Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శిక్షలుండవిక్కడ, కర్మభూమి కదా! | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Jul 04,2021

శిక్షలుండవిక్కడ, కర్మభూమి కదా!

ఇది భారతీయ సమాజం. ఇక్కడ కంచెలు, అంచెలు, కులాంతరాలు తరాలుగా మనుషుల మధ్య వివక్షలు, హీన ఉన్నత భావనలు, శ్రామికులు, అధిపతులుగా విభజిత గీతలు, ఒకరి కంటే ఒకరు హీనులు. ఒకరి కంటే ఒకరు ఉన్నతులు. మొత్తంగా పీడితులు పీడకులు. దోపిడీని ధర్మబద్దం చేసిన సనాతన తిరోగమన నీతి రాజ్యం చేస్తూనే వుంది. వ్యవస్థలు ఎన్ని మారినా సారం కొనసాగుతూనే వుంది. పీడన పోలేదు. అణచివేతలూ తొలగలేదు. ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలంటే ఇప్పటికీ చిన్న చూపే. వాళ్ళకే కాదు, తమకు తామే హీనులమనే భావనలు జీర్ణించుకుపోయి, ఆధిపత్య దోపిడీ వర్గాలకు యథేచ్చ సమ్మతిని ఇస్తున్నాయి. పర్యవసానంగా మరియమ్మలు మాయమై పోతున్నారు. 'ప్రాణాలకు విలువ కడతారు, నేరస్తులకు ఒడిని పడతారు, న్యాయానికి ఉరిని చుడతారు'. కళ్ళ ముందు కనపడే దృశ్యాలివి. ఎదురు తిరగకపోతే కొనసాగుఆయి. తిరగబడితే ఆగిపోతాయి.
       అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రంలో మిన్నిపోలిస్‌ ఒక ముఖ్య నగరం. మిన్నిపోలిస్‌ పట్టణంలో కప్‌పుడ్‌ అనే స్టోర్‌లో సిగరెట్లు కొని ఇరవై డాలర్ల నోట్‌ ఇచ్చిన నాలబై ఆరేళ్ళ ఆఫ్రో అమెరికన్‌ (నల్ల జాతీయుడు) జార్జ్‌ ప్లాయిడ్‌పై దొంగనోట్ల చలామణి చేస్తున్నాడనే అనుమానంతో షాప్‌ ఉద్యోగైన పంతొమ్మిది ఏళ్ళ క్రిస్టఫర్‌ మార్టిన్‌ మిన్ని పోలీస్‌ పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఒక నల్లజాతీయుడు ఇరవై డాలర్లు కలిగి వుండటమూ ఒక నేరమే అన్నట్లు ఉంది కదా! తెల్ల జాతీయులకు మాతం అనుమానం రాకపోదా? వందలాది సంవత్సరాలుగా జాత్యాహంకారంతో మెదళ్ళను కలుషితం చేసుకున్న నేల కదా అది. వెంటనే పోలీసులు రాబందుల్లా వాలిపోయారు. ఎలాంటి విచారణ లేకుండా జార్జ్‌ఫ్లాయిడ్‌ చేతులు వెనిక్కి అదిమిపట్టి సంకెళ్ళు బిగించి ఈడ్చుక్కెళ్ళి కారులో వేసి అదిమిపట్టి హింసించారు, అది చాలదన్నట్లు మళ్ళీ బయటకు లాక్కొచ్చి సంకెళ్ళు బిగించిన ఫ్లాయిడ్‌ని భూమికి అదిమి పట్టి మెడపై జాత్యాహంకారమనే మోకాలితో తొక్కి పడితే ''ఐ కాంట్‌ బ్రీత్‌'' అంటూ పదే పదే ప్రాదేయపడినా, రెండేళ్ళ క్రితం చనిపోయిన తల్లిని తలుస్తూ, ''మమ్‌, మమ్‌'' ''ఐ కాంట్‌ బ్రీత్‌'' ''ఐ కాంట్‌ బ్రీత్‌'' బ్రదర్‌ అంటున్నా కసి తీరని తెల్ల జాత్యాహంకారంతో మరింత తొక్కి, తన బరువునంతా ఫ్లాయిడ్‌పై మోపి దాదాపు తొమ్మిది నిమిషాలు అదిమిపట్టి ప్రాణం పోయేదాక విడిచిపెట్టకుండా డిరిక్‌ చౌవిన్‌తో పాటు మరో ముగ్గురు తెల్లజాతి పోలీసులు జార్టిఫ్టాయిడ్‌ని హత్య చేశారు. ఈ దాష్టీకాన్ని చూస్తున్న వాళ్ళు ''వదిలేయండి, వదిలేయండి'' అంటు పోలీసులను వేడుకున్నా కనికరించ కుండా జార్జిని ప్రాణం తీసేదాక వదలలేదు. పైగా చచ్చాడో లేదోనని నాడిపట్టి చూశారు. ఈ కృరమైన హత్యను పక్కనున్న వాళ్లు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ పైశాచిత్వాన్ని చూసిన అమెరికాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలూ ఉలిక్కిపడ్డాయి. ఏనాటి నుండో ఆ అకృత్యాలను మనసులో దాచుకుని మసలుతున్న అమెరికా ఆందోళనలతో అగ్గై మండింది. అమెరికా పట్టణాలన్ని ఆందోళనలతో అట్టుడికాయి. కోరలు చాచిన కరోనాను సైతం లెక్కచేయక ప్రజలు ఆందోళనలో భాగస్వామ్యం కావటానికి వెనకడుగెయ్యలేదు. ఆందోళనలు హింసాత్మాక రూపం తీసుకున్నాయి. అనేక చోట్ల విధ్వంసం జరిగింది. ఆందోళన కారులను శాంతింప చెయ్యటానికి బదులు అగ్గికి ఆజ్యంపోసే విధంగా దేశాధ్యక్షుడైన ట్రంపు మాట్లాడటంతో ఉద్యమం మరింత ఉదృతమైంది. మిలటరీని రంగంలోకి దించుతానని తన ఉన్మాదాన్ని బయటపెట్టుకున్నాడు. ప్రజలు భయపడకుండా మరింత ఉదృతంగా పోరాడారు. సొంత ప్రజల పోరాటానికి జడిసి అమెరికా అధ్యక్షుడు ట్రంపు బంకర్‌లో తలదాచుకోవలసివచ్చింది.
      అమెరికాలో నల్లజాతీయులపై ఈ దాష్టీకాలు ఈనాటివి కావు. సంతల్లో పశువులగా నల్ల జాతీయులను బానిసలుగా అమ్మిన నాటి నుండి నేటి వరకు జాతివివక్ష కొనసాగుతూనే ఉన్నది. మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మాల్కం ఎక్స్‌ లాంటి నల్లజాతి నాయకుల నేతృత్వంలో అనేక పోరాటాలు జరిగినందువల్ల వాటి తీవ్రత, రూపాలు మారినా నేటికినీ దుశ్చర్యలు కొనసాగుతూ ప్రజల హృదయాలను మెలితిప్పుతునే వున్నాయి. ఈ గూడుకట్టుకున్న ఆవేదనే నేటికీ ఆగ్రహ జ్వాలలుగా ఎగిసి పడుతున్నాయి. అందులో జార్జిఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. అమెరికాలో తెల్లవారిపై పోలీసులు జరిపే దాడులు, దౌర్జన్యాల కన్నా నల్లజాతివారిపై జరిగే ఆకృత్యాలు మూడు రెట్లు ఎక్కువ. ''బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌'' అనే ఉద్యమం నల్లజాతీయులపై కొనసాగుతున్న ఆకృత్యాలకు నిరసనగా జరుపుతున్న పోరాటానికి అమెరికన్‌ అభ్యుదయ పౌరులంతా అండగా నిలిచారు. నల్లజాతివారిపై జరుగుతున్న ఆకృత్యాలపై గతంలో వేసిన స్కార్‌మన్‌, మక్‌పెర్సన్‌ లాంటి అనేక కమీషన్‌ నివేదికలు కొందరు దుర్మార్గులైన అధికారుల వల్ల జరుగుతున్న దుష్కృత్యాలుగా పేర్కొన్నాయి. ఇది అమెరికా సమాజంలోని జాత్యాంహకార పోకడల ఫలితమేనని విదితమౌతున్న విషయమే. జార్జిఫ్లాయిడ్‌ హత్యకు కారకులుగా పేర్కొంటూ డెరిక్‌ జౌవిన్‌తో పాటు సహకరించిన మిగతా అధికారులపై హత్యారోపణలు చేసింది. మినిసొట్టా ప్రభుత్వం వర్సెస్‌ డిరిక్‌ చౌవిన్‌ పై ట్రయల్‌ 2021 మార్చి 8న ప్రారంభించి 2021 ఏప్రిల్‌ 20 నాటికి చౌవిన్‌ని దోషిగా ప్రకటించింది. అంటే దాదాపు నెలన్నర కాలంలో ట్రయల్‌ పూర్తయ్యింది. పన్నెండు మందితో కూడిన జ్యూరీ 2021 జూన్‌ 25న డెరిక్‌ చౌవిన్‌కి శిక్షణు ఖరారు చేసింది. జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు సెకండ్‌ డిగ్రీ, థర్డ్‌ డిగ్రీలు ఉపయోగించి హత్య చేసిన నేరాలకు గానూ కీలకపాత్రదారి అయిన డెరిక్‌ చౌవిన్‌కి 22 సంవత్సరాల ఐదు నెలల జైలుశిక్ష ఖరారు చేసింది. అంటే హత్య జరిగిన సంవత్సరం నాటికి విచారణ జరిపి శిక్ష ఖరారు చేసిందన్న మాట.
