Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌ | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Dec 12,2021

యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌

పుట్టిన రోజు నాడు తన తండ్రి బహుకరించిన మూవీ కెమరాతో ముచ్చట తీర్చుకునేవాడు. ఆ కెమరాతోనే భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు. చదువుకునే రోజుల్లో విపరీతంగా సినిమాలు చూసేవారు. ఆరేండ్ల ప్రాయంలోనే సినిమా తీయాలన్న కోరిక అంకురించింది. కానీ, సినిమా గురించి నేర్చుకోవడానికి ఆనాడు ఏ దారి లేదు. నిజాం కాలేజీలో ఎంఏ చేస్తున్న సమయంలో సినిమాలపై ఉన్న అభిరుచితో ఫిల్మ్‌ సొసైటీని స్థాపించాడు. సత్యజిత్‌రే ఆవిష్కరించిన సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించేవాడు.
   ఎంతటి స్థాయికి ఎదిగినా జన్మించిన గడ్డపై ఆయనకు ఎనలేని అనురాగం, అందుకే ఆయన ప్రతి చిత్రంలోనూ తెలంగాణా నేపధ్యం కనిపిస్తుంది. అణగారిన వర్గాలు, మహిళలు, శ్రామికులు, రైతు కూలీల శ్రేయసుకు సినిమాను పదునైన ఆయుధంగా మార్చిన శ్యామ్‌ బెనెగల్‌ సామాజిక, సాంస్కతిక మార్పులకు దారి చూపారు.
   వాస్తవిక సినిమాల దార్శనికుడు శ్యామ్‌ బెనెగల్‌ తెలంగాణా గడ్డపై పుట్టిన, భారతదేశం గర్వించ దగ్గ ప్రముఖ సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఎదిగారు. ఎంతటి స్థాయికి ఎదిగినా జన్మించిన గడ్డపై ఆయనకు ఎనలేని అనురాగం, అందుకే ఆయన ప్రతి చిత్రంలోనూ తెలంగాణా నేపధ్యం కనిపిస్తుంది. అణగారిన వర్గాలు, మహిళలు, శ్రామికులు, రైతు కూలీల శ్రేయసుకు సినిమాను పదునైన ఆయుధంగా మార్చిన శ్యామ్‌ బెనెగల్‌ సామాజిక, సాంస్కతిక మార్పులకు దారి చూపారు. సజీవ దశ్యా కావ్యాలకు ప్రాణ ప్రతిష్ట చేసి రూపొందించిన ''అంకుర్‌, నిశాంత్‌, మంథన్‌, భూమిక'' నాలుగు చిత్రాలతో భారతదేశంలో ''సమాంతర సినిమా'' అని పిలువబడే కొత్త తరహా చిత్రాలకు ఆయన మార్గదర్శకుడు అయ్యాడు. యదార్థ జీవుల యదార్థ గాథలకు దశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనెగల్‌ సినిమాల్లో పాత్రలు మౌనంగా సంబాషిస్తాయి. సామాజిక దురన్యాయాలపై ప్రశ్నలు గుప్పిస్థాయి. ఆయన ప్రతి చిత్రం ఓ సందేశం.
   శ్యామ్‌ బెనెగల్గా ప్రసిద్దుడయిన వెనగల్ల శ్యాంసుందరరావు తెలంగాణలోని సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో 1934వ సంవత్సరం డిశంబర్‌ 14న జన్మించారు. ఆయన తల్లి సరస్వతి, తండ్రి శ్రీధర్‌. కర్నాటకకు చెందిన శ్రీధర్‌ ఓ చాయా చిత్రకారుడు. ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు గురు దత్‌, బెనగళ్‌కు దూరపు బంధువు. బెనగళ్‌ తండ్రి తరపు అమ్మమ్మ, గురుదత్‌ తల్లితండ్రులు సోదరీమణులు, ఇద్దరూ కర్ణాటకలోని ఉత్తర కన్నడ కొంకణి మాట్లాడే చిత్రపూర్‌ జిల్లాకు చెందినవారు. బెనగళ్‌ నీరా బెనెగల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పియా బెనెగల్‌ అనే ఒక కూతురు కూడా ఉంది. పియాబెనెగల్‌ ప్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడ్డారు.
