Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం! | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Mar 05,2022

సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!

  ఆడవాళ్ళను సరుకుగా ఏ మార్చి వేస్తున్నా ఆధునిక వ్యవస్త వారి అస్తిత్వానే ప్రశ్నార్థకం చేస్తున్నది. సమాజంలో సగ భాగంగా వున్న మహిళలు స్వేచ్ఛను, సమానతను పొందకుండా సమాజం ముందుకు పోలేదు. రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక రంగాలలో వాళ్ళూ సమానంగా వచ్చిన నాడే సామాజిక ప్రగతి సాధ్యం. అందుకు సంఘటిత పోరాటమే మార్గం.
'' ఆమె నిర్మిస్తూనే ఉంది... దశాబ్దాలుగా
దక్కని తన అస్తిత్వానికై ఓ స్థూపాన్ని నిలబెట్టాలని....
నిరంతర శ్రామికై, అలుపెరుగని చెమట నీటితో, ఆత్మ విశ్వాసపు ఇటుకలను తడుపుతూనే ఉంది. అగ్గి పుల్లగా మారి, ఆత్మార్పణ చేసిన ప్రతిసారీ, వేవేల నిప్పు కణికల్ని రాజేసి ఆరని జ్యోతియై వెలుగుతూనే ఉంది. మూల్యమాశించని శాశ్వత కార్మికై, తరతరాల మానవ మనుగడకు, అవిశ్రాంత యోధురాలవుతూనే ఉంది....!'' అంటూ పెనుగొండ సరసిజ శాశ్విత కార్మికురాలైన స్త్రీ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఎంత ఆవేదనను, గుండెల్లో దాచుకున్న బాధలను స్త్రీలు యోధులుగా ఎలా ఎదుర్కొంటున్నదీ అక్షరీకరించారు. నిజమే కదా! దశాబ్ధాలుగా మహిళా దినోత్సవాలు నిర్వహిస్తూ, స్త్రీల అసమానతలు, వివక్షలతు వారిపై జరిగే హింసల గురించి చర్చిస్తున్న అడుగులు ముందుకు పడటం లేవు. సామాజిక కార్యక్రమాలలోకి, ఉత్పత్తి రంగంలోకి, రాజకీయాలలోకి మహిళలు వస్తూనే వున్నారు. చదువులు, ఉద్యోగాల్లోకి వచ్చారు. అభివృద్ధి క్రమంలోకి వచ్చారు. కానీ అసమానతలోంచి, వివక్షతలోంచి ఇంకా రాలేక పోతున్నారు. స్త్రీలను చూసే చూపులో మార్పు లేదు. వారిపై జరిగే దాడులూ పెరుగుతూనే ఉన్నాయి. ఎదుర్కొనే సవాళ్ళు మరింత పెరిగాయి. మన దేశంలోనయితే స్త్రీల పట్ల మరింత తిరోగమన భావాలు ముందు కొస్తున్నాయి. చాలా స్పష్టంగానే మహిళలను వంట ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచనలను ప్రకటిస్తూనే వున్నారు. ఇది మరింత దారుణం. ఛాందసభావాలు, మూఢ విశ్వాసాల పెనుదాడి స్త్రీలపై పెరుగుతున్నది. స్త్రీలను సొంత ఆస్తిగా భావించే వ్యవస్థ తాలూకు ఆలోచనలే నేటికీ కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఆడవాళ్ళను సరుకుగా ఏమార్చి వేస్తున్నా ఆధునిక వ్యవస్థ నారి అస్తిత్వానే ప్రశ్నార్థకం చేస్తున్నది. సమాజంలో సగ భాగంగా వున్న మహిళలు స్వేచ్ఛను, సమా నతను పొందకుండా సమాజం ముందుకు పోలేదు. రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక రంగాలలో వాళ్ళూ సమానంగా వచ్చిన నాడే సామాజిక ప్రగతి సాధ్యం. అందుకు
సంఘటిత పోరాటమే మార్గం.

