Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సౌందర్యరాశి, బాలీవుడ్‌ నటి లీలానాయుడు | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Jul 25,2021

సౌందర్యరాశి, బాలీవుడ్‌ నటి లీలానాయుడు

అందానికి మారు పేరుగా నిలిచిన ప్రపంచ సౌందర్యరాశి, బాలీవుడ్‌ నటి, నిర్మాత, దర్శకురాలయిన లీలా నాయుడు మన తెలుగమ్మాయి. ఒక దశాబ్దం పాటు ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌లలో తన ఫొటోనే ప్రముఖంగా కనిపించేది. సినీ జీవితంలో ఎన్నో విజయాలు చవిచూసింది... అందరి మన్నలను అందుకోవడంతో పాటు తనతో ఒక సారి మాట్లాడితే చాలని ఎంతో మంది ఎదురుచూసే స్థాయిలో నిలిచింది లీలానాయుడు. సినీ జీవితం అందలం ఎక్కించినా... వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు తిని... భర్త, పిల్లలకు దూరమై... జీవిత చరమాంకంలో ఒంటరితనాన్ని అనుభవించిన ఈ నటి వర్థంతి జులై 28న ఉంది.. ఈ సందర్భంగా ఆమెను స్మరిస్తూ...
     పదిహేను సంవత్సరాల వయసులో 1954లో ''ఫెమినా మిస్‌ ఇండియా'' గా ఎన్నికయ్యారు లీలానాయుడు. అదే సంవత్సరం ''వోగ్‌'' మ్యాగజైన్‌ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన అందమైన మహిళల పోటీలో జైపూర్‌ మహారాణి గాయత్రీ దేవి సరసన పది మంది అందమైన మహిళల జాబితాలో ఆమె ఒకరుగా చోటు దక్కించుకున్నారు. 1950 నుండి 1960 వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌లలో ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ''అనురాధ'' చిత్రంతో బాలీవుడ్‌లో సినీ రంగ ప్రవేశం చేసిన ''యే రాస్టే హైన్‌ ప్యార్‌ కే'' సినిమాలోని లీలా నటన పలువురి మన్ననలు అందుకుంది. కొన్ని దశాబ్దాల పాటు లీలా నాయుడు సెలబ్రిటీగా వెలుగొందుతున్నపుడు ఆమెతో మాట్లాడాలి.. లేదా దూరం నుంచైనా ఒకసారి చూస్తే చాలని ప్రముఖులెందరో తహతహలాడేవారు ఆ రోజుల్లో. అలాంటి లీలానాయుడు జీవిత చరమాంకంలో ఏకాంతానికి బంధి అయ్యి ఒంటరి జీవితాన్ని గడిపింది. కాగా ఆమె మరణా నంతరం 2011లో భారత ప్రభుత్వం లీలానాయుడు స్మారకార్థం తపాలా బిళ్ళను విడుదల చేసింది.
కుటుంబ నేపథ్యం
    లీలానాయుడు 1940 సంవత్సరంలో బొంబాయిలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ''పత్తిపాటి రామయ్య నాయుడు'', ఫ్రెంచి వనిత ''మార్తే మాంగే'' దంపతులకు జన్మించిన ఏకైక కుమార్తె లీలానాయుడు. రామయ్య నాయుడు పారిస్‌లోని యునెస్కో శాస్త్ర సలహాదారుగా, తరువాత టాటా సంస్థకి సలహా దారుగా పనిచేశారు. రామయ్య నాయుడు యునెస్కో శాస్త్ర సలహా దారుగా ప్రపంచ ప్రసిద్ద శాస్త్రవేత్త నోబెల్‌ గ్రహీత ''మేడమ్‌ క్యూరీ'' దగ్గర పని చేస్తున్నపుడు ఫ్రెంచి వనిత మార్తే మాంగేను వివాహమాడారు. మార్తా జర్నలిస్ట్‌, ఇండోలాజిస్ట్‌, డాక్టర్‌ మార్తా స్విస్‌-ఫ్రెంచ్‌ మూలానికి చెందినవారు. దక్షిణ-ఫ్రాన్స్‌లోని పాంట్‌ డి అవిగ్నాన్‌ నుండి, సోర్బొన్నె నుండి పిహెచ్‌డి పొందిన మార్తా, భారతదేశానికి సంబంధించిన విషయాలలో పరిశోధకురాలు. బొంబాయిలో జన్మించిన లీలా నాయుడు ఐరోపాలో పెరిగింది, స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్నత పాఠశాలలో, ఈక్వెల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లోవిద్యను అభ్యసించింది.
