Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే... | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Mar 13,2022

యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...

యుద్ధం ఓ అనాగరిక చర్య.
..... అంటే ఇంకా ఈ భూమిపై నాగరిక మానవుడు ఉద్భవించలేదా..? మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇది.
యుద్ధం అంటే మానవ వినాశనమని, మానవ శ్రమతో తరాలుగా నిర్మించిన ఆస్తుల కట్టడాల విధ్వంసమని, పచ్చని పర్యావరణ విఘాతమని వేరుగా చెప్పక్కర్లేదు.
                       20వ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో (1914 - 19) కోటిమంది చనిపోయారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో (1939 - 44) ఐదున్నర కోట్ల మంది చనిపోయారు. కాగా ఈ రెండు యుద్ధాల్లో క్షతగాత్రులైన వారు పది కోట్లమందికి పైగానే ఉంటారు. ఆప్తులను, ఆస్తులను కోల్పోయి ఒంటరిగా దీనులుగా మిగిలి బతుకీడ్చినవారు కోకొల్లలు.
                       దాదాపు నలభై లక్షల కోట్ల రూపాలయల సంపద విధ్వంసమైందని (అప్పటి లెక్కల ప్రకారం) సమాచారం.
గత శతాబ్దంలో ఇంతటి భయంకరమైన దుర్మార్గం యుద్ధోన్మాదం, విషాదం జరిగిందా..? అంటే జరిగిందనే సమాధానం వస్తుంది.
                       నరహంతక నాజీ హిట్లర్‌ 1941జూన్‌ 22న ఎలాంటి హెచ్చరిక లేకుండానే సోవియట్‌ రష్యాపై మెరుపుదాడి జరిపాడు.
55 లక్షల సైనికులు, 4300 యుద్ధ టాంకులు, 48 వేల మర ఫిరంగులు, 6వేల విమానాలు ఈ ఆకస్మిక దాడిలో పాల్గొన్నాయి.
యావత్‌ మానవాళి చరిత్రలోనే ఇది అతిపెద్ద యుద్ధ (సైనిక) దాడిగా చరిత్రకారులు అభివర్ణించారు.
                       కామ్రేడ్‌ స్టాలిన్‌ నేతృత్వంలో ఎర్రసైన్యం (రెడ్‌ ఆర్మీ) ఆరు నెలల పాటు ఈ దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. ఓ విప్లవకరమైన కఠోర దీక్షతో, రెండు కోట్లమంది సైనికులు, ప్రజల బలిదానంతో నాడీ మూకలను వెనక్కి తరిమికొట్టగలిగింది రష్యా. అన్ని ఖండాలలోని 61 దేశాలు పాల్గొన్న ఈ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడుగాని పరిసమాప్తం కాలేదు.
ఓ యుద్ధోన్మాదం నుండి ఈ లోకాన్ని కాపాడిన కాలం గనుకనే అది స్టాలిన్‌ యుగంగా భాసిల్లింది.
                       1945 జూన్‌లో యుద్ధం అంతమైంది. కాని అదే ఏడాది 1945 ఆగస్టు 6వ తేదీ ఉదయం ప్రశాంత ప్రాత:కాల వేళ అమెరికా, జపాన్‌లోని హీరోషిమా నగరంపై తొలిసారిగా అణు (ఆటం) బాంబును ప్రయోగించింది. ఆగస్టు 9న నాగసాకి నగరంపై రెండవ అణుబాంబును ప్రయోగించింది.
హీరోషిమాలో 78వేలమంది మరణించారు. ఏ ఆనవాలు కన్పించకుండా బుగ్గి అయిన వారు 14 వేల మంది. మరో 40 వేల మంది గాయపడ్డారు. పెల్లుబికిన ఆ మారణ కాలుష్యానికి (రేడియేషన్‌, విష వాయువులు) కోలుకోలేని దీర్ఘకాల వ్యాధిగ్రసు పాలైన వారు రెండు లక్షల మంది. అలాగే నాగసాకిలో మరణించిన వారు 24వేల మంది. బుగ్గి అయిన వారు రెండు వేల మంది. గాయపడిన వారు 23వేల మంది. వ్యాధిగ్రస్తులు 90 వేల మంది.