పోటోగ్రఫీ మీద ఆసక్తితో
   బెనగళ్‌ తండ్రి శ్రీధర్‌ చాయా చిత్రకారుడు కావడంతో ఆ ఛాయాల్లో... ఆయన నీడలో పెరగడం వల్ల శ్యామ్‌ బెనెగల్‌కు పోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. పుట్టిన రోజు నాడు తన తండ్రి బహుకరించిన మూవీ కెమరాతో ముచ్చట తీర్చుకునేవాడు. ఆ కెమరాతోనే భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాడు. చదువుకునే రోజుల్లో విపరీతంగా సినిమాలు చూసేవారు. ఆరేండ్ల ప్రాయంలోనే సినిమా తీయాలన్న కోరిక అంకురించింది. కానీ, సినిమా గురించి నేర్చుకోవడానికి ఆనాడు ఏ దారి లేదు. నిజాం కాలేజీలో ఎంఏ చేస్తున్న సమయంలో సినిమాలపై ఉన్న అభిరుచితో ఫిల్మ్‌ సొసైటీని స్థాపించారు. సత్యజిత్‌రే ఆవిష్కరించిన సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించేవారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యాక 1959లో ఉద్యోగం కోసం బొంబాయి వెళ్ళారు. అక్కడ 'లింటాస్‌' అనే అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలో అభిరుచికి తగ్గ ఉద్యోగం దొరికింది. ఫిల్మ్‌ అసిస్టెంట్గా ఉంటూ కొద్ది నిడివి గల అనేక అడ్వర్టైజ్మెంట్లు రూపొందించారు. బడి లేక, అమ్మ వొడి లేక అంధకారంలో అలమటిస్తున్న అభాగ్య బాలకార్మికుల దైన్యస్థితిని చిత్రీస్తూ ఆ సమయంలో ''ది చైల్డ్‌ ఆఫ్‌ స్ట్రీట్స్‌'' పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మించారు. అదే ఆయన జీవితంలో తొలి బలమైన అడుగు. తాను ఏ దిశగా సాగిపోవాలో.. ఏ గమ్యం చేరుకోవాలో చూచాయగా నిర్దేశించిన మేలు మలుపు లాంటి ముందడుగు అదీ. అయిన బ్రతుకుదెరువు కోసం అనేక వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తూ కాలం గడిపేవారు. భావిష్యత్తు వైపు ఆశగా ఎదురు చూసేవారు. భారతీయ చలనచిత్ర రంగానికి గుండెకాయ లాంటి బొంబాయి మహానగరంలో చిత్ర పరిశ్రమ గమనాన్ని, దొరణినీ మౌనంగా వీక్షించేవారు. పరిస్థితులను ఆద్యాయనం చేసే కొద్ది సినిమాలు నిర్మించాలన్న ఆకాంక్ష ఆయనలో బలపడుతూ వచ్చింది. చేస్తున్న ఉద్యోగంలో ఏ మాత్రం పురోగతి కనిపించక పోవడంతో 1963లో బ్లేజ్‌ అడ్వర్టైజింగ్‌ కంపెనీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరారు. అక్కడ అడ్వర్టైజ్‌ మెంట్‌ సినిమాలు తీయడం ద్వారా సినిమా నిర్మాణం నేర్చుకున్నారు. కెమెరా, సౌండ్‌, ఎడిటింగ్‌, స్క్రిప్ట్‌ రాయడం ఇలా అన్నీ తనంతట తానే నేర్చుకున్నారు. సినిమా తీయడంలో ఎవరి ప్రభావం తనమీద ఉండడానికి వీల్లేదని ఎవరివద్ద సహాయకుడిగా చేరలేదు. యాడ్స్‌ రంగంలో కొనసాగుతుండగానే తొలిసారిగా 1962లో 'ఘెర్‌ బెతా గంగా' గుజ రాతీ డాక్యుమెంటరీని రూపొందించారు. దాదాపు 900 స్పాన్సర్డ్‌ డాక్యుమెంటరీలు, యాడ్‌ ఫిలింలు రూపొందించారు. అయితే