రాజ్‌కపూర్‌ సినిమాలను నిరాకరించిన లీలా
     ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజ్‌కపూర్‌ తన స్వంత బ్యానర్లో నిర్మిస్తున్న నాలుగు చిత్రాల్లో నటించేందుకు లీలా నాయుడు నిరాకరించింది. ముంబైలో షమ్మీకపూర్‌ వివాహంలో మెరుపు తీగలా ఉన్న లీలానాయుడిని చూసిన రాజ్‌కపూర్‌ తన తదుపరి చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో లీలా నటించేలా ఒప్పించారు. అయితే ఇండియాలో వున్న పల్లెటూళ్ళను ఎప్పుడు చూడని లీలా ఆగ్రా దగ్గర వున్న ఒక పల్లెటూరులో రెండు వారాలు వుండేలా రాజ్‌కపూర్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఫోటో ఘాట్‌ కోసం ముంబై ఆర్‌కె స్టూడియోకి వెళ్ళింది లీలా. ఫోటోఘాట్‌లో వేసుకోవడానికి మాడరన్‌ డ్రస్‌ ఇవ్వడంతో నేను పల్లెటూరి అమ్మాయి పాత్రలో కదా నేను చేయాల్సింది ఈ డ్రస్‌ ఇచ్చారేంటి? అని ఆడగడంతో రాజ్‌కపూర్‌ వరుసగా తీసే నాలుగు సినిమాలు మీతో తీద్దామనుకుంటున్నారు అందుకే అన్నీ డ్రెస్సుల్లో ఫోటో ఘాట్‌ చేస్తున్నామని ఆయన అసిస్టెంట్‌ చెప్పడంతో అది నచ్చని లీలా వారి ప్రతిపాదనని తిరస్కరించింది. అంతకుముందు లీలకి చాలా మంది చెప్పారు. రాజ్‌కపూర్‌తో జాగ్రత్తగా వుండమని ఆయన తనతో నటించే హీరోయిన్స్‌తో ప్రేమలో పడి పోతుంటాడని, దీంతో వాళ్ళకి గుడ్‌బై చెప్పేసి ఢిల్లీ తిరిగి వచ్చేసింది లీలానాయుడు. ముంబై నుండి ఢిల్లీకి తిరగి వచ్చాక పై చదువుల కోసం ఆక్స్‌ఫర్డ్‌ ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే సితార్‌ రవిశంకర్‌ సోదరుడి దగ్గర భారతనాట్యం నేర్చుకున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు.
వైవాహిక జీవితం
     భారత నాట్యం నేర్చుకుంటున్న సమయంలోనే లీలా నాయుడు 1957 లో ఓబెరారు హౌటళ్ళ స్థాపకుడు మోహన్‌ సింగ్‌ ఓబెరారు కుమారుడు తిలక్‌సింగ్‌ ఓబెరారుని వివాహం చేసుకుంది. 17 సంవత్సరాల వయసులోవున్న లీలా నాయుడు కన్నా ఓబెరారు 16 సంవత్సరాల పెద్దవాడు. వారికి కొన్నాళ్ళ అనంతరం మాయ, ప్రియా కవల కుమార్తెలు కలిగిన సంవత్సరానికే వారి కుటుంబంలో ఇమడలేక ఏర్పడిన విబేదాల కారణంగా తిలక్‌రాజ్‌తో విడాకులు తీసుకుంది. తిలక్‌ ఒబెరారుతో విడిపోయి అమ్మనాన్నల వద్దకు వచ్చేసిన లీలా నాయుడు కోర్టులో పిల్లల సంరక్షణ బాధ్యతలు తనకు చెందాలని కేసు వేశారు. కానీ, భర్త ఓబెరారుకే పిల్లల సంరక్షణ బాధ్యతలు చెందుతాయని కోర్టు తీర్పు చెప్పడంతో, పిల్లల కోసం తపించిన దూరదష్టవంతురాలైన తల్లిగా, 19 సంవత్సరాలకే వివాహం, సంతానం విడాకులు అన్నీ దశలను చవి చూసింది. ఆ తరువాత లీలానాయుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆ సమయంలో వల్ల నాన్నకి పరిచయస్థురాలైన