                       ఇదంతా చరిత్రగా నమోదైంది. అంటే ఎదురుబొదురు సైనికులు ఆయుధాలతో నిలబడి హౌరాహౌరీగా పోరాడటం, ధర్మయుద్ధం చేయడం కాలం చెల్లిన మాటైపోయింది. ఎక్కడెక్కడో అజ్ఞాతంగా కూర్చొని మీట నొక్కి బాంబుల వర్షం కురిపించవచ్చు. దేశదేశాలనే కాదు, ఖండ ఖండాలనే చిటికలో రూపుమారు విధ:గా మనిషి యుద్ధ విజ్ఞానాన్ని సైనిక పాటవాన్ని పెంచుకున్నాడు. రకరకాల యుద్ధ ప్రయోగాలు ఆయుధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.
                       ఒక మెగా టన్ను అణుబాంబును ప్రయోగిస్తే పది లక్షల టన్నుల అణుధార్మిక శక్తి విడుదల అవుతుంది. 3 నుండి 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఆ మారణశక్తి మంటల్లో ప్రాణులు జీవాలేకాదు పచ్చని పంట పొలాలు అరణ్యాలు సైతం బుగ్గైపోతాయి.
                       అయితే ప్రపంచంలో నేడు 50 - 100 మెగా టన్నుల అణుబాంబులే కాదు, హైడ్రోజన్‌ బాంబులు కూడా తయారై ఉన్నాయి. అందుకే భవిష్యత్‌లో అణుయుద్ధం వస్తే వందల కోట్ల మంది ప్రజానీకం క్షణాల్లో ఆహుతైపోతారు. దేశదేశాలే ఆనవాలు లేకుండా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
                       ఇది ఇలా ఉండగా 1980వ దశకంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రాగన్‌ కాలంలో మ్యాట్రాన్‌ బాంబు వచ్చింది. ఈ బాంబు ప్రయోగిస్తే సైనికులు, ప్రజలు, ప్రాణులు మాత్రమే చనిపోతాయి. ఫ్యాక్టరీలు, కట్టడాలు, ఆస్తులు చెక్కు చెదరవు. యథాతథంగా ఉంటాయి.
సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వికృత మనస్తత్వం ఎంత అమానవీయంగా మారిందో కదా..! అందుకే దీనిని 'పరిశుద్ధ బాంబు' అని కొందరు శాస్త్రజ్ఞులు ముద్దుగానూ, వెటకారంగానూ పిలుచుకున్నారు. ఈ కోవలోనే జీవరసాయన బాంబులు, క్రిమి రసాయన బాంబులు మానవాళి హితం కోసం యధేచ్ఛగా ఉత్పత్తి చేసుకుంటున్నారు.
                       ఒక అణుబాంబు తయారు చేయడానికి అప్పట్లో వేయి కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేవారు. ఇప్పుడు ఏటా లక్షల కోట్లల్లో అణుయుద్ధ సామాగ్రి ఉత్పత్తి అవుతూనే ఉన్నది. ట్యాంకులు, మిస్సైల్స్‌ (క్షిపణులు) యుద్ధ విమానాలు, నౌకలు జలాంతర్గాములు సరేసరి. అగ్ర రాజ్యాలు ఏకంగా మిలటరీ ఇండిస్టీయల్‌ కాంప్లెక్సులు (ఆయుధ ఉత్పత్తి కర్మాగార సముదాయాలు) పెద్దఎత్తున నిర్మించుకుంటూ పోతూనే ఉన్నాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాదంగా రూపాంతరం చెందిన తర్వాత ఆయుధ వ్యాపారమే అతిపెద్ద మార్కెట్‌గా ప్రపంచాన అవతరించింది. మిత్రదేశమా, శత్రుదేశమా, దాడులకా, రక్షణకా, ఉగ్రవాదులకా, నివారించే సైనికులకా...? ఒకరని కాదు ఎవరికైనా ఆయుధాలను అమ్ముకోవడమే వాటి పని. కర్మాగారాలు ఉన్నంత వరకు ఉత్పత్తులు జరుగుతూనే ఉంటాయి. ఉత్పత్తులు అమ్మకాలు జరగాలంటే అనివార్యంగా ఎప్పుడూ ఎక్కడో ఏదో మూల దాడులు, యుద్ధాలు జరగవల్సిందే. ఇకప్పుడు ధర్మాధర్మాలు మానవ-దానవ విచక్షణ ఏముంటుంది?
