Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అవగాహన! అప్రమత్తత!! | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

అవగాహన! అప్రమత్తత!!

            సృష్టిలో మానవ జాతిని వణికించిన మశూచి, కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు ఎన్నో వచ్చాయి. కోట్లాది ప్రాణాలను బలి తీసుకున్నాయి.అయితే కాలగమనంలో 90వ దశకం తర్వాత ప్రపంచం వైద్య రంగం ఎంతగానో పురోగమించింది. దాని ఫలితంగానే అద్భుత వైద్య పరిశోధనలు అవిష్కరించి వ్యాధులను మందులు, టీకాల ద్వారా అరికట్టడం సాధ్యపడింది. ఇదే రీతిలో ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న వ్యాధుల నియంత్రణకు నిరంతరం వైద్య రంగం విశేష కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఎదురైన ఓ ప్రాణాంతక సంక్రమణ వ్యాధే ఎయిడ్స్‌. దీని నిర్మూలనకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. అయితే నేటి వరకూ దీనిని కట్టడికి కచ్చితమైన చికిత్స మాత్రం అందుబాటులోకి తీసుకురాలేక పోయింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వ్యాధి సంక్రమించిన వారికి జబ్బును అదుపులో ఉంచే పరిజ్ఞానం నివారణ ఒక్కటే మార్గంగా కనుక్కొన్నది. అలాగని హెచ్‌ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు.ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కొందరి అపోహల కారణంగా నేడు వ్యాధిగ్రస్తుల పట్ల అమానుషం పెరుగుతోంది. నేటికీ వారిని దూరం పెట్టే వాళ్ళు లేకపోలేదు. ఇలాంటివి కుటుంబ బంధాల్ని కూడా దూరం చేస్తున్నవి. అందుకే అపోహలు, అవహేళనలు తొలగించడానికి, వ్యాధి గురించి అవగా హన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి డిసెంబర్‌ 1ని 'ప్రపంచ ఎయిడ్స్‌ దినం'గా ప్రకటించింది. వ్యాధిపై భయాందోళన వీడి అవగాహన పెంచుకుని కొంతమందికైనా మార్గ దర్శకంగా ఉండాలనే ఈ వారం అందిస్తున్న 'సోపతి' కవర్‌ పేజీ కథనం..
హెచ్‌ఐవీ
చివరి దశనే ఎఐడిఎస్‌ (ఎక్వైర్డ్‌ ఇమ్యూనో డెఫిషి యెన్సీ సిండ్రోమ్‌) ఎయిడ్స్‌ అంటారు. హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యునోడెఫీషియన్సీ వైరస్‌) అనేది ఓ వైరస్‌. ఇది రిట్రో విరిడే కుటుంబంలో లెంటి వైరస్‌ తరగతికి చెందిన వైరస్‌. ఈ వైరస్‌ ఉనికిని పారిస్‌లో 1983లో ల్యూక్‌ మాంటగ్నాయర్‌, 1984లో రాబర్ట్‌ గాలో అమెరికాలో విడివిడిగా కనుగొన్నారు. హెచ్‌ఐవీ మానవ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనపరిచి క్రమంగా ఎయిడ్స్‌ వ్యాధిని కలిగిస్తుంది. రివర్స్‌ ట్రాన్స్‌ క్రిప్టేజ్‌ అనే ఎంజైమ్‌ కారణంగా ఇది ఆకారాలను మారుస్తూ ఉంటుంది. ఆకారం (జన్యురూపం) స్థిరంగా లేకపోవడం వల్ల ఇది మందులకు లొంగడం లేదు. మానవ శరీరంలో ఇన్ఫెక్షన్‌లపై పోరాడే కణాలపై ఇది దాడి చేస్తుంది. ఈ వైరస్‌ రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోని ద్రవాలు, చనుబాలు వంటి ద్రవాల్లో నెలకొని ఉంటుంది. ఈ వైరస్‌ మనిషి శరీరంలో పైన పేర్కొన్న భాగాల్లో ఉంది అని నిర్థారిస్తే దానిని ఎచ్‌.ఐ.వీ పాజిటివ్‌ అని అంటారు.ఇది శరీరంలోనికి ప్రవేశించిన వెంటనే వేగంగా తన సంఖ్యను పెంచుకుంటూ శరీరంలో అన్ని భాగాలకు విస్తరిస్తూ పోతుంది. ఇదే సమయంలో మనిషిని రోగాల బారి నుండి కాపాడే రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో భాగమైన సీడీ4 అనే కణాలను ఈ వైరస్‌ నాశనం చేస్తుంది. ఈ కణాలు నాశనం కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి పలు అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాధారణంగా హెచ్‌ఐవీ వచ్చిన తర్వాత ప్రారంభంలో గుర్తించ కుండా అలాగే దీర్ఘకాలం పాటు వదిలేస్తే అది ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ క్రమంలోనే ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల్లో సీడీ4 కణాల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోతుంటుంది. ఫలితంగా వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు శరీరాన్ని చుట్టుముడుతుంటాయి.అప్పుడు మనిషికి వచ్చే చిన్న రుగ్మతలను కూడా కట్టడి చేయలేని పరిస్ధితి ఏర్పడు తుంది.అప్పుడు మనిషికి ప్రాణాపాయ స్ధితి కలుగుతుంది.
