపెట్టినా దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. వంద శాతం ఫలితం ఇస్తుందనే నిర్ధారణకు వచ్చిన తర్వాత బయటకు విడుదల చేస్తారు. అయితే కోవిషీల్డ్‌ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే టీకాకు అనుమతినిచ్చామని చెప్పిన కేంద్రం దాని దుష్ఫ్రభావాలకు లోనై చనిపోయిన వారి గురించి వెలుగులోకి రానివ్వడం లేదని దీన్నిబట్టే తెలుస్తోంది. అలాంటి మరణాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇటీవల ఓ ఫిటిషన్‌ దాఖలైంది.
కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహణలో దుష్ఫ్రభావాలకు లోనై ఇద్దరు యువతులు మృతి చెందారని, ఆ మరణాలకు కేంద్రం బాధ్యత వహించి పరిహారం ఇప్పించాలని వారి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేంద్రాన్ని వివరణ కోరింది. అయితే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరణించివారికి తాము బాధ్యత వహించబోమని కేంద్రం మరో అఫిడవిట్‌ను సమర్పించింది. ఎంతటి నిస్సిగ్గు చర్య ఇది.? మరణాలకు తాము బాధ్యత వహించబోమని చెప్పడమంటేనే పాలన నుంచి పరోక్షంగా వైదొలగడమే. టీకాల వాడకం నుంచి ఇమ్యూనైజేషన్‌ తర్వాత ప్రతికూల ప్రభావాల కారణంగా అత్యంత అరుదుగా మరణించే వారికి పరిహారం అందించడానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం చట్టపరంగా నిలవదని పేర్కొంది. ఇది బాధ్యతారాహిత్యమని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?. కరోనా వల్ల తమ ఆప్తులను, ఆస్తులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్రం తమకు అపకీర్తి రాకూడదనే మరణాలను దాస్తున్నట్టు స్పష్టమవుతోంది.
లాక్‌డౌన్‌తో ప్రజా జీవనం స్తంభించిన విషయం తెలిసిందే. ఆహారం దొరక్క ఎంతోమంది ఆకలితో అలమటించి చనిపోయారు. గుట్టలు గుట్టలుగా శవాలు గంగానదిలో ప్రత్యక్షమయ్యాయి. వలస కూలీలైతే వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరి మధ్యలోనే చాలామంది మరణించారు. దీనికి బాధ్యత ఎవరిది?. ఔషధాలకు దుష్ఫ్రబావాలు ఉన్నట్టు, టీకాకు ఉంటాయని కోర్టుకు చెప్పడమంటే కోవిడ్‌ మరణాలను కూడా సహజంగానే చూస్తున్నట్టే కదా. అయితే ప్రజలు వ్యాధుల బారినపడి చనిపోతుంటే ప్రజలు లేని పాలన ఎవరి కోసం?. కరోనా మృతుల సమాధుల లెక్కల్లో కూడా తక్కువ చూపే పరిస్థితులు రావడం బాధాకరం. ప్రజా సంక్షేమం మరిచి ఇలాంటి వైఖరి అవలంభించడం వల్లే కోవిడ్‌ మానని గాయంగా ఉంటోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ శోకం
ఆంక్షల కత్తి
సంస్కృతి
మద్యపాణం
కొత్తకాంక్ష
పుస్తక మహోత్సవం
ఉన్మాదం
అందరివాడు
పాటకు జేజేలు
నయవంచన

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.