Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో ''పునీత్‌'' | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Nov 07,2021

రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో ''పునీత్‌''

టాలీవుడ్‌ అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరితోనూ పునీత్‌ రాజ్‌ కుమార్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన 'యువరత్న' సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేశారు. ఇక పునీత్‌ నటించిన 'చక్రవ్యూహ' సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాట పాడటం, పూరీ జగన్నాథ్‌, మెహర్‌ రమేష్‌ వంటి దర్శకులతో పనిచేయడంతో పాటు.. చాలామంది స్టార్‌ హీరోలతో కలిసి పనిచేశారు పునీత్‌ రాజ్‌ కుమార్‌.
     ''అప్పు'' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణం కన్నడ సినీ పరిశ్రమకు ఒక లోటు అయితే ఆయన సేవా కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్న వారికి తీరని లోటు. పవర్‌ స్టార్‌గా అశేష కన్నడ ప్రేక్షకాదరణ... చేసిన సినిమాలు29... జీవించింది కేవలం46 ఏండ్లు.. యాక్టర్‌, ప్లే బ్యాక్‌ సింగర్‌, టెలివిజన్‌ ప్రెజంటర్‌, ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినీ సేవలు. 90 శాతం సక్సెస్‌ రేట్‌,100 కోట్ల మార్కెట్‌ ఉన్న హీరో, ఇవన్నీ నాణేనికి ఓవైపు మాత్రమే. ఇవే కాదు..అప్పుతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన పునీత్‌.. నటసార్వభౌమగా.. తండ్రి నటవారసత్వం నిరూపిస్తూనే.. రాజకు మారుడిగా.. ఒక వెలుగు వెలుగుతూ.. సేవా కార్యక్రమాల వైపు దష్టి సారించి 45 ఉచిత స్కూల్స్‌ ఏర్పాటు చేసి1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వద్ధుల ఆశ్రమాలు, 32 గ్రామాలు దత్తత, 19 గోశాలలు నిర్వహించడంతో పాటు, మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన ''శక్తి ధామ'' అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా వెలుగులోకి రాని సామాజిక సేవలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కోవిడ్‌ సమయంలో అన్నదానాలు, పోలీసులతో ఉండి ప్రజలను అప్రమత్తం చేసి''రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో'' అని నిరూపించిన పునీత్‌ మరణానంతరం ఆయన కుటుంబం రెండు కళ్లు దానం చేసి మరో నలుగురికి చూపు తెప్పించారు.
    పునీత్‌ రాజ్‌కుమార్‌ చెన్నైలో 17 మార్చి 1975లో ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. వీరికి ఐదుగురు సంతానం కాగా.., పునీత్‌ రాజ్‌కుమార్‌ అందరికంటే చిన్నవాడు.పునీత్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు,రాజ్‌కుమార్‌కుటుంబం మైసూర్‌కు వచ్చి స్థిరపడింది.పునీత్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా చదివాడు. శివరాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌ కుమార్‌ అతని సోదరులు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ కూడా కన్నడ చిత్రరంగంలో పాపులర్‌ యాక్టర్‌. పునీత్‌ నటుడిగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, నిర్మాతగా కన్నడ చిత్రాలు చేసి ''పవర్‌స్టార్‌''గా పాపులారిటీ తెచ్చుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి డ్యాన్సర్‌ కూడా.పునీత్‌ ను కన్నడ సినీ ప్రేక్షకులు 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటారు. పునీత్‌ తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన చిక్‌ మంగళూరుకు చెందిన అశ్విని రేవంత్‌ను 1డిసెంబర్‌ 1999న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ధతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
''అప్పు'' తో హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన పునీత్‌