ఆత్మ గౌరవంతో ప్రతి మహిళా నిలబడాలి
మానవాళి పురోగతిని వెక్కిరిస్తూనే ఎంత అనాగరిక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామో తెలియజేస్తూనే వున్నాయి. నిజానికి అత్యాచారాలు కానుంచి భారతావని కోసం ప్రతి మహిళా కలలు కంటూనే ఉంది. శరీరం మీద జరిగే లైంగిక దాడుల కన్నా మనసుల మీద జరిగే లైంగిక దాడిని ప్రతి మహిళా రోజూ అనుభవిస్తూనే వుంది. ఉగ్గుపాలు పట్టి జాతిని పెంచే మహిళలకు రాజకీయ పగ్గాలు పట్టుకోవటం రాదంటూ పేరుకి పదవి మహిళ దైనా పాలన పురుషుడిదే కావటం సిగ్గుచేటు. మహిళ కొంగుపట్టి లాగిన శాసనసభలున్న ఈ దేశంలో శాసనసభల్లోనే బూతువీడియోలు సెల్లుల్లో చూస్తూన్న పాలకులున్న దినాల్లోనే మనమంతా మన అస్తిత్వం కోసం వెతుకులాడుతూనే వుంటం గర్హించదగ్గ అంశాలు.
     మహిళ మనసు నవనీతం/ మహిళ జన్మ పునీతం ఆత్మీయత తన హక్కు అంటూ మనం మహిళల గురించి పదే పదే చెప్తుంటాం. వేల ఏండ్లుగా బానిసకొక బానిసలాగానే చూడబడుతుంది. అగ్ని పూల నుంచి అనుబాంబుదాకా సబ్బుబిళ్ళ నుంచి సమకాలీన రాజకీయాలదాకా అతివ లేని రంగం లేదు. అతివ అడుగు పెట్టని ప్రాంతం కానరాదు. అయినా ఇంకా ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తూంది సమాజం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది అన్నట్టుగా మనమింకా రిజర్వేషన్స్‌ గురించి సమ భాగస్వామ్యం గురించి అర్థించాల్సే వస్తుంది. మన హక్కుని కూడా మనం సాధించలేకుండా అడుకోవటాలు.. భంగపడటాలు ఏమిటి? ఆకాశంలో సగం... అవనిలో సగం వున్న మహిళలు సంఘటితం ఎందుకు కావటం లేదు. అడుగడుగునా అడ్డంకులే... అవరోదాలే... అవమానాలే... అవహేళనలే కొద్దిగా పైకి ఎదుగుతున్న మహిళ మీద నిరాధార ఆరోపణలు.... అసత్య ప్రచారాలు... శల్య పరీక్షలు... శీల నిరూపణలు.. క్యారెక్టర్‌ని వక్రీకరిస్తూ కుటుంబాన్ని సాకుగా చూపిస్తూ ఇంకా వంటింటి గాటికి కట్టేస్తూనే వున్నారు. త్యాగశీలివమ్మా అంటూ ఇంకా పాటలు పాడుతూనే సామ్రాజ్యం వంటిల్లేనని పరిమితం చేస్తూనే వున్నాము. ఎంత సంపాదించినా చేతుల్లో ఏటీఎం కార్డులున్నా పిన్‌ నంబర్లు మాత్రం మగవాడి దగ్గరే వుంచుకుంటున్నారు. ఎనీ టైం మనీ యంత్రాలుగానే ఉద్యోగిని పరిగణిస్తున్న కుంటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లేకపోవటం- అర్థరాత్రి కాదు కదా పట్ట పగలు కూడా వంటరిగా తిరలేని దుస్థితిలో మహిళ వుండటం... అర్నేళ్ళ పిల్ల నుంచి 90 ఏండ్ల ముసలి వరకు అత్యాచారాల్ని రోజూ పేపర్లలో చూస్తుండటం ఎంత అవమానకరం. నిర్భయ నుంచి దిశ వరకు అంటూ లెక్కిస్తే వేల మంది మహిళలు అశువులు బాశారు. ఎన్ని భరోసా కేంద్రాలోచ్చినా మహిళలకు భద్రత కరువై పోతూనే వుంది. ఇంకా పరువు హత్యలు జరుగుతూనే వున్నాయి. మానవాళి పురోగతిని