బెనగల్‌ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడానికి 1969లో మరో ఉద్యోగంలోకి మారారు. బొంబాయి 'భావన్స్‌ కళాశాలలో' డాక్యుమెంటరీ లెక్చరర్‌గా అక్కడి విద్యార్థులకు ప్రాథమిక పాఠాలు బోధించారు. అదే సమయంలో దశ్య, శ్రవణ విద్యా బోధన పథకం కింద విదేశాల్లో శిక్షణ పొందడానికి గాను శ్యామ్‌ బెనెగల్‌కు 'హౌమీబాబా' ఫెలోషిప్‌ వచ్చింది. ఆ ఆర్థిక సహాయంతో ఆయన అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌ దేశాలలో పర్యటించారు .చిత్రనిర్మాణ రంగంలో సాంకేతిక నైపుణ్యాన్ని, మెళుకువలను ఆకళింపు చేసుకున్నారు. ప్రపంచ సినీరంగపు పోకడలను అర్థం చేసుకున్నారు. వాస్తవిక ఔన్నత్యాన్ని, ఆవశ్యాన్ని గుర్తించారు. బోస్టన్‌లోని ''డబ్ల్యూజీబీహెచ్‌''లో 1970-72 ప్రాంతంలో అసోసియేట్‌ ప్రొపెసర్‌గా పనిచేసే అద్భుత అవకాశం వచ్చింది. అనంతరం న్యూ యార్క్‌లో జరిగిన బాలల టివి చిత్ర వర్క్‌ షాప్‌లో పాల్గొన్నారు. విదేశాల్లో వినూత్న రీతిలో సాగుతున్న చిత్ర నిర్మా ణాలు, పోకడలు పరిశీలించిన ఆయనకు తన మీద నమ్మకం పెరిగింది. చలన చిత్రాలు తీయడం సులభమేనన్న భావన కలిగింది. కొత్త ఉత్సాహంతో కొండంత ఆత్మ విశ్వాసంతో 1972లో బెనగళ్‌ స్వదేశానికి తిరిగి వచ్చారు.
'అంకుర్‌' చిత్ర
నిర్మాణానికి అంకురార్పణ
   అమెరికా నుంచి బొంబాయి తిరిగి వచ్చేశాక, ఆయనలో చదువుకునే రోజుల్లో సత్యజిత్‌ రే సినిమాలు నింపిన ప్రగతిశీల భావనలు, తెలంగాణ పోరాట కాలంలో విద్యార్థి ఉద్యమాలతో అలవడిన అభ్యుదయ భావాలు ఆయన గుండెకు ఊపీరులుదాయి. ప్రజలు శక్తిమంతులు, చైతన్యవంతులు కావడానికి, మహిళలు సాధికారత సాదించడానికి సినిమా దోహద పడుతుందన్న మహౌన్నత భావాలు బెనగల్‌ని ముందుకు నడిపించాయి. సామాన్యుల వేతలలోంచి పుట్టిన ఇతి వత్తాలు, యదార్థ, యదార్థ గాథలు, దాచేస్తే దాగని కథలు సినిమాలుగా రావలసిన అవసరముందన్న భావనతో, ఫార్ములా కథలకు గండి కొడుతూ 1974లో 'అంకుర్‌' చిత్ర నిర్మాణానికి అంకురార్పణ చేశారు. తెలంగాణ భూస్వాముల వికతాలను, విశంఖలత్వాన్ని, ఆగడాలను, అత్యాచారాలను తూర్పార పాడుతూ రూపొందించిన ఈ చిత్రంకుల వ్యవస్థ, లింగ వివక్ష, మహిళల హక్కుల కోసం నినందించిన భారతీయ సమాంతర సినిమాగా నిలచింది. ఈ చిత్రంలో ముఖ్యం గా ఆయన తెలంగాణాలో ఆడవారిపై జరుగుతున్న ఆకత్యాలను చిత్రించారు, ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే అయినందునా, ఆయన చిత్రాలలో తెలంగాణా జీవనచిత్రం ప్రతిబింబిస్తుంది, ఈ సినిమా జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఇందులోని నటనకు షబానా అజ్మీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది.ఈ తొలి చిత్రం నుంచే బెనగళ్‌కు అవార్డు పరంపర మొదలైంది. షబానా అజ్మీ, అనంత నాగ్‌లకు కూడా ఇదే తొలిచిత్రం. 