      మన దేశంలో రాష్ట్రంలో దళితులపై నిమ్నవర్గాలపై దాడులు, హత్యలు. హత్యాచారాలనేవి చాలా మాములు విషయాలుగా మారిపోయాయి. దాడులుకు గురైనవారు పోలీసుకు ఫిర్యాదు చేసినా కేసు ఫైల్‌కాదు, కేసు ఫైల్‌ అయితే చార్జిషీట్‌లో వీగిపోయే విధంగా మారిపోతాయి. చట్టపరంగా వున్నా రక్షణలు కూడా అమలు జరగటమనేది ఉండదు. కోర్టులు కూడా అవకాశం చిక్కినప్పుడల్లా దళితులకు రక్షణగా వున్న చట్టాలను పలచన చేయజూస్తాయి. అక్కడ నల్ల జాతీయులు, ఇక్కడ దళితులు నిరంతరం దాడులు, దాష్టీకాలకు గురవుతూనే వున్నారు. అక్కడి సమాజం స్పందించిన నిశితంగా ఇక్కడ స్పందన వుండదు. ఇక్కడ స్పందన కూడా వివక్ష పూరితంగానే ఉంటుంది. ఇక్కడ దళితులపై దాడులు రాజకీయ పార్టీకి ఒక పొలిటికల్‌ మైలేజీగా మాత్రమే కనబడుతుంది. ఇందులో వామపక్షాలు మాత్రమే భిన్నంగా వ్యవహరిస్తాయి. దళిత సంఘాలు ఉద్యమాలు చేసినా అస్థిత్వ వాదాలపైనున్న శ్రద్ద, హక్కుల దృక్ఫథం నుండి తగినంత ఉండదనే చెప్పాలి. మన దగ్గర నిమ్న కులాలలపై, జరిగే హత్యలు హత్యాచారాల విషయంలో వేసే శిక్షలు పెద్దగా ఉండవనే చెప్పాలి. పోల్చి చూస్తే దాదాపు ఇక్కడ శిక్షలు పడవు. చట్టాలుంటాయి కానీ అవి అమలుకు నోచుకోవు. కారంచేడులో హంతకులను, సాక్షులను కూడా తుడిచేసిన ఘటనలు చూశాం. చుండూరు మారణకాండలోనైతే హత్యలు జరిగాయి కానీ హంతకులే లేరని కోర్టులే తీర్పులు చెప్పాయి. తెలంగాణ ఏర్పడ్డాక మంథని మధుకర్‌ లాంటి అనేక హత్యలు కప్పివేయబడ్డాయి. మొన్నీమధ్య జరిగిన మరియమ్మ లాకప్‌డెత్‌ ఒక సజీవ సాక్ష్యంగా పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ శిక్షలు పడవని.
      జార్జిఫ్లాయిడ్‌ విషయంలాగానే మరియమ్మది ఆర్ధిక పరమైన కేసే. భువనగిరి జిల్లాలో జరిగిన దొంగతనంపై అదుపులోకి తీసుకోబడ్డ మరియమ్మను ఖమ్మంలో పోలీసు పరిథిలో కౄరంగా శిక్షించారు. ఇక్కడి నుండి అర్ధరాత్రి మహిళా పోలీసులు లేకుండా అదుపులోకి తీసుకుని భువనగిరికి తెచ్చి కౄరంగా హింసించి చంపారు. పైగా పోలీసులకు ఇష్టమైన రీతిలో రిపోర్టులు రాసుకున్నారు. మన దగ్గర చట్టం, న్యాయం అనేవి స్వతంత్రంగా పని చేయటం అనేది కనిపించవు. ఎందుకంటే మనం లాకప్‌ డెత్‌లలో, ఎన్‌కౌంటర్లలో సిద్ధ హస్తులం కదా!