1981లో గుర్తించిన వ్యాధి
ఎయిడ్స్‌కు చికిత్స అంటూ ఏదీ లేదు.అంతుబట్టని ఈ వ్యాధికి మొదట్లో పేరు పెట్టలేక పోయారు.ఆయితే ఈ వ్యాధి స్వలింగ సంపర్కులలోనే ప్రబలుతుందని గమనించిన పిదప దీనికి గ్రిడ్‌ వ్యాధి (జి.ఆర్‌.ఐ.డి.- గే రిలేటెడ్‌ ఇమ్యూనో డెఫిషియెన్సీ) అని పిలవడం మొదలుపెట్టారు.ఆ తరువాత -హైతియన్స్‌(అమెరికాలోని హైతీమూలాలున్న ప్రజలు), హౌమోసెక్సువల్స్‌ (స్వలింగ సంపర్కులు), హీమోఫీలియాక్స్‌ (రక్తం ఆగనివాళ్లు), హెరాయిన్‌ యూజర్స్‌ (మాదకద్రవ్యం హెరాయిన్‌ వాడేవాళ్లు)లో కూడా ఈ వ్యాధిని ఎక్కువగా గుర్తించడంవల్ల దీనిని 4హెచ్‌ వ్యాధి' అని పేరు పెట్టారు.తర్వాత కాలంలో ఈ వ్యాధి ఈ పైన పేర్కొన్న నాలుగు వర్గాల వారి పైనే కాకుండా అన్ని వర్గాల వారిలో కూడా వ్యాపిస్తూ ఉండటాన్ని అమెరికాకు చెందిన 'సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌' గమనించింది. వివిధ పరిశోధనల ఫలితంగా 1981లో తొలిసారిగా దీనిని ఎయిడ్స్‌ వ్యాధిగా గుర్తించి తర్వాత దీనికి కారణం హెచ్‌ఐవి వైరస్‌ అని తేల్చింది. హెచ్‌ఐవి సోకిన తర్వాత, మనిషిలో సీడీ కౌంట్‌ 200/ఎంఎం క్యూబ్‌ దాకా పడిపోయినప్పుడు ఎయిడ్స్‌కు దాదాపుగా చేరువైనట్టేనని నిర్దారించింది. ఎచ్‌.ఐ.వీ సోకిన తరువాత ఈ స్థితి కొందరికి ఒకట్రెండేళ్లకే రావొచ్చు.కొందరికి 10-12 ఏండ్లదాకా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు..
వైరస్‌వ్యాప్తి
20వ శతాబ్దపు తొలినాళ్లలో పశ్చిమ మధ్య ఆఫ్రికాలో హెచ్‌ఐవి వైరస్‌ ప్రాణం పోసుకుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా శుభ్రం చేయని సిరంజీలతో టీకాలు గంపగుత్తగా వేయడం వల్ల ఈ వైరస్‌ అతి త్వరగా వ్యాప్తిచెందిందనీ, అక్కణ్నుంచి ఇది ప్రపంచాన్ని చుట్టుకు పోయిందనీ మరికొందరు అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం కండోమ్స్‌ వంటి రక్షణ సాధనాలేవీ లేకుండా అపరిచితులతో లేదా సెక్స్‌ వర్కర్స్‌ తో శృంగారంలో పాల్గొనడం ద్వారా హెచ్‌ఐవీ ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వారితో పోల్చుకుంటే స్త్రీ స్వలింగ సంపర్కుల మధ్య హెచ్‌ఐవీ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ.స్టెరిలైజ్‌ చేయని సూదుల వల్ల, ఎలాంటి పరీక్షలు జరపకుండా హెచ్‌ఐవీ సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల అమాయకులకు హెచ్‌ఐవీ వచ్చిన సందర్భాలు లేకపోలేదు. సిఫిలిస్‌, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్‌ఐవీ త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్‌ఐవీ వచ్చిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు తల్లుల ద్వారానే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా వ్యాధి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
భారత్‌లో ఇలా...