1975లో జానపద కథ ఆదారంగా''చరణ్‌ దాస్‌ చొర్‌'' బాలల చిత్రాన్ని చిల్డ్రన్స్‌ పిల్మ్‌ సొసైటీ కోసం రూపొందించారు. ఈ చిత్రంలో స్మితా పాటిల్‌ తొలిసారి పరిచయం కాగా, చాలా మంది పిల్లలు ఇందులో నటించారు. 1975లో పూర్తిగా తెలంగాణా నేపధ్యంలో భూస్వామి గ్రామాన్ని పట్టి పీడిస్తుంటే ప్రజలు తిరగబడి ఎలా విముక్తి పొందారనే కథ ఆదారంగా చేసుకుని రూపొందించిన ''నిశాంత్‌'' చిత్రం హిందీ సినీ పరిశ్రమలో ఒక సంచలనం సష్టించింది, తెలంగాణా నేపధ్యం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముడి సరుకు కాలేకపోయినప్పటికీ, శ్యాంబెనగల్‌ వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. గుజరాత్లో వర్గీస్‌ కురియన్‌ తీసుకువచ్చిన క్షీర విప్లవం నేపథ్యంలో 1976లో బెనగల్‌ రూపొందించిన 'మంథన్‌'కు అక్కడి పాడి రైతులే నిర్మాతలుగా వ్యవహరించడం అరుదైన చరిత్ర. గుజరాత్‌ పాడి సహకార సంఘంలోని ఐదులక్షల మంది సభ్యులు రెండేసి రూపాయల చొప్పున ఈ చిత్ర నిర్మాణానికి సమకూర్చారు. విడుదలయ్యాక వారందరూ బళ్లు కట్టించుకుని మరీ థియేటర్లకు వచ్చి చూడటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 1977లో 'భూమిక' చిత్రం నాటి మరాఠీ రంగస్థల నటి 'హంసా వాడ్కర్‌' జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం స్త్రీవాదం, పురుష దష్టి, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన మూల్యం గురించి చక్కటి వివరణనిచ్చారు. ఈ సినిమాలో స్మితా పాటిల్‌ అసాధారణమైన నటనను కనబరిచారు. ఇదే ఏడాది తెలుగు, హిందీ భాషల్లో 'అనుగ్రహం' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వాణిశ్రీ, స్మితా పాటిల్‌ ప్రదాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాలతో పాటు ప్రముఖ నటుడు శశి కపూర్‌, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో 1979లో జునూన్‌, 1981లో కలియుగ చిత్రాలను నిర్మించారు. జునూన్‌ 1857నాటి భారతీయ తిరుగుబాటు, అల్లకల్లోల మధ్య జరిగిన కులాంతర ప్రేమకథ కాగా, మహాభారతం ఆధారంగా 'కలియుగ్‌' సినిమా రూపొందించబడింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్‌ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు. కానీ, ఈ రెండు చిత్రాలు వరుసగా 1980, 1982లో ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాయి. బెనెగల్‌ అబ్బాస్‌ రచించిన గ్రంధం ఆధారంగా హైదరాబాద్‌ సంస్కతికి దగ్గరగా1983లో రాజకీయం, వ్యభిచారం గురించిన వ్యంగ్య కామెడీతో తీసిన 'మండి' చిత్రంలో షబానా అజ్మీ, స్మితా పాటిల్‌ పోటాపోటీగా నటించి నటనకు కొత్త నిర్వచనం చెప్పారు. 