Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుకోవాలి | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Aug 15,2021

భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుకోవాలి

మహాత్ముని సత్యాగ్రహం భారత ప్రజలను మేల్కొలిపి కదిలించడానికి సిద్ధం చేసింది కానీ వేలాది మంది వీరుల ప్రాణ త్యాగాల అనంతరం, లక్షలాది ప్రజలపై హింసాకాండ తరువాతే స్వాతంత్య్రం సిద్ధించింది. అల్లూరి, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, గదర్‌ వీరులు మొదలైన ఎందరో యోధులు స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారు. జలియన్‌ వాలాబాగ్‌లో పిట్టల్ని కాల్చినట్టు మన ఉద్యమ కారులను డయ్యర్‌ కాల్చేశాడు. వందేమాతరమని పలికితే, మువ్వన్నెల జెండా ఎగిరితే రక్తం చిందేది. అంతటి నిర్బంధానికీ, హింసకూ జఢవకుండా తెల్లదొరల పీడన పోవాలని, మన దేశ సంపదనూ, మానవ శ్రమను దోపిడీ చేస్తున్న వారిని తరిమి కొట్టాలని చేసిన త్యాగాల మీద వచ్చిందే ఈ స్వాతంత్య్రం.
    ఇప్పుడు పరోక్షంగా, ఒక్కోసారి ప్రత్యక్షంగానూ విదేశీ వ్యాపారులకు, కార్పోరేటు శక్తులకు మన సంపద దోచిపెడుతూ భారత దేశ ప్రజల సార్వభౌమత్వానికి, క్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేటి పాలకులకు స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేదు. అందుకే దాన్ని భిన్నంగా పాలన కొనసాగిస్తున్నారు. ఆనాటి వీరుల పోరాట స్ఫూర్తితో ఇప్పుడూ మనం దేశాన్ని రక్షించుకోవాల్సి వుంది. అది మన కర్తవ్యం!
      నేడే స్వాతంత్య్ర దినం - వీరుల త్యాగఫలం.. నేడే నవోదయం - నీదే ఆనందం అనే పాటలోనే రచయిత శ్రీశ్రీ సాధించినదానికి సంతృప్తి పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి అంటాడు. ఆగకోయి భారతీయుడా.. కదలి సాగవోయి ప్రగతి దారులా...
      భారతదేశం సామ్రాజ్యవాద పీడన నుండి విముక్తి అయ్యి 75వ సం||లో అడుగు పెడుతున్నాం. 1757 నుంచి ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ రాణిల పరిపాలనలో మొత్తం 190 సంవత్సరాల పాటు భారతదేశం మగ్గిపోయింది. ఎక్కడో లండన్‌లో బ్రిటిష్‌ గడ్డ మీద నుండే కారల్‌ మార్క్స్‌ వ్యాఖ్యానించినట్టు ''బ్రిటీష్‌ ధనస్వామ్యం భారత కన్నీటి పునాదులపై తమ క్రూరమైన ప్రయోజనాలు వనగూర్చు కోవడానికి, రాజ్య విస్తరణకు మాటలకందని పద్ధతిలో అవలంభించింది. భారతదేశంలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను, యథేచ్చగా దోచుకున్న ఇంగ్లండ్‌ ప్రపంచంలోనే తిరుగులేని సంపన్న దేశంగా మారింది''. భారత ప్రజల పట్ల సంఘీభావాన్ని, బ్రిటీష్‌ దోపిడీ పాలన క్రూరత్వం పట్ల తన ఆగ్రహాన్ని మార్క్స్‌ ప్రకటించడం ఇందులో కనపడుతుంది.
      ప్రపంచంలో జనాభా రీత్యా రెండవ అతిపెద్ద దేశం మనది. ప్రకృతి సంపదలు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశం మనది. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కూడా మనదే. గురజాడ వారు చెప్పినట్లు ''అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోరు - చెట్టపట్టాల్‌ పట్టుకొని దేశస్థులంతా నడవవలసిన భిన్నత్వంలో బహుళత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది. విభిన్న మతాలు ప్రజలున్న దేశం, అలాగే ఏ మతాల సాంప్రదాయాలకు సంబంధంలేని ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉన్న తెగల ఆదివాసీ ప్రజలున్న దేశం.