సంఘ సేవకురాలు పప్పుల జయకర్‌ సలహా మేరకు తత్వవేత్త జిడ్డు కష్ణమూర్తిని కలుసుకున్న లీలా నాయుడు అతని బోధనల పట్ల బాగా ఆకర్షితులయ్యారు. ప్యారీస్‌లో ఉన్న సమయంలోనే ఆమె ప్రముఖ దర్శకుడు ''జీన్‌ రెనోయిర్‌'' తాము వేసే నాటకంలో ఒక వేషం వేయమని ప్రోత్సహించడంతో పాటు నటనలో చాలా మెళుకువలు నేర్పాడు. జీన్‌ రెనోయిర్‌తో ప్రఖ్యాత స్పానిష్‌ ఆర్టిస్ట్‌ సాల్వడార్‌ డాలి పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్యారీస్‌ నుండి ఇండియా తిరిగి వచ్చారు లీలానాయుడు.
సినీ ప్రస్థానం
     లీలానాయుడు ఆక్స్‌ఫర్డ్‌ వెళ్ళి చదువుకోవాలన్న ప్రయత్నం ఆగిపోయింది. తరువాతి జీవితం ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఆమె తలుపు తట్టింది. రవిశంకర్‌ భార్య కమల చక్రవర్తి తీసిన ఫోటోలు చూసి హషికేశ్‌ ముఖర్జీ లీలా నాయుడుకి అవకాశం ఇచ్చారు. 1960 లో హషికేశ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ''అనురాధ'' చిత్రంలో నటిగా బలరాజ్‌ సాహ్నితో కలిసి సినీరంగ ప్రవేశం చేసింది. సితార్‌ విద్వాంసులు రవిశంకర్‌ స్వర పరిచిన ఈ చిత్రంలోని పాటలు ''హే రే వో దిన్‌ కెవ్న్‌ నా ఆయే'', ''జానే కైసే సప్నోన్‌ మెయిన్‌ ఖో గయిన్‌ అంకియాన్‌'', ''కైస్‌ దిన్‌ బీటే కైసీ బీటీ రతీన్‌'' ప్రేక్షకులను అలరించిన, ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా విజయవంతం కాలేకపోయింది. అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందడమే కాకుండా 1961లో బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గోల్డెన్‌ బేర్‌కు నామినేషన్‌ను గెలుచుకుని, ప్రేక్షకులు, విమర్శకుల నుండి లీలా ప్రశంసలు అందుకుంది. 1962లో వచ్చిన ఆమె తదుపరి చిత్రం ''ఉమ్మీద్‌'', అశోక్‌ కుమార్‌, జారు ముఖర్జీలతో కలిసి లీలా నాయుడు ఈ చిత్రంలో నటించారు. 1963లో ఆర్‌.కె. నాయర్‌ దర్శకత్వం వహించిన ''యే రాస్టే హైన్‌ ప్యార్‌ కే'' లో ఆమె వ్యభిచార భార్యగా నటించింది. సునీల్‌ దత్‌, రెహమాన్‌ తో కలిసి నటించిన ఈ చిత్రం 'కే.ఎమ్‌. నానావతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర' కేసు ఆధారంగా యదార్థ జీవిత కథతో రూపొందించబడింది. వివాదాస్పద థీమ్‌ ఉన్నప్పటికీ, ఈ చిత్రం అపజయం పాలైంది. అయితే ఈ సినిమాలోని ''యే ఖామోషియాన్‌, యే తనహైయాన్‌'' పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రంలో సునీల్‌దత్‌ సరసన పోషించిన పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఇదే ఏడాది వచ్చిన 'జేమ్స్‌ ఐవరీ' దర్శకత్వం వహించిన హిందీ, ఇంగ్షీషు సినిమా ''ది హౌస్‌ హౌల్డర్‌'' చిత్రంలో లీలా నాయుడు నటించింది. ఈ చిత్రంలో లీలా నాయుడు తిరుగుబాటు చేసిన యువ వధువు ప్రధాన పాత్ర పోషించింది. హిందీ ప్రధాన స్రవంతి సినిమాలో 1964లో బాగీ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత 1969లో మర్చంట్‌-ఐవరీ చిత్రం ''ది గురు'' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. 