వెక్కిరిస్తూనే ఎంత అనాగరిక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామో తెలియజేస్తూనే వున్నాయి. నిజానికి అత్యాచారాలు కానుంచి భారతావని కోసం ప్రతి మహిళా కలలు కంటూనే ఉంది. శరీరం మీద జరిగే లైంగిక దాడుల కన్నా మనసుల మీద జరిగే లైంగిక దాడిని ప్రతి మహిళా రోజూ అనుభవిస్తూనే వుంది. ఉగ్గుపాలు పట్టి జాతిని పెంచే మహిళలకు రాజకీయ పగ్గాలు పట్టుకోవటం రాదంటూ పేరుకి పదవి మహిళ దైనా పాలన పురుషుడిదే కావటం సిగ్గుచేటు. మహిళ కొంగుపట్టి లాగిన శాసనసభలున్న ఈ దేశంలో శాసనసభల్లోనే బూతువీడియోలు సెల్లుల్లో చూస్తూన్న పాలకులున్న దినాల్లోనే మనమంతా మన అస్తిత్వం కోసం వెతుకులాడుతూనే వుంటం గర్హించదగ్గ అంశాలు. అయితే వేల సంవత్సరాల మానవ చరిత్రలో పోరాడి గెల్చుకున్నవే మనుగడలో మార్పులు తెచ్చాయని మర్చిపోవద్దు. సంఘటితంగా వుంటేనే విజయాలు వరిస్తాయని ఒకు చెప్పాల్సిన అవసరమూ మనమూ తెచ్చుకోవద్దు. కరోనా కాలంలో మానవాళిని బ్రతికించింది ప్రతి ఇంటకి డాక్టర్లమై కాపాడింది. అన్నం పెట్టి కుటుంబాల్ని బ్రతికించుకుంది. ధైర్యం నూరిపోసి పరిస్థితుల్ని తట్టుకుని నిలబడింది. నిజానికి స్త్రీలే ఒకే జన్మలో రెండు జీవితాల్ని (పురుడు మరో జన్మంటారు) ధైర్యంగా ఎదుర్కోనే జాతి మహిళే. అసమానతలు అంతరించాలంటే గళం విప్పాలి. మనం ఎదగటంతో పాటు మహిళా జాతిని కూడా ఎదిగేలా చెయ్యాలి. అవిద్య, అవగాహనా రాహిత్యం, ఆర్థిక స్వేచ్ఛ లేక పోవటం మహిళలకు అడ్డంకులు.... పాలనలో సమభాగస్వామ్యం పంచుకుంటేనే మహిళల సమస్యలకు చట్ట బద్ధత వస్తుంది. ఈ శతాబ్దపు సూత్రం అటు సాహిత్యమైనా ఇటు వ్యవస్థ పరమైనా ''ఎవడి గోస వాడే చెప్పాలనేదే'' కాబట్టి మన వేదన సాటి మహిళకు మాత్రమే తెలుసు. చట్ట పరంగా పాలనా రంగాల్లో మహిళలు 50శాతం వుండాల్సిందే. వివక్షలు, విద్వేషాలు ఏ రంగంలోనైనా వుంటాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టినప్పుడే ఎదుర్కోవటానికి సిద్ధపడి రావాలి. ''పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప'' అన్నారు. ఇప్పటికీ వర్తిస్తుంది. అయితే నా విజ్ఞప్తి ఒక్కటే ఎదగాలన్న మోహంతో గూడున్న చెట్టును మర్చిపోవద్దు. భారతీయత్మకు మూలం కుటుంబం. అమ్మను 'రీప్లేస్‌' చేసే వ్యవస్థ ఎప్పుడూ రాదు. మన పిల్లలు నివసించే రేపటి సమాజాన్ని మన ఇంట్లో నిర్మించే కార్మికురాలు ప్రతి మహిళనే. 'పెంపకాలు' తప్పకుండా మహిళే చూడాలి. అప్పుడే పిల్లలు మానవీయతతో ఎదుగుతారు. మనని మనం ప్రూవ్‌ చేసుకోవటానికి కర్ర విడిచి సాము చేయ్యొద్దు. భ్రాంతులు ఎన్నో, ఆకర్షణలు ఎన్నో నిత్యం పతనం వైపుకే నడిపిస్తాయి. ఈ తరం జాగ్రత్త పడితే చాలా ఆత్మ గౌరవంతో, ప్రశాంత జీవనంతో మహిళ బతికే సమాజమే నా ఆశయం. కల కూడా...