      కోట్లమంది దేవుళ్ళు, దేవతలున్న దేశం మనదే. రాజ్యాంగంలో నిర్దేశించుకున్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఫెడరలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం, సామాజిక న్యాయం ఎలా అమలు జరుగుతున్నాయో సమీక్షించుకోవల్సిన సందర్భం కూడా ఇది. దేశ స్వాతంత్య్రానంతరం మొత్తం కాలంలో ప్రస్తుతం చివరి ఏడు సంవత్సరాల వర్తమాన కాలంనాటి మోడీ పాలనా కాలంను ప్రత్యేకంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
      అప్పులు చేయడంలో దేశం అత్యంత వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 67 ఏళ్ళలో చేసిన అప్పు 54 లక్షల కోట్లు రూపాయలు అయితే మోడీ పాలనా కాలంలో ఇది 119 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దేశ ప్రజలు రుణ గ్రస్తులు కావడం అంతులేకుండా పెరిగింది.
మన ప్రజాస్వామ్య భారతంలో సామాజిక అసమానతలు అధిగమించడంలో తోటి ఆసియా దేశాలలోనే కాకుండా ఆఫ్రికా దేశౄలతో పోల్చినా కూడా వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం.
      మనకంటే రెండేళ్ళు తర్వాత స్వాతంత్య్రం తెచ్చుకున్న చైనా దేశం ఒలంపిక్స్‌ నుండి అంతరిక్షం వరకూ, విద్య వైద్యం మొదలుకొని మహిళల అభివృద్ధి వరకూ, జీవన ప్రమాణాల్లో, మానవాభివృద్ధి సూచికల్లో ఇలా అన్ని రంగాలలో అమెరికాకు పోటీగా, అనేక అంశాల్లో దాన్ని మించిపోతూ పురోగమిస్తున్నది.
      ఈ ఏడేళ్ళ కాలంలో రాజ్యాంగం పైననే దాడి మొదలైంది. అభివృద్ధి చెందిన దేశౄలుగా పరిగణించ బడుతున్నదేశాలు లౌకిక (మత ప్రశక్తి లేని) రాజ్యాలుగా ఉన్నాయి. అత్యంత వెనుకబడి పోతున్న మత రాజ్యాల సరసననే జేరడానికి మనదేశాన్ని మత రాజ్యంగా మార్చడానికే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ప్రపంచంలో కెల్లా సామాజిక అసమానతలున్న దేశంలో వాటిని మరింత వేగం పెంచడానికి ఎంతో కొంత ఉపశమనంగా ఉన్న రిజర్వేషన్లను పరోక్షంగా రద్దు చేస్తున్నది కేంద్ర బిజేపీ. ఉదాహరణకు దేశం మొత్తాన్ని ప్రైవేటుపరం చేసేస్తే అందులో మహిళలు, వికలాంగులు, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్‌ల ప్రశక్తి లేదని తేల్చి చెప్పింది. రానున్న కాలలో సామాజిక అసమానతలు, అణచివేత దేశంలో మరింత పెరగడానికే బీజేపీ పాలన దోహదపడుతున్నది.
      దేశ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడానికి బీజేపీ ముందుకు రావడం లేదు. జీడీపీలో వాటికి కేటాయింపులు నామమాత్రంగా కూడా లేకుండా పోతున్నాయి.
      ఇటీవల యూఎస్‌డీఏ అంతర్జాతీయ అధ్యయనం ప్రనకారం ఆహార అభద్రతలో పెరుగుతున్న దేశాలలో భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఇండోనేషియా దేశాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. కోవిడ్‌ సంక్షోభం ముందు నాటికే మన దేశంలో 40 సంవత్సరాలలో ఎన్నడూ చూడని నిరుద్యోగ సమస్య తీవ్రత నెలకొన్నదని 2019 నాటికి అధ్యయనాలు పేర్కొన్నాయి.
      అంటే ఏ రంగంలో ఇలా చూసుకుంటూ పోయినా కాంగ్రెస్‌ కంటే బీజేపీ పాలన మెరుగ్గా లేకపోగా మరింత దిగజారిందని పార్లమెంటులో ఇచ్చిన లెక్కలు, అనేక స్వతంత్య్ర అధ్యయనాలు తెలుపుతున్నాయి. బడా కార్పొరేట్లు బ్యాంకులకు కట్టుకుంది బకాయిపడిన ఋణాలను రద్దు చేయడంలో కార్పొరేట్‌ టాక్స్‌ రాయితీలలో కూడా మోడీ పాలన దేశ చరిత్రలోనే అగ్రభాగాన నిలిచింది.