1983లో విడుదలైన ఈ చిత్రం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. అనంతరం బెనెగల్‌ 1960ల ప్రారంభంలో గోవాలో పోర్చుగీస్‌ చివరి రోజుల ఆధారంగా స్వంత కథ రూపొందించుకునిమానవ సంబంధాలను అన్వేషిస్తూ 1985లో 'త్రికాల్‌' చిత్రాన్ని నిర్మించారు. 1988 లో చేనేత కార్మికుల జీవితాల్ని స్పశిస్తూ 'సుసాస్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. 1993లో 'సూరజ్‌కా సాథ్‌వా ఘోడా', 1995లో 'మమ్మో', 1996లో 'ది మేకింగ్‌ ఆఫ్‌ మహాత్మ', 1997లో 'సర్దారీ బేగం'చిత్రాలు నిర్మించారు. 1998లో 'సమర', 2000 సంవత్సరంలో పితస్వామ్య వ్యవస్థ సాధికారాన్ని ప్రశ్నిస్తూ అందించిన కుటుంభ కథ చిత్రం 'హరిబెరి'ని తెరకెక్కించారు.1940-80ల నాటి కాలగమనం మద్య రాజస్థాన్‌, బొంబాయిల మద్య బ్యాక్‌ డ్రాప్‌ మద్య సాగే ప్రేమకథ ఇతి వత్తంగా 2001లో 'జుబేదా' చిత్రాన్ని నిర్మించారు. పాతికెండ్ల పాటు సామాజిక చిత్రాలను తెరకెక్కించిన శ్యామ్‌ బెనెగల్‌ కమర్షియల్‌ చిత్రం 'జుబేదా'కి దర్శకత్వం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ య్యాయి. బెనగల్‌ మహాత్మాగాంధీ జీవిత చరిత్రను ఆదారం చేసుకుని ఆంగ్లంలో నిర్మించిన ''ది మేకింగ్‌ ఆఫ్‌ ది మహాత్మా'' చిత్రం జాతీయ స్థాయిలో అవార్డును అందుకుంది. శ్యామ్‌ బెనగల్‌ ఆవిష్కరించిన అనేక చిత్రాలు జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. ఆయన కెరీర్‌లో 20 చలన చిత్రాలకు దర్శకత్వం వహించగా, 1500 వాణిజ్య ప్రకటనలు రూపొందిం చారు. 45కి పైగా డాక్యుమెంటరీలు నిర్మించారు. షబానా అజ్మీ, నసీరుద్దీన్‌ షా, ఓం పురి, స్మితా పాటిల్‌, కులభూషణ్‌ ఖర్బందా, అమ్రిష్‌ పూరి వంటి మేటి నటీ నటులను, గోవిందనిహాలనిని ఛాయా గ్రహకుడిగా వెలుగులోకి తెచ్చిన ఘనత కూడాశ్యామ్‌ బెనగల్‌కే దక్కుతుంది.
బుల్లితెరపైనా తనదైన ముద్ర
   బెనగల్‌ బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. 1980లో పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రాసిన డిస్కవరి ఆఫ్‌ ఇండియా ఆదారంగా రూపొందించిన నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ 'భారత్‌ ఏక్‌ ఖోజ్‌' దూరదర్శన్‌లో 53 వారాల పాటు ప్రసారమయ్యింది. 'భారత్‌ ఏక్‌ ఖోజ్‌' సిరీస్‌ ఆయనను బుల్లితెర ప్రేక్షకులకు చేరువ చేసింది. రైల్వే శాఖ కోసం రూపొందించిన 'యాత్ర', భారత రాజ్యాంగంపై రూపొందించిన 'సంవిధాన్‌', ఆంధ్రప్రదేశ్‌లోని కష్ణ తీరపు ప్రాంత జీవితాలను, ఆ పల్లెల కమ్మదనాన్ని ఎంతో అపురూపంగా ఆవిష్కరిస్తూ తెలుగులో రూపొందించిన 'అమరావతి కథలు' వంటి టీవీ సిరీస్‌లు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి, సత్యజిత్‌ రే, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌లపై రూపొందించిన బయోగ్రాఫికల్‌ డాక్యుమెంటరీలు విమర్శకుల మన్ననలు పొందాయి.