    బాల నటుడిగా తండ్రి డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ వారసత్వాన్ని స్వీకరించిన పునీత్‌ 2002లో హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'అప్పు' సినిమాలో నటించి మొదటిసారి కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ను అందరూ 'అప్పు' అని ముద్దుగా పిలుచుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత పునీత్‌ 'అభి', 'వీర కన్నడిగ', 'మౌర్య', 'ఆకాశ్‌', 'అజరు', 'అరసు', 'మిలానా', 'వంశీ', 'రామ్‌', 'జాకీ', 'హుడుగారు', 'రాజకుమార్‌', 'అంజనీపుత్ర' సినిమాలతో రికార్డుల మోత మోగించి..కన్నడ సినీపరిశ్రమలో అత్య ధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న సెల బ్రిటీగా టాప్‌లో నిలిచాడు. శ్యాండిల్‌ వుడ్‌లో కన్నడ 'పవర్‌ స్టార్‌'గా ఎంతోక్రేజ్‌
    సంపాదించు కున్న పునీత్‌ రాజ్‌ కుమార్‌ నేపథ్య గాయకుడుగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా, నిర్మాతగా వ్యవహ రించిన అతను ఇప్పటి వరకు 29 సినిమాలలో నటించి, దాదాపు 25 విజయాలు అందుకొన్నాడు. 90 శాతానికి పైగా సక్సెస్‌ రేటుతో 100 కోట్ల మార్కెట్‌ ఉన్న ఏకైక సౌత్‌ హీరోగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కర్ణాటకలో నెంబర్‌ వన్‌గా నిలిచారు.
హీరోగా పరిచయం చేసిన పూరీ జగన్నాథ్‌
    బాలనటుడిగా దాదాపు 20 చిత్రాలకు పైగా నటించిన పునీత్‌ ఎంట్రీ కోసం.. కన్నడ లెజండ్రీ నటుడైన ఆయన తండ్రి రాజ్‌ కుమార్‌ సరైన కథల కోసం వెతుకుతున్నారు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్‌ చెప్పిన 'అప్పు' కథ ఆయనకి బాగా నచ్చింది. వెంటనే పూరీపై నమ్మకంతో కొడుకు ఎంట్రీని ఆయన చేతుల్లో పెట్టేశాడు రాజ్‌కుమార్‌. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 'అప్పు' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చాడు పూరీ జగన్నాథ్‌. అదే సినిమాను తెలుగులో తర్వాత 'ఇడియట్‌' పేరుతో రీమేక్‌ చేశారు. ఇక్కడ కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది ఈ సినిమా. 'అప్పు' సినిమా తర్వాత పునీత్‌ను అదే పేరుతో అభిమానులు పిలుచు కుంటున్నారు.
గేమ్‌ షోకు ప్రజెంటర్‌గా..
    పునీత్‌ 2012లో కన్నడ టీవీ గేమ్‌ షో ''కోట్యాధిపతి''కి టీవీ హౌస్ట్‌గా వ్యవహ రించారు. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న జేమ్స్‌, ద్విత్వ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. నిర్మాతగా 'ఫ్యామిలీ ప్యాక్‌', 'వన్‌ కట్‌ టూ కట్‌ యన్‌ ఫ్లవర్‌ ఈజ్‌ కేమ్‌' ప్రాజెక్టులు చేస్తున్నారు. పునీత్‌ తన సినిమాలన్నింటిలో కనీసం ఒక్క పాటైనా పాడేవారు. అతనుకొన్ని సినిమాలతో పాటు రెండు టీవీ సీరియల్స్‌ నిర్మించాడు. పునీత్‌ మలబార్‌ గోల్డ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు.
టాలీవుడ్‌తో సంబందాలు
    పునీత్‌ తెలుగులో స్ట్రైట్‌ సినిమా చేయకపోయినప్పటికీ.. టాలీవుడ్‌ అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరితోనూ పునీత్‌ రాజ్‌కుమార్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన 'యువరత్న' సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేశారు. ఇక పునీత్‌ నటించిన 'చక్రవ్యూహ' సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాటపాడటం.., పూరీ జగన్నాథ్‌, మెహర్‌ రమేష్‌ వంటి దర్శకులతో పనిచేయడంతో పాటు.. చాలామంది స్టార్‌ హీరోలతో కలిసి పనిచేశారు పునీత్‌ రాజ్‌ కుమార్‌. ఇక మహేశ్‌ బాబు కూడా పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన ఒక సినిమా ఆడియో వేడుకకు వెళ్లారు. చిరంజీవి కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పునీత్‌. ఆయన అన్న శివ రాజ్‌ కుమార్‌ కూడా తెలుగు హీరోలకు బాగా తెలుసు. తెలుగులో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన 'ఒక్కడు' సినిమా కన్నడలో 'అజరు'పేరుతో రీమేక్‌ చేసి సూపర్‌ హిట్‌ కొట్టాడు.