      కేవలం డీజిల్‌, పెట్రోల్‌ రెండు వస్తువుల మీద పెంచిన పన్నుల ద్వారా మోడి పాలనలో 22 లక్షల కోట్ల రూపాయల పన్నుల ద్వారా వసూలు చేస్తే ఇందులో 14 లక్షల కోట్ల రూపాయలను ఈ చివరి మూడేళ్ళలోనే (కరోనా కాలంలో కలుపుకుని) వసూలు చేశారు. డీజీల్‌ ధర పెరగడంతోనే రవాణాతో సహా ఎన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయో ఊహించవచ్చు. ప్రజలను ధరలు, పన్నులు పేరుతో లూటీ చేయడంలో 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో మోడీ పాలన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం ఇద్దరు పారిశ్రామికవేత్తలే దేశ చరిత్ర రికార్డులను దేశ సంపదలో వెనకేసుకోవడంలో సరికొత్త చరిత్రను మోడీ హయాంలోనే సృష్టించారు. ఒక సం||లో కార్పొరేట్‌ ట్యాక్సు తగ్గించడం ద్వారా కార్పొరేట్ల కోసం ఒక సంవత్సరంలో లక్షా 48 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రజల్లో అసమానతలు పెరగడంలో వేగం ఊపందుకున్నది మోడీ హయాంలోనే.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రమాదం
      వైవిధ్యం, భిన్నత్వం, బహుళత్వం ప్రకృతికి అందం, దేశానికి అందం. 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆరున్నర లక్షల గ్రామాలు, 720 స్థానిక భాషలు, అందులో రాజ్యాంగంలోని 8వ అధికరణంలో భాగంగా 22 అధికార భాషలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క వేషధారణ, ఆదివాసీ తెగల మహిళల వేషధారణలు అనేక రకాలు. ఇంత భిన్నత్వం ఏ దేశంలో కానరాదేమో. ఆహారపు అలవాట్లు అనేకం. అయితే ఈ భిన్నత్వంలో ఏకత్వం బీజేపీకి రుచించడం లేదు. వైవిద్యాన్ని దెబ్బ తీయడం దాని లక్ష్యం. ఒకే భాష, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే దేవుడు, ఒకే (జమిలి) సారి ఎన్నికలు, ఒకే సంస్కృతి, ఒకే రకమైన ఆహార అలవాట్లు, ఏకత్వం సాధన కోసం బహుళత్వం మీద మతోన్మాద దాడులు, హత్యలు, ధ్వంస రచన అది ఎంచుకున్న మార్గం. మెజారిటీ యిజం పేరుతో అన్ని రకాల మైనారిటీలపై దుర్మార్గపు దాడులు.
      బహుళ పార్టీల వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ విధానం స్థానంలో అధ్యక్ష తరహా పాలన అంతిమంగా మత రాజ్య స్థాపన. రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను తుడిచి పెట్టడం కోసం జమిలి ఎన్నికల విధానం తేవడం. అందమైన, అపురూపమైన అరుదైన ప్రకృతి వనరులను కొద్ది మందికి ప్రైవేటు ఆస్తిగా కట్టబెట్టడం కోసం నూతన అటవీ విధానం - 2019 లాంటి చట్టాలు. దేశ ఆర్థికాభివృద్ధిలో చక్కని పాత్రను పోషిస్తున్న సహజ వనరులు, ప్రకృతి సంపదలను వ్యక్తుల ప్రైవేటు ఆస్థిగా మార్చడం భారతదేశానికి ప్రమాదంగా పరిణమించబోతున్నది.
      దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నవి బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ రంగాలు, భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవన్నీ ఇప్పటి వరకూ ప్రజల పెట్టుబడితో ప్రజల కోసం ప్రజలు, కార్మికుల శ్రమ కలిపి నిర్మించుకున్న సంస్థలు. వ్యవసాయ రంగానికి, నిరుద్యోగుల ఉపాధికి, చేతి వృత్తులకు కూడా వీటికే ఋణాలు లభించేవి. ఆయా రంగాలు అభివృద్ధికి ఈ పెట్టుబడి ఉపయోగపడింది.
      75 ఏండ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతున్న నాటికి ఇవన్నీ నలుగురైదుగురి వ్యక్తిగత గుత్త సంపదగా, ఆస్థిగా మారిపోనుండటం 130 కోట్ల మంది ప్రజల భారతీయుల ప్రజోజనాలు నాశనం కావడం వేగవంతం అవుతున్నది.