                       బలవంతునిదే రాజ్యం అన్న ఆటవిక నీతి వర్ధిల్లుతుంది. మానవ హక్కులు, బతుకులు గల్లంతైపోతాయి.
చాలా దేశాలు ప్రస్తుతం తమ స్థూల జాతీయాదాయంలో 25 శాతం అంతకంటే ఎక్కువగాను సైనిక - రక్షణ రంగానికి వెచ్చిస్తున్నాయి. తత్‌ కారణంగా విశ్వమానవ సంక్షేమం, అభ్యున్నతి, మనుగడ వెనక పట్టు పడ్తున్నాయని, ఆకలి, అనారోగ్యం, అజ్ఞానం నుండి ఈ జగత్తును ఇప్పట్లో విముక్తి చేయలేమని అర్థమవుతున్నది.
                       ముదిరిన ఈ సామ్రాజ్యవాద దశలో, ఇప్పుడున్న అణ్వాయుధాలతో మన ప్రపంచాన్ని ఒకసారి కాదు 15 - 20 సార్లు విధ్వంసం చేసుకోవచ్చని కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
మరి దీనికి అంతం ఏమిటి?
అందుకే కామ్రేడ్‌ లెనిన్‌ ఇలా చెప్తాడు.
''మనుషులు శవాల గుట్టలపై ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై తమ రాజ్య పాలనను, సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలక వర్గాలు 'కృత్రిమ' యుద్ధాలను సృష్టిస్తాయి. ఆ యుద్ధాలను పీడిత ప్రజానీకం, శ్రామిక వర్గం ఎలాంటి తటపటాయింపులు లేకుండా నిష్కర్షగా ఎదుర్కోవాల్సిందే.
పైకి అవి రెండు దేశాలు లేదా, రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలుగా కన్పిస్తాయి. కాని నిశితంగా పరిశీలిస్తే అవి అంతిమంగా సొంత దేశాల శ్రామిక ప్రజలపై దోపిడీ వర్గం చేసే యుద్ధాలుగా తేటతెల్లం అవుతుంద''ని స్పష్టం చేశాడు.
                       ఈ పరిస్థితుల్లో యుద్ధం వెనుక ఉ్న దోపిడీ వర్గ పాలకులు దుష్ట లక్షణాలను, స్వభావాలను ఎండగట్టడం కార్మిక వర్గం కర్తవ్యంగా నొక్కి చెప్తాడు. పైగా జాతీయభావాల ఉదార వైఖరిని అనుసరించినా, చివరకు అది యుద్ధోన్మాద శక్తులకు సహకరించడమే అవుతుందని వివరిస్తాడు.
లెనినిజం పునాదులను స్టాలిన్‌ ఇంత గాఢంగా అర్థం చేసుకున్నాడు గనుకనే రెండవ ప్రపంచ యుద్ధానికి చరమగీతం పాడగలిగాడు.
సోవియట్‌ యూనియన్‌పై దాడి చేసే ఉద్ధేశ్యమే అమెరికా పెద్దలకు లేకపోతే, అమెరికా పైన గాని ఇతర దేశాలపైనగాని దాడి చేసే ఉద్దేశ్యం సోవియట్‌కు ఎన్నటికీ ఉండదని 1951లోనే స్టాలిన్‌ ప్రపంచానికి తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే ఈనాటి రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమైన ఉక్రెయిన్‌ 91 తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించింది. సామ్రాజ్య వాద దోపిడీకి అనుకూలంగా ఉండే అగ్రదేశాల నాటో కూటమిలో చేరడానికి ప్రస్తుత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధమయ్యాడు. ఇదే అదునుగా ఉక్రెయిన్‌లో తన సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని నాటో ఉవ్విళ్ళూరుతున్నది. పక్కలో బల్లెంలా మారిన ఈ స్థితిని ఆదిలోనే అంతం చేయకపోతే మొదటికే మోసం వస్తుందని రష్యా అధ్యక్షులు పుతిన్‌ భావించాడు. తన దేశ ప్రజలను, ఉక్రెయిన్‌లోని రష్యన్లను రక్షించడానికి గాను హెచ్చరికలతో