Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గంట కట్టేదెవరు? | చైల్డ్ హుడ్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • చైల్డ్ హుడ్
  • ➲
  • స్టోరి
  • Apr 24,2021

గంట కట్టేదెవరు?

కార్వేటినగరం అడవుల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, అడవి పిల్లులు, ఎలుకలు మొదలైన జంతువులన్నీ స్నేహంగా, సంతోషంగా జీవించేవి. ఒకరోజు శేషాచలం అడవుల నుండి ఒక పులి కార్వేటినగరం అడవిలోకి ప్రవేశించింది. తనకు తానుగా అడవికి రాజునంటూ ప్రకటించుకుంది.
ఆకలి ఉన్నా లేకున్నా తక్కిన జంతువులను వేటాడేది. ప్రతిరోజు పదుల సంఖ్యలో జంతువులను చంపేసేది. జంతువులన్నీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన వచ్చింది. ఒక రోజు ఏనుగు పులి దగ్గరకు వెళ్లి
''పులి రాజా! ఆకలి వేసినప్పుడు మీరు జంతువులను వేటాడి తినవచ్చు. అది ప్రకతి ధర్మం. కానీ మీరు అవసరానికి మించి జంతువులను వేటాడుతున్నారు. ఇది మీకు న్యాయం కాదు.'' అంటూ హితబోధ చేసింది.
''నేను ఈ అడవికి రాజును. నాకు నీతులు చెప్పే సాహసం చేయడం నీకు మంచిది కాదు.'' అంటూ ఏనుగు పట్ల అహంకారాన్ని ప్రదర్శించింది పులి. ఏనుగు మౌనంగా తిరిగి వచ్చేసింది.
చెరువు గట్టుపై జంతువులన్నీ సమావేశమయ్యాయి. పులి నుండి తప్పించుకునేందుకు ఉపాయం ఆలోచించి సాగాయి.
''నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పనా?'' అడిగింది కుందేలు. జంతువులన్నీ కుందేలు వైపు చూసాయి.
''పులి మెడలో గంట కడదాం! పులి కదలికలను పసిగట్టి జాగ్రత్త పడుదాం'' చెప్పింది కుందేలు.
కుందేలు మాటలు విని ఫక్కున నవ్వాయి ఎలుకల గుంపు.
''ఎందుకు నవ్వుతున్నారు?'' అమాయకంగా అడిగింది కుందేలు.
''గతంలో మేము ఇలాగే పిల్లి మెడలో గంట కట్టాలని ఉపాయం వేశాము. గంట సిద్ధం చేశాక దాన్ని పిల్లి మెడలో కట్టే ధైర్యశాలి దొరకలేదు. దాంతో ఆ గంట మా బొరియలో వధాగా పడి ఉంది.'' చెప్పింది ఎలుక.
''నాకు తెలియకుండా ఇంత ఉపాయం వేశారా?''అంటూ ఎలుకల వైపు కొరకొరా చూసింది పిల్లి.
ఎలుకలన్నీ భయంతో తమ బొరియల్లో దాక్కోబోయాయి.
''మిమ్మల్ని ఇంకెప్పుడూ వేటాడునులే! ప్రత్యామ్నాయ ఆహారం సంపాదించుకుంటాను'' అభయమిచ్చింది పిల్లి. ఎలుకలన్నీ సంతోషించాయి.
''ఎలుకలు చెప్పింది నిజమే. అవి పిల్లి మెడలో గంట కట్టలేక పోయినట్టే, మనం పులి మెడలో గంట కట్టే సాహసం చేయలేము'' నిరుత్సాహంగా చెప్పింది జింక.
''పులి మెడలో గంట కట్టే ఉపాయం నా దగ్గర ఉంది.'' అంటూ ముందుకు వచ్చింది కోతి.
''పులిని మనం రాజుగా అంగీకరించినట్టు కబురు పంపండి. సన్మానం చేయదలిచామని చెప్పి పులిని ఆహ్వానించండి. సన్మాన కార్యక్రమంలో నేను పులి మెడలో గంట కడతాను.'' చెప్పింది కోతి.
సన్మానానికి కావలసిన పూలను సిద్ధం చేశాయి పిల్లులు. పండ్లను, కాయలను కోసుకొచ్చాయి పిల్లులు. ఎలుకలు గంటను శుభ్రం చేసి తీసుకొచ్చాయి. గుర్రాలు తోలు శాలువాను ఏర్పాటు చేశాయి. కోతి పూలహారం మధ్యలో గంట కట్టి మాలలు చుట్టింది. ఏనుగు జంతువులన్నిటినీ వెంటబెట్టుకుని గుహ దగ్గరకు వెళ్లి పులిని తన వీపుపై ఎక్కించుకుని ఊరేగింపుగా చెరువుగట్టు దగ్గరకు తీసుకు వచ్చింది. జంతువులన్నీ నాట్యంచేస్తూ స్వాగతం పలుకగా పులి సింహాసనం పై కూర్చుంది. పులి శౌర్య పరాక్రమాల గురించి గొప్పగా పొగిడాయి. జంతువులన్నీ చప్పట్లు కొడుతుండగా పులికి శాలువా కప్పింది ఏనుగు. గంట కట్టిన పూల హారాన్ని పులి మెడకు గట్టిగా కట్టింది కోతి. తనకు దక్కిన గౌరవానికి పులి మురిసిపోయింది.
రెండు రోజులు గడిచాయి. పులి మెడకు కట్టిన మాలలోని పూలన్నీ వాడిపోయి రాలిపోయాయి. పులి మెడకు గంట మాత్రమే మిగిలింది. గుహ నుండి కాలు బయట పెట్టిన ప్రతిసారి గంట గణగణమని మ్రోగేది. జంతువులన్నీ పులి కంట పడకుండా దాక్కోవడం మొదలుపెట్టాయి. పులికి ఒక్క జంతువూ చిక్కేది కాదు. దాంతో పులి ఆహారం కోసం మరో అడవికి వలసపోయింది. కోతి తెలివితేటలను మెచ్చుకుంటూ జంతువులన్నీ ఆనందంతో చిందులు వేశాయి.
- పేట యుగంధర్‌, 9492571731

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అడవికి వెళ్లిన ఎలుకలు
ప్రవర్తన
పిచ్చి ఏనుగు
రాముడు భీముడు
నిర్ణయం
మనిషే గొప్ప
రోగానికి సేవ
పత్రంతో ఛత్రం
పిల్లకాకి
వృద్ధ దుప్పి సలహా
రాము - కుక్కపిల్ల
గీయించిన బొమ్మ
సాధించాలి
నాన్న ఇచ్చిన ఆస్తి
నిర్మల హృదయం
సోమరిపోతు సోమన్న
చదివింది గుర్తుకు రావడం లేదా...?
మిత్రుల తెలివి
వెంకడి వారసుడు
అవ్వను చేరదీసిన మురళి
ప‌ది రూపాయ‌లు
బుల్లి చేప తెలివి
యోగ్యత
పిల్ల కుందేలు ధైర్యం!
జమీందారు బిడ్డ
అంజన్న కోతి
అద్భుత దీపం
కోకిలమ్మ చేసిన మేలు
కాకమ్మ ఆహ్వానం
టక్కు టమారం... దుమ్ము దుమారం

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.