తెలుగులో అనుగ్రహం
   శ్యామ్‌ బెనగళ్‌1978వ సంవత్సరం తెలుగులో రూపొందించిన ఏకైక చిత్రం 'అనుగ్రహం' మరాఠీ రచయిత చింతామణి టి. ఖనోల్కర్‌ నవల ఆధారంగా బెనగల్‌ ఏకకాలంలో తెలుగు, హిందీ ద్విభాషల్లో అనుగ్రహం చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే గిరీష్‌ కర్నాడ్‌, శ్యామ్‌ బెనెగల్‌ అందివ్వగా, అనంత్‌ నాగ్‌, వాణిశ్రీ, స్మితా పాటిల్‌ అమ్రిష్‌ పూరి, సత్యదేవ్‌ దూబే, శేఖర్‌ ఛటర్జీ (హిందీ వెర్షన్‌), రావు గోపాల్‌ రావు (తెలుగు వెర్షన్‌)నటించారు. ఈ చిత్రం లండన్‌, బెర్లిన్‌, లాస్‌ఏంజిల్స్‌, హాంకాంగ్‌, డిల్లీ వంటి నగరాలలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుంది.
పురస్కారాలు ...
   శ్యామ్‌ బెనెగల్‌ 1974లో ఆవిష్కరించిన తొలి చిత్రం 'అంకుర్‌' 3 జాతీయ అవార్డులను, 43 సత్కారాలు అందుకుంది. 1975 లో వచ్చిన 'నిశాంత్‌' ఉత్తమ జాతీయ చిత్రంగా, 1976లో 'మంథన్‌' చిత్రం ఉత్తమ జాతీయ చిత్రంగా పురస్కారం అందుకోవడంతో పాటు 1977 సంవత్సరానికి 'ఆస్కార్‌' కు నామినేట్‌ అయ్యింది. 1977లో వచ్చిన 'భూమిక' రెండు జాతీయ అవార్డులను, 1979లో 'జూనూన్‌' రెండు జాతీయ అవార్డులను అందుకుంది. 1981లో 'కలియుగ్‌' చిత్రం మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికయ్యింది. 1983లో 'మండి' జాతీయ ఉత్తమ చిత్రంగా 1985లో 'ఆరోహాన్‌' చిత్రం సైతం జాతీయస్థాయిలో అవార్డును సొంతం చేసుకుంది. 1985లో వచ్చిన మరో చిత్రం 'త్రికాల్‌' చిత్రానికి బెనెగల్‌ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. 1998లో 'సమర' చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్ర అవార్డు, 2000 సంవత్సరంలో 'హరిబెరి' చిత్రం ఉత్తమ కుటుంభ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. 2005లో వచ్చిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ సమగ్రత ఉత్తమ చలన చిత్రంగా నర్గీస్‌ దత్‌ అవార్డును పొందింది. భారత ప్రభుత్వం బెనగల్‌కు 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించింది. సినీరంగంలో చేసిన కషికి గుర్తింపుగా 2005లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. భారతీయ సినిమాకు చేసిన కషికి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బిఎన్‌ రెడ్డి జాతీయ అవార్డుతో సత్కరించగా, 2013 సంవత్సరానికిగాను అక్కినేని పురస్కారం అందుకున్నారు. 2015 లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవేకాదు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులుపలు అంతర్జాతీయ అవార్డులు సైతం ఆయనను వరించాయి. అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు జ్యూరీగా ఆహ్వానించబడ్డారు.
   శ్యామ్‌ బెనగల్‌ 2006 నుంచి 2012 వరకు ఆరేండ్ల పాటు రాజ్యసభ సబ్యులుగా కొనసాగారు. ప్రతిష్టాత్మకమైన పుణే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 1966-73 కాలంలో విద్యార్థులకు నటన, దర్శకత్వంలో మెలకువలను బోధించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 1980-83, 1989-92లో రెండు పర్యాయాలు చైర్మన్‌గా కూడా సేవలందించారు.
- -పొన్నం రవిచంద్ర, 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి
బుక్‌ ఫెయిర్‌ పుస్తకాల పెద్ద పండుగ
గురుకులాల వైపే అందరి చూపు
భార‌త రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం
నట్టింట్లో వినోద వేదిక టెలివిజన్‌
పిల్లలేమంటున్నారంటే....

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.