Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 23,2023

 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ

హైదరాబాద్‌: ప్రీమియర్‌ వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీ  సింక్రోనీ (ఎన్‌వైఎస్‌ఈ : ఎఫ్‌వైఎఫ్‌) ఇప్పుడు ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌’ కార్యక్రమం  ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉన్నత విద్యావకాశాలు పెంపొందించడం, అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగాలలో నైపుణ్య శిక్షణ మరియు నిరుపేద కమ్యూనిటీలతో పాటుగా సింక్రోనీ వర్క్‌ఫోర్స్‌కు ఆర్ధిక అక్షరాస్యత అందించడం చేయనున్నారు. మెంటార్‌షిప్‌ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా  సంస్ధ యొక్క ఉద్యోగ నైపుణ్యం మరియు ప్రతిభపై ఆధారపడి ఈ ప్రోగ్రామ్‌ను సింక్రోనీ యొక్క నిబద్ధతపై ఆధారపడి, మన కమ్యూనిటీల లోపల  లోతైన ఆర్ధిక అసమానతల సమస్యలకు తగిన పరిష్కారం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
         సింక్రోనీ ఫౌండేషన్‌ ఇప్పుడు స్కాలర్‌షిప్‌లు మరియు మెంటార్‌షిప్స్‌ అందించేందుకు 55000 డాలర్ల వార్షిక గ్రాంట్‌ను అందించేందుకు కట్టుబడింది. ఈ గ్రాంట్‌ను భారతదేశంలోని అల్పాదాయ వర్గాల విద్యార్ధులకు అందించనున్నారు. బాలికా విద్య పట్ల కంపెనీ అధికంగా దృష్టి సారించడంతో సింక్రోనీ ప్రస్తుతం 119 మంది విద్యార్ధులకు ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మద్దతు అందిస్తుంది. వీరిలో 88% మంది మహిళా విద్యార్ధులు ఉన్నారు.
      ‘‘నాణ్యమైన విద్యను పొందడం,  నైపుణ్యాభివృద్ధి అనేవి పెను సవాళ్లుగా నిలుస్తుంటాయి. మరీ ముఖ్యంగా బీద వర్గాలకు చెందిన మహిళా విద్యార్ధులకు ఇది మరింత సవాల్‌గా నిలుస్తుంటుంది. సింక్రోనీ యొక్క ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్విలైజర్‌’ కార్యక్రమం ద్వారా ఈ సవాళ్లకు తగిన పరిష్కారాలను అందించడంతో పాటుగా సంతోషకరమైన భవిష్యత్‌కు మెరుగైన విద్యను పొందేలా బాలికలు, మహిళలకు తోడ్పడనుంది. ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. మన సమాజంలో  సానుకూల ప్రభావం చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’అని  ఆండీ పొన్నేరీ, ఎస్‌వీపీ– బిజినెస్‌ లీడర్‌, ఇండియా అన్నారు.
       ఈ కార్యక్రమం  గురించి కామేశ్వరి గంగాధర్‌భట్ల,  వైస్‌ ప్రెసిడెంట్‌– హ్యూమన్‌ రిసోర్శెస్‌– ఆసియా డైవర్శిటీ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ సీఈఓ లీడర్‌ మాట్లాడుతూ ‘‘విద్య మనందరికీ సాధికారితనందిస్తుంది. కొవిడ్‌ మహమ్మారి నాటి నుంచి, మొత్తం విద్యా మౌలిక సదుపాయాలు పూర్తిగా మారాల్సిన ఆవశ్యకత వైల్లడైంది. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల  విద్య పరంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి. స్థోమత సమస్యల కారణంగా విద్య లాంటి ప్రాధమిక హక్కు ప్రతి ఒక్కరికీ చేరువవుతుందనే భరోసాను సింక్రోనీ అందిస్తుంది. సమ్మిళితను జోడించడం ద్వారా,  ఈక్వలైజర్‌ కార్యక్రమం రూపంలో విద్య యొక్క  సానుకూల వేగాన్ని కొనసాగించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.