- అయినంపూడి శ్రీలక్ష్మి

ఆమె

అరిగిన కొబ్బరి ఈనుల
చీపురుకెరుక
పెదవిదాటని
మాటలకెరుక
రెప్పలచాటున చిక్కిన
కన్నీటి చుక్కలకెరుక
పంటిబిగిన దాగిన
మౌన రోదనకెరుక
పసుపుతాడుతో ముడిపడిన
పవిత్ర బంధానికే ఎరుక
జీవిత నావకు కట్టిన
చుక్కానికే ఎరుక
కష్టాలనెదురొడ్డిన
త్యాగాలకెరుక
అసూయపడే
సహనానికెరుక
తులనాత్మకంగా సరిపోల్చగలిగే
ప్రమాణాలకే ఎరుక
''ఆమె''కు ఆమే సాటని
- యం యస్‌ రాజు, 9502032666

ప్రపంచం మారుతోంది
నేటి మహిళలు ఇటు ఆర్ధికవాదంతోనూ, అటు సాంప్రదాయ భారంతోనూ కొట్టు మిట్టాడుతున్నారు. ఆదర్శవంతమైన మహిళ లను చిత్రీకరించిన సమాజం, వారిని త్యాగనిరతులుగా, స్వలాభాపేక్ష లేని వ్యక్తులుగా చూపి సంతోషపడింది కాని దానికి మూల్యం ఆడవారు మాత్రమే చెల్లించవలసి వస్తోంది. తల్లి, కూతురు, కోడలి, అత్తగారి పాత్రలను పోషిస్తూ, ఈ ఆదర్శమూర్తుల కిరిటపు భారాన్ని మోస్తూ, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మహిళలు చేసే ప్రయాణమేమి చిన్నది కాదు.
ప్రపంచం మారుతోంది. సంస్కరణల సంఖ్య పెరుగుతోంది. అలానే ఆడవారి పట్ల హింస రూపాంతరం చెందుతోంది కాని తగ్గడం లేదు. ఉద్యోగావకాశాలు, పిల్లల పెంపకంలో ఇది స్పష్టమవుతూనే ఉంది. ఇక ఆర్ధిక, మేధోపరమైన, లైంగిక వ్యవహారాల్లో ఎదురయ్యే చిన్న చూపు, మోసం, అవమానం ఇంకా సిగ్గుపడే స్ధాయిలోనే ఉన్నాయి. కాని ఈ ఒత్తిడులకు తలవంచకుండా ఆడవారు పట్టుదలగా పోరాడుతూనే ఉన్నారు. తమ జీవితంపై నియంత్రణ సాధించే ప్రయత్నాలు గత మూడు తరాలుగా సాగుతూనే ఉన్నాయి.
అయితే నేటి ఆధునిక సమాజం, మహిళలను గురించి రెండు నాల్కలతో సంభాషిస్తుంది. పిల్లలు పెంచడంలో తల్లుల బాధ్యత ఎక్కువ అని వాదించే సమాజం, వారు ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చి ఇంటికి పరిమితమైతే, ఆర్ధికంగా ఆధారపడి ఉన్నారని ఎద్దేవా చేస్తుంది. ఇటువంటి ద్వంద్వ వైఖరి ఉన్న సమాజంలో స్త్రీలు కూడా ద్వంద్వ (ఆంతరంగిక, బాహ్య) వ్యక్తిత్వాలతో ప్రవర్తించవలసిన అగత్యం ఏర్పడుతోంది.