      ఇక్కడ చట్టం, న్యాయ వ్యవస్థలు ఏం పని చేయవుగా! వాటిని నడిపే సుప్రిం ధర్మం అనేది ఒకటుందిగా ..అదేనండి మనుధర్మం. మరియమ్మ విషయంలో జూన్‌ ఏడో తేదినా దొంగతనం జరుగుతుంది, కానీ 15వ తారిఖు వరకు పోలీసులకు ఫిర్యాదు చేయరు. ఒకవేళ ఫిర్యాదు చేసినా అరెస్టు చేసి కోర్టుకు పంపాలి కానీ అలా కూడా చేయరు. ఎందుకంటే పోలీసులకు న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ రెండు అధికారాలు ఉన్నాయి అనే దీమాలో ఉంటారు కదా!. పోలీసుల కస్టడీలో ఎవరైనా మరణిస్తే జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణ జరపాలి కానీ మరియమ్మ విషయంలో ఆర్డీవోతో రిపోర్టు రాయించారు. ఆయన గారి కున్న లా అండ్‌ ఆర్డర్‌ విషయాల్లో వున్న జ్యుడిషియల్‌ అధికారాలను ఇలా ఉపయోగించుకున్నారన్న మాట. ఫ్లాయిడ్‌ విషయంలో ''చేతనైతే మంచి చెయ్యి చేతకాక పోతే నోరుమూసుకో'' అని ఒక పోలీసు అధికారి దేశాధ్యక్షుడినే అనేంత ప్రొఫెషనలిజం ఉండగా మన దగ్గర కలెక్టర్లే రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కే సంస్కృతి వర్ధిల్లుతుంది. ఆర్డీవోలు మాత్రం వాస్తవికమైన రిపోర్టులు రాస్తారని మనం నమ్మితీరాలి మరి! కారకుడైన పోలీసులను సస్పెండ్‌ చేస్తారు కానీ వారిపై నేరారోపణలు చేసి శిక్షించరు. ఇక్కడ ప్రతి దళిత శవానికి ఒక రేటు ఉంటుంది. అది కూడా ఎన్నికల విషయాలతో పెనవేసుకుని వుంటుంది. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతీసుకని 15 లక్షల పరిహారంతో పాటు ఒక ఉద్యోగాన్ని ప్రకటించారు. తెలంగాణలో అనేక దాడులు, హత్యలు దళితులపై జరిగాయి. ఒక్క హంతకుడినైనా శిక్షించేందుకు ప్రభుత్వం చోరవ చూపిందా అంటే 'లేదు' అని టక్కున సంశయించకుండా సమాధానం చెప్పవచ్చు. హైకోర్టు, పౌరహక్కుల కమీషన్‌ విచారణకు ఆదేశించింది కానీ అవి జరిగేదెప్పుడో... శిక్షలు పడేదెప్పుడో... మరి పరిష్కారం ఏమిటి సమాజం వివక్షత లేని స్పందన అలవర్చుకోవాలి. అంటే సుప్రీం ధర్మం నాశనం కావాలి. దానిని వ్యతిరేకించే శక్తులన్ని ఐక్యంగా నిలబడాలి. హక్కుల స్పృహ పెరగాలి. ఆధిపత్య భావజాలన్ని అధిమిపట్టాలి.
- కాడిగల్ల భాస్కర్‌
సెల్: 9491118822

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి
బుక్‌ ఫెయిర్‌ పుస్తకాల పెద్ద పండుగ
యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌
గురుకులాల వైపే అందరి చూపు
భార‌త రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం
నట్టింట్లో వినోద వేదిక టెలివిజన్‌
పిల్లలేమంటున్నారంటే....
రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో ''పునీత్‌''
వెలుగుల క‌ళ‌లు వెల్లి‌విరిసే పండుగ దీపావ‌ళి
ఆక‌లి కొల‌మానాలు ఆర్థి‌క విధానాలు
అంబానీ, అదానీలకు సంపదలు అభాగ్యులకు అప్పుల తిప్పలు

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.