‘‘అట్టడుగు వర్గాలకు చెందిన యువకులకు ఉన్నత విద్యను చేరువ చేయడం మరియు వారు గ్రాడ్యుయేట్‌ అయ్యేలా చూడటం కంటే విజయవంతమైన రీతిలో  లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్స్‌ను అందించడానికి మించి ప్రభావం చూపే మరో అంశమేమీ లేదు. యునైటెడ్‌ వే హైదరాబాద్‌ ఇప్పుడు సింక్రోనీ ఫైనాన్షియల్స్‌ కోసం ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్స్‌ను  నిర్వహిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. ఈ స్కాలర్‌షిప్‌ గ్రహీతలు తమ కోర్సులను పూర్తి చేసేంత వరకూ తగిన మద్దతు అందించడానికి కట్టుబడిన వారి నిబద్ధతను ప్రశంసిస్తున్నాము’’ అని గిరిజ తుల్పులీ, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ అన్నారు.
  నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఫౌండర్‌, సీఈఓ మయూర్‌ పట్నాల మాట్లాడుతూ ‘‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనికి సింక్రోనీ తగిన మద్దతు అందిస్తుంది.  ఈ కార్యక్రమం కింద 52 మంది బాలికా విద్యార్ధులకు మద్దతు అందిస్తున్న సింక్రోనీకి ధన్యవాదములు తెలుపుతున్నాము.  ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ కార్యక్రమం కింద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి నైపుణ్య శిక్షణ మరియు స్కాలర్‌షిప్‌లు.
       స్కిల్‌ ప్రాజెక్ట్‌ కింద, బీద వర్గాలకు చెందిన 45 మంది బాలికలు (ఫతేనగర్‌ మరియు చుట్టు పక్కల ప్రాంతాలు) కు ఐటీ ఆధారిత సేవల నైపుణ్యాలపై శిక్షణ అందించడంతో పాటుగా 28 మంది బాలికలకు ఎంఎన్‌సీలలో ఉపాధినీ అందించారు.
       స్కాలర్‌షిప్స్‌ ప్రాజెక్ట్‌ కింద, ఉన్నత విద్య కోసం మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా మరీ  ముఖ్యంగా స్టెమ్‌ విద్యలో ప్రోత్సాహాన్ని అందిస్తూ  , ఏడుగురు బాలికలకు మద్దతు అందించారు. ఈ బాలికలు సెమీ ఆర్ఫన్‌ మరియు బీపీఎల్‌ వర్గాలకు చెందిన వారు కావడంతో పాటుగా అత్యంత  ప్రతిభావంతులు. వీరికి బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు తగిన మద్దతు అవసరం పడటంతో పాటుగా గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేంత ఈ అవసరం పడుతుంది. నిర్మాణ్‌ మరియు  స్కిల్లింగ్‌ , స్కాలర్‌షిప్స్‌ ప్రోగ్రామ్‌ల కోసం విద్యార్థులు ఇప్పుడు  సింక్రోనీ కి తమ ధన్యవాదములను ఈ అద్భుత అవకాశం అదించినందుకు అందించారు. అలాగే ఈ చిన్నారుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల భవిష్యత్‌కు మార్గం వేసిన సింక్రోనీకి కృతజ్ఞతలు తెలిపారు’’ అని అన్నారు.
   ‘‘దాదాపు 61 మంది నిరుపేద కాలేజీ విద్యార్థులు (50 మంది మహిళలు మరియు 11 మంది పురుషులు)కు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్న సింక్రోనీ ఫౌండేషన్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన విద్యార్ధులకు  ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్విలైజర్‌  కింద మద్దతు తెలుపుతుంది. ఈ తరహా మద్దతు ఈ విద్యార్థులు మరియు కుటుంబాలకు భారీ ప్రోత్సాహం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఉన్నత విద్య అభ్యసించేందుకు అందిస్తుంది. దానితో పాటుగా తమ విద్య ద్వారా భావి తరపు భవిష్యత్‌ ను సైతం మార్చగలరు’’ అని రంగారావు జాస్తి, డైరెక్టర్‌, అసిస్ట్‌ అన్నారు.