1985 లో శ్యామ్‌ బెనెగల్‌ చిత్రం ''త్రికాల్‌'' లో నటించింది. ఈ చిత్రంలో లీలా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్యామ్‌బెనెగల్‌ ''త్రికాల్‌'' చిత్రం లీలా నాయుడుతో నిర్మించడానికి ముందు, 1960లో ఒక ఫాబ్రిక్‌ బ్రాండ్‌ కోసం ఒక అడ్వర్టయిస్‌ ప్రకటనను చిత్రీకరించారు. ఆమె అప్పుడు చాలా అందంగా వుండేది. అయితే ఆ ప్రకటన వచ్చిన వెంటనే, టైమ్‌ మ్యాగజైన్‌ ఆమెను ప్రపంచంలోనే అత్యంత పది మంది అందమైన మహిళలలో ఒకరిగా ఎంపిక చేసింది. 1992 లో ప్రదీప్‌ క్రిషెన్‌ దర్శకత్వం వహించిన ''ఎలక్ట్రిక్‌ మూన్‌''లో నటించడం ఆమె చివరి సినిమా. లీలానాయుడు బాలీవుడ్‌లో తనకు వచ్చిన అనేక అవకాశాలను తిరస్కరించి, కమర్షియల్‌ పాత్రలకు దూరంగా వుంటు అర్ధవంతమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది. లీలానాయుడు నటిగా చాలా దశాబ్దాలుగా కొనసాగిన, నటించిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ చిత్రరంగంపై లీలా ఒక అద్భుతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసింది, ఆ తర్వాత లీలా నాయుడు బొంబాయికి చెందిన కీ నోట్స్‌ మ్యాగజైన్‌లో ఎడిటర్‌గా సైతం ఉద్యోగం చేసింది. జెర్రీ పింటోతో కలిసి లీలా నాయుడు ''ప్యాచ్‌ వర్క్‌ లైఫ్‌'' పుస్తకాన్ని రచించారు.
డాక్యుమెంటరీల నిర్మాణం
     సినీ జీవితం అనంతరం లీలానాయుడు నిర్మాతగా, దర్శకురాలిగా తీసిన తొంబై శాతం డాక్యుమెంటరీలు అట్టడుగు వర్గాల గురించే. బొంబాయిలో రైలు పట్టాల పక్కన నివసించే గుడిసె వాసులు, ఇటుక బట్టీలలో పని చేసే కార్మికులు, లండన్‌ వీదుల్లో చిల్లర పోరాటాలకు దిగే యువతరం ఆమె కథా వస్తువులు. మానసిక వికలాంగులైన పిల్లలపై ''షార్టేన్‌ చైల్డ్‌ హుడ్‌'' పేరుతో డాక్యుమెంటరీని నిర్మిం చారు. ఇది లీలా నాయుడు ఫిల్మ్స్‌ పతాకంపై కుమార్‌ షాహ్ని దర్శకత్వం వహించిన మొదటి ప్రాజెక్ట్‌. తరువాత ఆమె యునికార్న్‌ ఫిల్మ్స్‌ కింద మరొక చిత్రం హౌస్లెస్‌ బాంబే చేయడానికి నమోదు చేసింది. జి ఆర్‌ డి టాటా కోరిక మీద ఒక డాక్యుమెంటరీ తీసి ఇచ్చారు. లీలానాయుడు గోవాకు చెందిన తన చిన్ననాటి స్నేహితుడైన ప్రఖ్యాత రచయిత, కవి 'డామ్‌ మొరేస్‌' తో కలిసి బెంగాల్‌లో నక్సలైట్లపై, బొగ్గు కార్మికులపై డాక్యుమెంటరీలు తీశారు. ఇలా రెండు ఏళ్లపాటు పని చేశాక 'డామ్‌ మొరేస్‌' లీలా దగ్గర వివాహ ప్రస్తావన తెచ్చాడు. ఆ ప్రతిపాదనకు లీలా అంగీకారం తెలపింది.
'డామ్‌ మొరేస్‌' తో రెండవ వివాహం
     1969లో 'డామ్‌ మొరేస్‌'ను వివాహమాడింది. వారు హాంగ్‌కాంగ్‌, న్యూయార్క్‌, ఢిల్లీ, ముంబైలలో 25 సంవత్సరాల పాటు వివాహబంధం కొనసాగించిన అనంతరం విడాకులు తీసుకున్నారు. పాతికేళ్ళ పాటు కలిసి జీవించిన రెండవ భర్త డామ్‌ మొరేస్‌ అనూహ్యంగా తనని ఒంటరిని చేసి సరయు శ్రీవత్స అనే అమ్మాయితో వెళ్ళిపోవడంతో, తన జీవిత చరమాంకంలో లీలానాయుడు పదేళ్ళ పాటు ముంబైలోని కొలాబాలో ఏకాంతానికి బంధి అయ్యి, అందరికీ దూరమయి, కరిగి పోయిన కళలతో, తరిమే జ్ఞాపకాలతో ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నారు.