దీనికి విద్యావ్యవస్ధలో మార్పులు రావాలి. అంతేగాక, చిన్నప్పటి నుండి తలిదండ్రుల మధ్య లింగ సమానత్వాన్ని గమనిస్తూ పెరిగిన పిల్లలు, సమాజంలో వేగవంతమైన మార్పును తీసుకురాగలరు. సహజత్వానికి, సమానతకు నరైన స్ధానమిచ్చినప్పుడే లింగ వివక్ష, లింగపరమైన పాత్రల ఒత్తిడిని నిర్మూలించగలుగుతాం.
Find yourself before finding someone ఇదే నేటి తరానికి నేను చెప్పగలిగేది. మనలను ఆవిష్కరించుకున్నాకే, మరొకరికి ఆలంబన కాగలం.
- అపర్ణ తోట

చట్టాలెన్ని వచ్చినా....
ప్రస్తుత మహిళల పరిస్థితి ఆధునిక మహిళ సాధికారత వైపు వెళుతున్నప్పటికీ స్త్రీలు వివక్షత, హింస ఎదుర్కొంటోనే వున్నారు. వారికి అందించే విద్య కూడా అరకొరగా ఉంది. గ్రామీణ బాలికలకు చదువు పూర్తిగా పొందలేకపోతున్నారు.
- అర్భన్‌ ఏరియాలో సెక్సువల్‌ హెరాష్‌మెంట్‌ పెరిగింది. ఉద్యోగ ప్రదేశాల్లోనూ ఇది ఉంది. సైబర్‌ క్రైమ్‌ విషయంలో మహిళలు ఎక్కువగా గురౌతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌, మహిళ వ్యక్తిత్వాల హననం ఎక్కువగా జరుగుతోంది.
- మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ అన్నారు గాని ఏదీ జరగలేదు. రాజకీయాలు మహిళల్ని వారి పరిస్థితుల్ని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రయివేటులోనూ ఉద్యోగాలు లేవు.
- ఆర్థిక పరిస్థితుల ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉన్నాయి. మహిళలల్లో మూఢ విశ్వాసాలు, ఎక్కువ. వీరిని చైతన్య వంతం చేసే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు పూనుకోవాలి.
- అసమానతలు పోవాలంటే పురుషుల ఆలోచనలు మారాలి. ఇప్పుడు హిందూ, ముస్లిం అనే విభేదాలు సృష్టిస్తున్నారు.
- మనిషి అన్న వారికి మానవత ఉండాలి. మనిషిని మనిషిని విడదీసే విధానాలను వ్యతిరేకించాలి. మనుషుల పట్ల ప్రేమ వెల్లి విరియాలి.
- ఖలీదా పర్వీన్‌

అసమానతలు మనకు మనమే సృష్టించుకున్నవే

ప్రస్తుతం మహిళల పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం మహిళల పరిస్థితి అన్ని రంగాల్లో మెరుగ్గా ఉన్నా, మనం అనుకున్నంత ఆశాజనకంగా లేదనిపిస్తుంది. అందుకే వారికి అన్ని రంగాల్లో సముచితమైన స్థానాలను కల్పించి గౌరవిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దానికోసం సరైన కార్యచరణకు ఉపక్రమించాలి.
ఆధునిక కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న సవాళ్లు ఏమిటి?
నేటి ఆధునిక కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న సవాళ్లు అనేకం వాటిని ఏకరువు పెట్టడం అసాధ్యం.
మచ్చుకు కొన్ని నిరక్షరాస్యత. నిరుద్యోగం, గృహ హింస, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, సామాజిక వివక్షత, లింగ వివక్షత, వరకట్నం, సరైన ప్రోత్సాహం లేకపోవడం, మూఢనమ్మకాలు, మద్యపాన నిషేధం మొదలైనవి వారి అభివృద్ధికి ఆటంకాలు.