      అవసరంలేని రంగంలో కూడా విదేశీ పెట్టుబడులను రెడ్‌ కార్పెట్‌ పరిచి పిలుస్తున్నారు. మొత్తం దేశంలోని రిటైల్‌ వ్యాపారంలో కేవలం 20 శాతం వాటాను విదేశీ వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు పొందగలిగినా రిటైల్‌ రంగం మీద ఉపాధి పొందుతున్న భారతీయులు ఎనిమిది కోట్ల మంది ఉపాధిని కోల్పోతారని అంచనా.
      ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియనివి కావు. ప్రజల ప్రయోజనాల కంటే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్లకు దేశ సంపద అంతా దోచిపెట్టి అందులో అయిదు శాతం వాటాను ఎన్నికల ఖర్చుగా ఓటర్లను కొనుగోలు చేయడానికి, మీడియాను మేనేజ్‌ చేయడానికి వినియోగించినా తమ అధికారానికి ఎటువంటి ఢోకా ఉండదని పాలకవర్గ పార్టీలు విశ్వాసంతో ఉన్నాయి.
      అలాగే ప్రజల హక్కులను, వనరులను హరించడంతో పాటు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, ద్వేషమే దేశభక్తి అనే కుయుక్తిని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నాలు ఎన్నడూ లేనంత వేగవంతం అయ్యాయి. ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారు. అంటాడు లెనిన్‌. అందుకే
అంతిమంగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్రోద్యమ నేతల, అమర వీరుల, రాజ్యాంగ కర్తల స్ఫూర్తిని ఈ దేశంలో కాపాడటానికి ఏం చేయాలి?
      ''సుందర భారత మందరిదీ - అందరు మానవులొకటేలే'' అన్నట్టుగా దేశ రాజకీయ స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూనే.... దేశ సమైక్యత, సమగ్రత, మత సామరస్యాలను కంటికి రెప్పలాగా కాపాడు కోవడానికి కంకణ ధారులము కావాలి. కులం, మతం, లింగ అణచివేత, వివక్ష, పీడనలను అంతం చేసే దాకా విశ్రమించకూడదు. దేశ ప్రజల సహజీవనాన్ని ద్వేషపూరితం చేస్తున్న ప్రమాదకర శక్తుల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం గావించాలి. జాతీయోద్యమ కాంక్షలు అయిన ఆర్థిక, సామాజిక సమానవత్వం ఏమాత్రం సాధించబడలేదనే వాస్తవాన్ని గుర్తెరిగి అందుకోసం ప్రజలను సంఘటిత పరచాలి.
      రాజ్యాంగంలో పొందుపర్చుకున్న లైకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద స్ఫూర్తిని సాధించాలి. సామాజిక న్యాయ సాధనకోసం, దేశ ఆర్థిక స్వాలంబన కోసం కమ్యూనిస్టులే కాదు అంబేద్కర్‌ చెప్పినట్టు భారీ పరిశ్రమలు, బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌, స్టాక్‌ మార్కెట్స్‌ అన్నీ ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలి. అందుకోసం జరుగుతున్న పోరాటాలకు విస్తారమైన మద్దతు కూడగట్టాలి. దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లు కబళించకుండా రైతన్నలు చేస్తున్న ఆందోళనను గెలిపించడమే ''లాఠీలకు తలపోటీలిచ్చి..... గుండ్ల దెబ్బలకు గుండెలనిచ్చి చచ్చిన వారి త్యాగం నిలబెట్టడం అవుతుంది. అమర వీరులెందరో ఆశించిన స్వరాజ్యం అదే- సమరాలను సాగించి సాధించిన స్వతంత్య్రం అదే. స్వాతంత్య్రోద్యమంలో ఏ మాత్రం సంబంధంలేని వారు దేశ స్వాతంత్య్రానికి తలపెడుతున్న ముప్పు నుండి దేశాన్ని కాపాడుకోవడమే వజ్రోత్సవాల నిజమైన స్ఫూర్తి...!!
- బండారు రవికుమార్‌, 9121080160

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి
బుక్‌ ఫెయిర్‌ పుస్తకాల పెద్ద పండుగ
యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌
గురుకులాల వైపే అందరి చూపు
భార‌త రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం
నట్టింట్లో వినోద వేదిక టెలివిజన్‌
పిల్లలేమంటున్నారంటే....
రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో ''పునీత్‌''
వెలుగుల క‌ళ‌లు వెల్లి‌విరిసే పండుగ దీపావ‌ళి
ఆక‌లి కొల‌మానాలు ఆర్థి‌క విధానాలు
అంబానీ, అదానీలకు సంపదలు అభాగ్యులకు అప్పుల తిప్పలు

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.