ఉక్రెయిన్‌ అధికారంపై దాడికి దిగాడు. పట్టువిడుపులతో యుద్ధం సాగుతున్నది. రెండు వారాలు దాటింది. అనేక మంది మరణిస్తున్నట్టు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చెల్లాచెదురై పరుగులు తీస్తున్నట్టు, పొరుగుదేశాలకు వలసలు పోతున్నట్టు, బంకర్లలో తలదాచుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిత్రాలు విడుదల అవుతున్నాయి. కాల్పుల విరమణ కాలాన్ని ఆసరాగా తీసుకుని, దాడులను తప్పించుకుని అక్కడ వున్న మన భారత విద్యార్థులు ప్రజానీకం వేలాదిమంది సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. అలాగే ప్రజల రక్షణకు, ప్రయాణాలకు వీలుగా మానవ కారిడార్‌ల ఏర్పాటుకు రష్యా, ఉక్రెయిన్‌లో సౌకర్యాలు చేసింది.. కాగా నాటో కూటమిలో చేరమని జెలెన్‌స్కీ మార్చి 8న ప్రకటించినా...? ఇతర షరతులపై ఇంకా ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. తమకు సహకరిస్తామన్న 'నాటో' తనను మధ్యలోనే వదిలేసిందని జెలెన్‌స్కీ లబోదిబోమంటున్నాడు. 'రాజుకంటే మొండివాడు బలవంతుడు' అన్న చందంగా తయారైంది పరిస్థితి.
                       ఏది ఏమైనా యుద్ధం అంటే అంతిమంగా మిగిలేది విషాదమే. సమాధి అయ్యేది సత్యమే. జరిగేది ప్రాణ నష్టమే. కోలుకోలేని విధ్వంసమే.
                       యుద్ధాల వెనుక ఆయుధ వ్యాపారమే కాదు, దేశాల సంపదను దోచుకోవడమూ దాగుంటుంది. ఆయా దేశాలలోని ప్రజల మూలుగలు పీల్చి, అక్కడి సహజ సంపదలనూ కొల్లగొట్టడానికి వ్యూహమూ ఉంటుంది. 2014 వరకు రష్యా అనుకూల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వున్నపుడు, నాటో, అమెరికా ఆధ్వర్యంలో నడిచే (ఐ.ఎం.ఎఫ్‌.) ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ తన ప్రవేశాన్ని స్వాగతించలేదు. తనకు లాభం చేకూర్చే షరతులతో పెట్టుబడులు పెట్టేందుకు ఆనాటి అధ్యక్షులు నిరాకరించారు. దాంతో ఎలాగైనా ఆ అధ్యక్షున్ని మార్చాలనుకుని, ఉక్రెయిన్‌లోని మితవాద ఫాసిస్టు శక్తులను ఉసిగొలిపి అల్లర్లు సృష్టించి, అమెరికా తనకనుకూలమైన జెలెన్‌స్కీని అధికారంలోకి తీసుకొచ్చింది. నయా ఉదారవాద విధానాలూ ఆరంభమైనాయి. ఇక పూర్తిగా ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు అమెరికా నాటో కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ రష్యా భద్రతకు ముప్పు తలపెట్టింది. ఈ పరిస్థితి గమనించిన రష్యా చూసిచూసి దాడికి పూనుకున్నది. ఆధిపత్య విస్తరణ దోపిడీకోసమేననే విషయాన్ని అన్ని యుద్ధాలు రుజువు చేస్తాయి. ఏ యుద్ధం ఎందుకు జరిగినా, నష్టపోయేది కష్టాలకు గురయ్యేది సామాన్య ప్రజలే అనే విషయం గమనంలో ఉండాలి.
                       ప్రజాస్వామ్య శకంలో ఎలాంటి యుద్ధ పరిణామాలనైనా, సైనిక దాడులనైనా చర్చల ద్వారా నివారించుకోవచ్చు. అది దేశాధినేతల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధాలకు అడ్డుకట్ట వేసేది నేతల మీద వత్తిడి తెచ్చే ప్రజా ఉద్యమాలు అని మరువరాదు. విశ్వశాంతికి అవే సోపానాలు.