     విద్యాసంస్ధలు, లాభాపేక్ష లేని సంస్ధలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కాలర్‌షిప్‌లను అందుకున్న వ్యక్తులను వారి ప్రతిభ, అవసరాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వ్యాప్తంగా ఎంపిక చేశారు. సింక్రోనీ యొక్క నాన్‌ ప్రాఫిట్‌ భాగస్వాములు – అసిస్ట్‌, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ మద్దతో 79 మంది విద్యార్థులను ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేట్‌ కోర్సులు అయినటువంటి బీఏ, బీకామ్‌, బీఎస్‌సీ, ఫార్మా, నర్సింగ్‌ , బీటెక్‌, ఎంబీబీఎస్‌ కోర్సుల కోసం ఎంపిక చేశారు. దీనిలో 40 మంది  బాలికలను అప్‌స్కిల్లింగ్‌ మరియు ఫైనాన్షియల్‌ లిటరసీ కార్యక్రమాల కోసం ఎంపిక చేశారు.  ఈ విద్యార్ధులు సాధారణంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజన, గ్రామీణ మరియు నగర ప్రాంతాల వారై ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ వారు ప్రభుత్వ యూనివర్శిటీలు, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, యూనివర్శిటీలు, జాతీయస్ధాయి ప్రీమియర్‌ విద్యాసంస్థలలో విద్యనందిస్తుంది.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నగరంలో మ్యూజిగల్‌ సంగీత అకాడమీ ఏర్పాటు
పాత నగలు అమ్మేస్తున్నారు..
హై రైజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ 'ఫారెస్ట్‌ ఎడ్జ్‌' ప్రాజెక్టు
నత్తింగ్‌ 'ఇయర్‌(2)' విడుదల
ఈనాక్‌తో హిట్స్‌ ఒప్పందం
బాలల వేధింపులకు వ్యతిరేకంగా చేసే ఉద్యమానికి మద్దతిచ్చే ప్రత్యేక వేదిక.
హార్దిక్ పాండ్యాతో కలిసి ఐస్ క్రీమ్ ప్రచారాన్ని ఆవిష్కరించిన హేవ్ మోర్
కూకట్‌పల్లి వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన మ్యూజిగల్‌
మెడ్‌టెక్‌ జోన్‌ను సందర్శించిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం
MSMEల కోసం అమెజాన్ బిజినెస్ ఉత్కంఠభరితమైన డీల్స్
గ్రామీణ ప్రాంతాల్లో ఫినో పెమెంట్స్ బ్యాంకు అధిక వడ్డీ ఫిక్స్ డిపోసిట్ సేవలు
న్యూట్రిషన్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి
సామ్‌సంగ్‌ గెలాక్సీ 14 5జి ఆవిష్కరణ
జాక్‌డోర్సే సంపద రూ.4,300 కోట్లు ఫట్‌
హన్మకొండలో రిలయన్స్‌ ట్రెండ్స్‌ ఏర్పాటు
అత్యాధునిక మాస్టర్స్‌ ప్రోగ్రామ్ కోసం.. ఈనాక్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న హిందుస్తాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
కెనాన్ ఇండియా 16 కొత్త అధునాతన ప్రింటర్‌ల విడుదల
టాటా మోటార్స్ BS6 ఫేజ్ II ఎమిషన్ నిబంధనలకు ముందుగా వాణిజ్య వాహనాల ధరల పెంపును ప్రకటించింది
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సదస్సుల కోసం కలుసుకున్న గోధుమ పరిశ్రమ నాయకులు మరియు న్యూట్రిషన్‌ నిపుణులు
సాంసంగ్ సెగిమెంట్ ఫీచర్స్‌తో Galaxy F14 5G
ఇయర్‌బడ్స్‌ సెట్‌ ను విడుదల చేసిన సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌
ఇంధన ధరలపై ఆందోళన
క్లియర్‌ ప్రీమియం బ్రాండ్‌ అంబాసీడర్‌గా హతిక్‌
తోషిబాకు రెండు భారీ ఆర్డర్లు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ నుంచి రెగాలియా గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌
దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌
ఎన్ ఐ టి ఐ ఇ ముంబైలో స్టెమ్ విద్యను అభ్యసిస్తున్న బాలికలకు పి & జి ఇండియా స్కాలర్‌షిప్‌లు
సాంసంగ్ \"బ్లూ ఫెస్ట్\" 2023 రిఫ్రిజిరేటర్స్‌లో కొత్త డిజైన్స్‌తో..
ఆహార ధాన్యాల పరంగా స్వీయ సమృద్ధి పరంగా శాస్త్రికి దేశం ఋణపడి ఉంది
సింబయోసిస్‌ యుజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు SET/SLAT/SITEEE కోసం చెల్లింపు

తాజా వార్తలు

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

10:22 PM

RC15 సెట్ లో కేక్ కట్ చేసిన రామ్ చరణ్...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.