ఏకాంతంలో ఒంటరి జీవితం
     రెండవ భర్త మోరేస్‌ నుండి విడిపోవటంతో లీలా నాయుడు తన ప్రజా జీవితం నుండి రిటైర్‌ కావడానికి కారణమైంది. ఆమె ఏకాంతంలో ఒంటరి జీవితం గడిపారు. తన తండ్రికి టాటా చేత ఇవ్వబడిన కొలాబా కాజ్‌వే, సార్జెంట్‌ హౌస్‌ వద్ద, ఇవ్వబడిన ప్లాట్‌లో నివాసం ఏర్పర్చుకుని సందర్శకులను కలుసుకుంటూనే, ఆమె తన స్నేహితులను పిలిచి, కుమార్తెలు, మనవరాళ్లతో కాలం గడిపేది. సెలబ్రెటీగా వెలుగొందిన లీలానాయుడు ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌కు ఇంటిని అద్దెకు ఇవ్వవలసిన దుస్థితి వచ్చింది. ఆమె కుమార్తె ప్రియా 8 ఫిబ్రవరి 2008 న గుండెపోటుతో మరణించడంతో మనస్థాపానికి గురైంది. లీలా నాయుడు 79 సంవత్సరాల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో 2009 జూలై 28 న 69 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు.
లీలా జీవిత ప్రయాణంలో ప్రముఖులు
    లీలా నాయుడు జీవిత ప్రయాణంలో కలిసి పనిచేయడం లేదా వాళ్ళని ప్రభావితం చేయడం, లేదా వాళ్ళ వల్ల తాను ప్రభావితం కావడం లాంటి ప్రముఖుల్లో కొంతమందిలో బాలీ వుడ్‌ ప్రముఖులు రాజ్‌కపూర్‌, హషీకేశ్‌ ముఖర్జీ, సునీల్‌ దత్‌, శశికపూర్‌, సితార్‌ విద్వాంసులు పండిట్‌ రవిశంకర్‌, భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రముఖ రాజకీయ నాయకురాలు సరోజినీ నాయుడు, స్వీడిష్‌ నటీమణి బెర్గ్‌ మాన్‌, స్పానిష్‌ పేయింటర్‌ సాల్వడార్‌ డాలి, ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ జీన్‌ రెనోయిర్‌, ఇటాలియన్‌ డైరెక్టర్‌ రోజ్లిన్‌ రాబర్ట్‌, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కష్ణమూర్తి, యోగా గురువు బి.కె. అయ్యంగార్‌, మీడియా అధిపతి రామనాథ్‌ గోయాంక, పారిశ్రామిక వేత్త జె.ఆర్‌.డి టాటా, ఒబెరాయి హౌటల్‌ అధినేత మోహన్‌ సింగ్‌, మొదలైన వారు ఉన్నారు.
తెరకెక్కని బయోగ్రఫీ
    లీలానాయుడు 2009లో తన సెమీ బయోగ్రఫీలో ఇస్మాయిల్‌ మర్చంట్‌, జేమ్స్‌ ఐవరీలతో చిత్రాన్ని రూపొందించడం గురించి, సంప్రదించినప్పటికీ, స్క్రిప్ట్‌ నచ్చక పోవడంతో లీలానాయుడు బయోగ్రఫీ చిత్రంగా రూపొందలేక పోయింది. అయితే ఆమె మరణాంతరం 2009 సెప్టెంబర్‌లో, బిడిషా రారు దాస్‌, ప్రియాంజనా దత్తా లీలనాయుడు జీవితంపై రూపొందించిన లీల అనే డాక్యుమెంటరీ విడుదలైంది.
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్‌ జర్నలిస్టు, సినీ విమర్శకులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పెరుగుతున్న మూఢనమ్మకాలు మన ఏలికలు
మధురామృతానికి మారుపేరు మహ్మద్‌ రఫీ
సుట్టబట్ట సుట్టి బోనమెత్తుకున్న తెలంగాణ
భార‌తీయ స‌మాంత‌ర చ‌ల‌న‌చిత్ర న‌టుడు న‌సీరుద్దీన్ షా
జనాభా సమస్య - భిన్న కోణాలు
కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి

తాజా వార్తలు

03:30 PM

బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు..బీజేపీతో నితీశ్ తెగదెంపులు

03:20 PM

ప్ర‌ముఖ మ‌రాఠి లెజెండ‌రీ నటుడు కన్నుమూత

08:13 AM

టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

07:43 AM

నడిరోడ్డుపై కానిస్టేబుల్ దారుణ హత్య

12:10 PM

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్

12:06 PM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత...

11:56 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

11:50 AM

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష

11:41 AM

దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు

11:40 AM

కాబూల్‌లో మరోసారి పేలుళ్లు.. 8 మంది మృతి

11:33 AM

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

11:29 AM

కామన్వెల్త్ క్రీడల్లో భవీనా పటేల్ సరికొత్త చరిత్ర

11:27 AM

షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం

11:21 AM

తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలకు రూ. 1,479 కోట్లు విడుదల

06:44 AM

వెస్టిండీస్‌తో నాలుగో టీ 20లో భారత్ విజయం

06:35 AM

కేంద్ర విద్యుత్తు చట్టసవరణపై నేడు నిరసన

08:57 PM

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం

08:30 PM

ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు

07:37 PM

వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

07:11 PM

రాష్ట్ర ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం..వడ్డీ మోహన్ రెడ్డి

07:03 PM

సూర్యాపేటలో ముగ్గురు సీఐల బదిలీ

06:35 PM

ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌

06:06 PM

ఇంగ్లండ్ విజయ లక్ష్యం 164 పరుగులు

05:57 PM

కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన...

05:14 PM

దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్

05:02 PM

మరో నాలుగేళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

04:53 PM

కరోనా కేసులపై 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

04:44 PM

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం బాధాకరం...జీవన్ రెడ్డి

04:40 PM

రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం

04:35 PM

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా : సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.