నేటి రాజకీయ ఆర్థిక పరిస్థితులు, ఆలోచనలు ఛాందాసంగా మారిన సందర్భాన్ని ఎలా ఎదుర్కోవాలి?
అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జారవిడవకుండ అందిపుచ్చుకొని తమకున్న సృజనతో వాటిని వినియోగించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎదురయ్యే సమస్య లన్నిటికి ధైర్యంగా ఎదురొడ్డి నిలవాలి.
అసమానతలు అంతరించాలంటే ఏం చేయాలి?
అసమానతలు మనకు మనమే సృష్టించుకున్నవే కాబట్టి మనం మనింటినుండే వాటిని సరి దిద్దుకొని అధిగమించాలి.ఆడమగ తేడాలేకుండా మన పిల్లలను పెంచి పెద్ద చేయాలి. మన తోటి మహిళలను తక్కువ చూపు చూడకుండ అన్ని విధాల వెన్ను తట్టి ప్రోత్సహించాలి.అందరికి అక్షరాస్యత నేర్పాలి.
నేటి తరానికి మీరిచ్చే సలహా ఏమిటీ?
ముఖ్యంగా నేటి తరం మహిళలు, ఆడపిల్లలు చదువులో ముందుకు రాణించాలి, వివిధ రంగాల్లో ప్రవేశించి మెళుకువలు తెల్సుకోవాలి,వరకట్నానికి దూరంగా ఉండాలి, అవినీతిని ప్రశ్నించాలి,అన్యయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, స్వయం ఉపాధి సాధించాలి, నిరక్షరాస్యతను రూపు మాపి అందరికి ఆదర్శంగా ఉంటూ చెడుకు దూరంగా మంచికి దగ్గరవుతూ నలుగురి ముందు తలెత్తుకొని తిరిగేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని నేను ఆకాంక్షిస్తాను.
- ఎస్‌ జవేరియా
9849931255

సంప్రదాయాం పేరిట ఛాందసవాదం చుట్టు ముట్టేస్తుంది

ప్రస్తుత మహిళల పరిస్థితి ఎలా ఉంది?
మహిళలందరూ ఒకటి కాదని బలంగా చెప్తూ ఉంటాను ఎప్పుడూ స్త్రీలందరినీ ఒకే గాటిన కట్టి అందరూ బాధితులే అనే స్టేట్‌మెంట్‌ చాలా ప్రమాదకరమైంది. ముఖ్యంగా దళిత బహుజన మైనారిటీ స్త్రీలకు వర్గం, కులం, మతం, ప్రాంతం స్త్రీల విషయంలో తక్కువ నష్టాన్నేను ఇవ్వలేదు. అందుకే మహిళల స్వేచ్ఛ, అభివృద్ధి, సాధికరత, గెలుపు, కష్ట నష్టాలు వారి కుల, మత వర్గ, ప్రాంత, పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. దళిత క్రైస్తవ స్త్రీలు సామాజికంగా పడుతున్న వివక్ష. ముస్లిం మహిళలు సాంస్కృతికంగా, సామాజికంగా ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు, గృహ హింసను అనుభవిస్తున్న ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీల సమస్యలన్నీ ఒక్కటి కావు. ఇవన్నీ భిన్న అస్తిత్వాలకు భిన్న నేపథ్యాలకు సంబంధించినవి. వీటన్నిటినీ ఆయా దృష్టి కోణాల నుంచి చూడాల్సిన అవసరం ఉంది.