అలాగే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'దూకుడు', 'ఆంధ్రావాలా' లాంటి సినిమాలను కన్నడలో రీమేక్‌ చేశాడు పునీత్‌. తెలుగులో డిజాస్టర్‌ గా నిలిచిన 'ఆంధ్రావాలా' సినిమా కన్నడలో 'వీర కన్నడి'గా పేరుతో రీమేక్‌ అయి సూపర్‌ హిట్‌ అయింది. అక్కడ ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఒకే ఒక్క కారణం పునీత్‌ కు ఉన్న ఫాలోయింగ్‌. కేవలం ఇది మాత్రమే కాదు మరికొన్ని తమిళ సినిమాలు కూడా రీమేక్‌ చేశాడు పునీత్‌. ఒరిజినల్‌ కంటే కన్నడలో అవి మరింత పెద్ద విజయం సాధించాయి. ఇటీవల ''యువరత్న'' సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించాడు పునీత్‌. ఈ సినిమా కోసం ఆయన హైదరాబాద్‌ వచ్చి బాగానే ప్రమోషన్‌ కూడా చేశాడు.. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్‌ సాదించలేదు. కానీ, విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో కూడా వచ్చేసింది.
పవర్‌ స్టార్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే : పునీత్‌
    పునీత్‌ ''యువరత్న'' ప్రమోషన్‌ కోసం హైదారబాద్‌ వచ్చినపుడు పునీత్‌ అభిమానులు ఆయనను ''పవర్‌ స్టార్‌'' అని పిలవడంతో ''నన్ను పవర్‌ స్టార్‌ అని పిలవద్దు.. నా వరకు పవర్‌ స్టార్‌ అంటే కేవలం పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే.. అతడు తప్ప మరో పవర్‌ స్టార్‌ లేడని'' ప్రకటించాడు. ఇకపై ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చినా కేవలం పునీత్‌ అని మాత్రమే పిలవాలని పవర్‌ స్టార్‌ పునీత్‌ అని పిలవద్దని రిక్వెస్ట్‌ చేయడమే కాకుండా, పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ పరంగా చూస్తే తనకు పవర్‌ స్టార్‌ అనే బిరుదు సరిపోదని చెప్పాడట.
నటుడిగానే కాక సామాజిక సేవతో పాపులరైన పునీత్‌
    పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతుంది. ఆయన హఠన్మరణం తర్వాత నటుడిగానే కాకుండా ఆయన చేసిన సామాజిక సేవలు వెలుగులోకి వచ్చాయి. సినీ అభిమానులకు నిన్న మొన్నటి వరకు పునీత్‌ రాజ్‌కుమార్‌ అనే ఒక కన్నడ హీరో ఉన్నాడని మాత్రమే తెలుసు. ఆయన గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. కన్నడ కంఠీరవ, లెజండరీ నటుడు రాజ్‌కుమార్‌ కొడుకుగా సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. ఒక స్టార్‌ హీరో కొడుకు అనే అహంకారం లేకుండా.. ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటూ.. వాళ్లని హగ్‌ చేసుకుని వాళ్లకి సపోర్ట్‌ చేసేవాడు. పబ్లిసిటీ లేకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ, సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు పునీత్‌. ఆయన చేసే సేవా కార్యక్రమాలే అతడిని పవర్‌ స్టార్‌గా నిలబెట్టాయి. మిగిలిన హీరోల కంటే ఎందుకు ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది అనే దానికి సమాధానం కూడా అతను చేసిన సేవా కార్యక్రమాలు అనే చెప్తుంటారు. కన్నడనాట అతను చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. చిన్ననాటి స్నేహితుల్ని ఎవర్నీ కూడా వదలకుండా పునీత్‌ వాళ్లకి కూడా సహాయం చేస్తూ వచ్చాడు. అలాంటి మంచి వ్యక్తిఎప్పుడూ సెట్‌లో చాలా ఫిట్‌గా, మంచి హుషారుగాఉండేవారని, అసలు పునీత్‌కు ఎప్పుడూ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, జ్వరం రావడం కూడా తెలి యదని కన్నడ సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాంటి పునీత్‌ అతి పిన్న వయసులో గుండెపోటుతో మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమ, ఆయన అబిమానులనే కాకుండా, యావత్‌ సినీ ప్రేమికులను శోక సంద్రంలో ముంచింది.
వ్యాయామంచేస్తున్న క్రమంలోనే విషాదాలు
    కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ కుటుంబం మొత్తం వ్యాయామం చేస్తున్న క్రమంలోనే ప్రాణాలు కోల్పో వడం, ప్రాణాపాయాన్ని ఎదుర్కో వడం చర్చనీయాంశమైంది. కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ 2006లో.. వాకింగ్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చిన వెంటనే కూర్చున్న సోఫాలోనే కుప్ప కూలిపోయారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ కూడా జిమ్‌ చేసిన కాసేపటికే అస్వస్థ తకు గురై ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఆయన సోదరుడు శివరాజ్‌ కుమార్‌ సైతం గుండెపోటుకు గుర య్యారు. పునీత్‌ మరో సోదరుడు రాఘవేంద్ర జిమ్‌ చేస్తుండగా పక్ష వాతానికి గురయ్యారు. ఇలా ఫ్యామిలీ మొత్తం వ్యాయామం చేస్తున్న క్రమం లోనే విషాదాలు ఎదుర్కోవడం గమనార్హం.