- కె.శాంతారావు, 9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటం ఇంకా మిగిలేఉంది
పెరుగుతున్న మూఢనమ్మకాలు మన ఏలికలు
మధురామృతానికి మారుపేరు మహ్మద్‌ రఫీ
సుట్టబట్ట సుట్టి బోనమెత్తుకున్న తెలంగాణ
భార‌తీయ స‌మాంత‌ర చ‌ల‌న‌చిత్ర న‌టుడు న‌సీరుద్దీన్ షా
జనాభా సమస్య - భిన్న కోణాలు
కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...
న‌ట‌శేఖ‌రుడు కృష్ణ‌
ధరలు ఆకాశంలో... ప్రజలు పాతాళంలో...
సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!
తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !
భాష మన శ్వాస
సప్త స్వర సుందరి - స్వర్ణ రాగ మంజరి
తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!
అది హత్య మాత్రమే కాదు... ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది
కష్టజీవుల పండుగ సంక్రాంతి
సబ్బండ వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే
సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సావిత్రి

తాజా వార్తలు

09:37 PM

సూర్యాపేట జిల్లాలో చిన్నారిని చిదిమేసిన తండ్రి కారు..!

09:17 PM

వద్దురా నాయన ఈ విసి పాలన.. : టీయూ విద్యార్థులు

08:52 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చిన్నారుల గొంతు కోసిన తండ్రి

08:27 PM

కరోనా నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు

08:05 PM

మాజీ సర్పంచ్ ఆత్మహత్య

07:50 PM

సినీ నటుడు నాజర్‌కు తీవ్ర‌గాయం

07:27 PM

నామినేషన్లు ప్రకటించిన సైమా

07:17 PM

పంజాబ్‌లో ఆర్​డీఎక్స్ కలకలం..!

06:59 PM

ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. కేంద్రానికి సుప్రీం కీలక సూచన

06:51 PM

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ దాడులు

06:26 PM

లాసెట్‌, పీజీ లా సెట్‌ ఫలితాలు విడుదల

06:09 PM

హైదరాబాద్‌లో కరెంట్‌ పోదు.. ఢిల్లీలో కరెంట్‌ ఉండదు : కేసీఆర్

05:57 PM

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

05:39 PM

జెయింట్ వీల్‌లో శృంగారం.. జంట అరెస్టు

05:26 PM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

05:04 PM

మేడారంలో భక్తుల సందడి

04:56 PM

15 మందితో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

04:49 PM

జోరు కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లు

04:33 PM

22న ఎల్బీ స్డేడియంలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

04:03 PM

ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందేవారికి శుభవార్త

03:51 PM

ఎన్టీఆర్‌ సంచార ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ

03:22 PM

స్కూలు బస్సుపై దుండగుల దాడి

03:12 PM

అన్నాడీఎంకేలో కొత్త ట్విస్ట్

02:42 PM

భారత మహిళా క్రికెటర్లకు ఇక మ్యా‌చ్‌లే మ్యాచ్‌లు..!

02:31 PM

కాంగ్రెస్‌పై మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యా‌ఖ్య‌లు

01:42 PM

రాజకీయ పార్టీలను అడ్డుకోలేం : సుప్రీంకోర్టు

01:33 PM

ప్రముఖ ఫుట్​బాల్ క్లబ్​పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు మస్క్

12:51 PM

తిరుమలలో సర్వదర్శనానికి 16 గంటల సమయం

12:38 PM

ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో పోటీపై స్పందించిన భారత మాజీ కెప్టెన్

12:26 PM

రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ సతీమణి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.