లైంగిక దాడుల్ను చూస్తే భారతదేశం స్త్రీలకు మహా ప్రమాదకరమైన దేశమని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ లైంగిక దాడి బాధితురాలికు న్యాయం దక్కడం, ప్రచారం దక్కడం చూస్తూనే ఉంటాం, మరో పక్క అత్యాచారం ఎవరికి జరిగినా ఒకటే అనే అబద్ధపు ఆలోచనను ప్రజలపై రుద్దడం కూడా చూస్తుంటాం. దళిత, మైనారిటీ మహిళలు లైంగిక దాడులకు, దోపిడీలకు, బెదిరింపులకు గురైనప్పుడు ఎంత మందికి కనీస న్యాయం, మర్యాదలు, దక్కుతున్నాయన్న ప్రశ్నలు మనలో మొదలవ్వనంత కాలం వాళ్ళ కన్నీళ్ళను పక్కకు నెట్టి వాళ్ళ శవాలు కాళ్ళకింద నలుగుతున్నాయని స్పృహ లేకుండా మహిలాభివృద్ధి అంటూ ఒక వర్గాన్ని అభినందిస్తూ వుంటాం.
ఆధునిక మహిళ ఎదుర్కుంటున్న సవాళ్ళు ఏంటి?
పరిస్థితులు మారే కొద్దీ సవాళ్ళు సమస్యలు కూడా వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఒకప్పుడు నిర్దయగా మాట్లాడేవారు ఇప్పుడు అందమైన చిరునవ్వుతో అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్స్‌ ఉంటా, ప్రత్యే చట్టాలున్నా వారిని తక్కువ చేసి చూడడమనేది ప్రతి తరంలో ఎదుర్కోవాల్సిన సవాలే పెద్ద పెద్ద సినీ తారలు, రాజకీ నాయకుల నుంచి సాధారణ స్త్రీల వరకూ ఇదెప్పుడూ మారలేదు. ఆధునిక మహిళ ఎంత మందికి పోతున్నా పురుషుడికంటే నువ్వు తక్కువ అని వెనక్కి లాగుతూనూ ఉంటున్నారు. మనం ఎంత మోడ్రనైస్‌ అవుతున్నా సంప్రదాయాం పేరిట ఛాందసవాదం చుట్టు ముట్టేస్తుంది. వ్యవస్థే అలా ఉన్నప్పుడు ప్రజలు ఎన్నో రకాలుగా తల్లడిల్లుతుంటారు కొన్ని సార్లు ప్రాణాలతో సహా బలవుతూ ఉంటారు. అస్తిత్వ పోరాటం, తమ గొంతు వినిపించాలనే తపన, సమానత్వ పోరాటాలతో ఎదుర్కొనే ప్రరిస్థితి చూస్తుంటే కొంత వరకూ మార్పు కనిపించినా పాలక వైఖరితో ఏకీభవించే వారు ప్రజల్లోనే ఉండడం నిరాశ కలిగిస్తుంటుంది. ఆర్థిక, రాజకీయ మార్పులు కేవలం ప్రజలతోనే వచ్చేది కాదు.
ముందు దళిత బహుజనులు, మైనారిటీలు ఏకం కావాలి. ఇక్కడున్న కుల, మత విద్వేషాలు, పితృస్వామ్యం, నశించి సమానత్వాన్ని జయించిన రోజు సగానికి పైన సమస్య తీరినట్టే.
మహిళలు, ఆడపిల్లలు బాగా చదవాలి, రాయాలి. మాట్లాడాలి. ఉద్యోగాలు, కుటుంబాలు, ఆరోగ్యాలు, అధికారాలతో పాటు వారి అస్తిత్వాన్ని నిరంతరం బతికించుకోవాలి. వారిని వారు ముందు నమ్మాలి. గౌరవించుకోవాలి.
- మానస ఎండ్లూరి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి
బుక్‌ ఫెయిర్‌ పుస్తకాల పెద్ద పండుగ
యదార్థ గాథలకు దృశ్య రూపమిచ్చిన శ్యామ్‌ బెనగల్‌
గురుకులాల వైపే అందరి చూపు
భార‌త రైతుల చారిత్రాత్మ‌క విజ‌యం
నట్టింట్లో వినోద వేదిక టెలివిజన్‌
పిల్లలేమంటున్నారంటే....

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.