బాలనటుడిగా కన్నడ సినీరంగంలోకి ...
    పునీత్‌ బాలనటుడిగా 1976లో కన్నడ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 20 సినిమాలలో నటించారు. ఆయన ''ప్రేమద కనికే, సనాది అప్పన్న, వసంత గీత, భాగ్యవంత, చలిసువ మొదగలు, హౌస బెలకు, ఎరడు నక్షత్రగలు, భక్త ప్రహ్లాద, యారివను, బెట్టడ హూవు, పరశురామ'' తదితర చిత్రాల్లో నటించాడు. 'బెట్టాడ హూవు' సినిమాలో రాముడి పాత్రలో పునీత్‌ నటనకు 'ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు' అందుకున్నారు. 'చలిసువ మొదగలు' చిత్రంలోని పునీత్‌ నటనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే 'ఉత్తమ బాల నటుడు అవార్డు' అందుకున్నారు.
పునీత్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన బీబీసీ, అంతర్జాతీయ సినీ విశ్లేషకులు
    కన్నడ నటుడు పునీత్‌ మరణ వార్త దేశంలోని దాదాపు అన్ని బాషల మీడియాలో, విదేశాల్లోని మీడియాలో ప్రసారం అయ్యింది. తక్కువ వయసులో కోట్లాది మంది అభి మానులను సొంతం చేసుకున్న కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రపంచ ప్రసిద్ది చెందిన బీబీసీ న్యూస్‌ లో పలువురు నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశాలు దాటుకుని పునీత్‌ రాజ్‌కుమార్‌ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సుమారు 30 లక్షల మంది అభిమానులు పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించి ఆయన పార్థీవ దేహాన్ని చివరిసారి దర్శించుకున్నారని అంచనా. కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ మరణించినపుడు లక్షలాది మంది అభిమానులు నివాళులు అర్పించగా, ఇప్పుడు ఆయన కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు సైతం నివాళులు అర్పించడానికి అంత పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. బీబీసీ న్యూస్‌ చానల్‌ అంతర్జాతీయ సినీ విశ్లేషకులతో పునీత్‌ రాజ్‌ కుమార్‌ గురించి చర్చ జరిపారు. ఈ సందర్బంగా భారతదేశంలో అతి తక్కువ వయసులో ఇన్ని కోట్ల మంది అభిమానులు పునీత్‌ రాజ్‌ కుమార్‌ సంపాదిం చుకోవడం నిజంగా గ్రేట్‌ అని, నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పునీత్‌ కళ్ళతో నలుగురికి కంటిచూపు
    తాను మరణించి మరో నలుగురికి కంటిచూపును ప్రసాదించాడు దివంగత నటుడు, కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌.. ఆయన దానం చేసిన కళ్ళతో నలుగురికి కంటిచూపు దక్కింది. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్ళను ఇతరులకి ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు.. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్‌ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంథులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భుజంగ్‌ శెట్టి తెలిపారు. దీనితో ఒకేరోజు నలుగురికి చూపు దక్కింది. చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరందరూ కర్ణాటకకి చెందినవారే. కాగా పునీత్‌ తండ్రి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ మరణానంతరం 2006లో తన కళ్లను దానం చేయగా, అదే బాటలో 2017లో పునీత్‌ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ మరణం తర్వాత ఆమె కళ్లను కూడా దానం చేశారు. ఇప్పుడు పునీత్‌ కళ్ళను కూడా దానం చేశారు.
 -పొన్నం రవిచంద్ర,9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి
బుక్‌ ఫెయిర్‌ పుస్తకాల పెద్ద పండుగ
యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌
గురుకులాల వైపే అందరి చూపు
భార‌త రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం
నట్టింట్లో వినోద వేదిక టెలివిజన్‌
పిల్లలేమంటున్నారంటే....
వెలుగుల క‌ళ‌లు వెల్లి‌విరిసే పండుగ దీపావ‌ళి

తాజా వార్తలు

07:15 PM

ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి..

06:56 PM

శ్రీలంకపై భారత్ విజయం.. సిరీస్ కైవసం

06:40 PM

కోలుకున్న బోరుబావి బాధిత బాలుడు..

06:26 PM

రెబల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సవాల్

06:13 PM

ఐఏఎస్ అధికారి కొడుకు ఆత్మహత్య..!

06:01 PM

'సీతారామం`టీజర్ విడుదల

05:46 PM

టొబాకో ఫ్రీ జోన్‌గా విజయవాడ ఆల‌యం

05:39 PM

ముంబైలో 144 సెక్షన్ విధింపు

05:36 PM

కర్నాటక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా మంజూరు

05:18 PM

లక్కీ డిప్ తేదీని ప్రకటించిన టీటీడీ

05:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వాట్సాప్‌లో కామెంట్.. తీవ్రంగా కొట్టిన పోలీసులు..!

04:56 PM

కర్ణాటకలో భూప్రకంపనలు

04:47 PM

ఉపాధ్యాయులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

04:33 PM

బైక్‌లో మంట‌లు.. ఒక‌రు మృతి

04:27 PM

కొత్త టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టిన ఎస్బీఐ

04:17 PM

స్టేడియంలో క్రికెటర్‌కు షూ చూపించిన అభిమానులు

04:08 PM

కారు మీద పడ్డ చెట్టు.. బ్యాంకు మేనేజర్ మృతి

03:56 PM

మహారాష్ర్టలో రెబల్ ఎమ్మెల్యేలకు షాక్..!

03:45 PM

సికింద్రాబాద్​లో ఫుట్ ఓవర్​ బ్రిడ్జ్​ ప్రారంభం

03:31 PM

రేపు జాతీయ లోక్ అదాలత్

03:25 PM

జూన్ 25ను బ్లాక్ డే గా ప్రకటించాలి: రఘునందన్ రావు

03:11 PM

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

03:00 PM

తొక్కిసలాటలో 18 మంది మృతి

02:48 PM

మా గ్రూపు పేరు ఇదే.. : రెబల్ ఎమ్మెల్యే

02:39 PM

భార్య ఆచూకీ కనుక్కోకపోతే చనిపోతాం.. పిల్ల‌ల‌తో భర్త సెల్ఫీ వీడియో

02:25 PM

ఆన్‌లైన్‌లో మహిళా సంఘాల వస్తువులు విక్రయం..

02:14 PM

శివసైనికులు బయటకు వస్తే అగ్గి రాజుకుంటుంది : సంజయ్ రౌత్

02:02 PM

సుబ్బారావును బలి పశువును చేశారు: న్యాయవాది

01:52 PM

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

01:38 PM

హ‌న్మ‌కొండ‌లో ఎస్బీఐ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.