30 ఏండ్ల కిందటి వరకు భారత్‌లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పేరు కూడా ఎవరికీ తెలియదు. తొలిసారిగా 1986లో డాక్టర్‌ సునీతి సాల్మన్‌ అనే వైద్యురాలు చైన్నరులోని ఒక సెక్స్‌ వర్కర్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అదే దేశంలోని తొలి కేసు. ఏడాది గడిచే సరికి కొత్తగా మరో 135 హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో పద్నాలుగు మందికి అప్పటికే ఎయిడ్స్‌ ముదిరిపోయిన దశలో ఉంది. తర్వాతి కాలంలో శరవేగంగా హెచ్‌ఐవీ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థను (నాకో) ఏర్పాటు చేసింది. 'నాకో' ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగించింది. హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపడుతూ ఉంది.ఒకవైపు ప్రభుత్వం మరో వైపు స్వచ్చంద సంస్ధలు తమ వంతుగా చర్యలు తీసుకుంటున్నా 2010 నాటికి మన దేశంలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23.95 లక్షలకు చేరుకుంది. అయితే, 2000 సంవత్సరానికి ముందు పరిస్థితితో పోలిస్తే, 2000 నుంచి 2010 మధ్య కాలంలో కొత్త కేసుల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గినట్లు యూఎన్‌ ఎయిడ్స్‌-2012 నివేదిక వెల్లడించింది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను గుర్తించినప్పటి నుంచి మన దేశంలో ఈ వ్యాధితో దాదాపు 1.70 లక్షల మంది మరణించారు. గతేడాది దేశంలో కొత్తగా 1.96 లక్షల హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 12న పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య మంత్రి వెల్లడించిన సమాచారం ప్రకారం హెచ్‌ఐవీ మృతుల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. గడచిన మూడేండ్లలో రెండు రాష్ట్రాల్లో 37 వేలకు పైగా మృతి చెందారు.
ఏఆర్‌టీ ట్రీట్‌మెంట్‌
యాంటీ రిట్రోవైరల్‌ చికిత్స (ఏఆర్టీ) అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. ఏఆర్‌టీ చికిత్స హెచ్‌ఐవీని తగ్గించకపోయినా.. రక్తంలో వీటి ప్రతిరూపాలు ఉండటం వల్ల వైరస్‌ గుర్తించని స్థాయికి పడిపోతుంది. అయితే బాధితులు తమ జీవితాంతం ఏఆర్‌టీ చికిత్సను తీసుకో వాల్సి ఉంటుంది.హెచ్‌ఐవి తనను తాను కాపీ చేసుకుంటూ సంఖ్య పెంచుకోవడమేగాక, మందుల నుంచి నిరోధకతను కూడా పెంపొందించు కుంటుంది. అందుకని ఆ వైరస్‌ను తప్పుదారి పట్టించేందుకు యాంటీ రెట్రోవైలర్‌ థెరపీ ద్వారా రకరకాల ఎ.ఆర్‌.టి. మందులను భిన్న కాంబినేషన్లుగా ఇస్తారు. ఈ మందులు ఇవ్వడం కూడా మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్‌ లైన్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌, సెకండ్‌ లైన్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌, కాక్‌టెయిల్‌ ఆఫ్‌ మెడిసిన్స్‌, వీటిని దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతి మారిపోవచ్చు. కానీ జీవితకాలాన్ని పెంచుకోవడానికి వాటిని భరించాల్సిందే. మరో పక్క, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం హెచ్‌ఐవీ ప్రబలిన వారిలో 46 శాతం మంది మాత్రమే ఈ చికిత్సను పొందుతున్నారు. అంటే, దాదాపు సగానికి పైగా హెచ్‌ఐవీ రోగులు నేటికీ తగిన చికిత్సకు నోచుకోలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకో వాల్సిందే. దీన్ని బట్టి ప్రజల్లో ఇంకా అవగాహన కలిగించ వలసిన అవసరం ఎంతైనా ఉందని అర్ధమవుతూ ఉంది.
అపోహలు.. భయాలు
వ్యాధిని దృష్టిలో ఉంచుకుని 2020 నాటికి 90 శాతం మందిని ఏఆర్టీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని యూఎన్‌ఎయిడ్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ నేటికి కూడా ఆ లక్ష్యం నెరవేరలేదు. దీనికి ప్రధాన కారణం ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ఉన్నఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు చుట్టుకుని ఉన్నాయి. నేటికీ అవి కొనసాగుతుండటం బాధాకరం. గతంలో హెచ్‌ఐవీ వ్యాధి ప్రబలిందంటే చాలు. ఇక మరణం కోసం వేచి చూడడం తప్ప మరే ఇతర మార్గం లేదని భావించేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. హెచ్‌ఐవీని సమూ లంగా, శాశ్వతంగా తగ్గించలేక పోయినప్పటికీ ఆ వ్యాధితో పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరి చేందుకు చాలా మందులు ఇప్పుడు అందుబాటులో ఉంటు న్నాయి. ఏఆర్‌టీ-యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ తీసుకోవడం ద్వారా హెచ్‌ఐవీ బాధితులు కూడా ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ ప్రబలిన వారితో కలిసుంటే మనకు వారికి కూడా హెచ్‌ఐవీ వస్తుందనే అపోహ ఉంది. దీనివల్ల బాధితులపై వివక్ష చూపుతున్నారు. హెచ్‌ఐవీ బాధితులను తాకడం వలన, కన్నీళ్లు, చెమట, లాలాజలం, మూత్రం ద్వారానో హెచ్‌ఐవీ నమ్ముతున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. తమకు హెచ్‌ఐవీ ఉన్న విషయం తెలుసుకొని, సరైన చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలంపాటు జీవిస్తున్నారు. హెచ్‌ఐవీ ప్రబలిన 47శాతం మంది రక్తంలో ఆ వైరస్‌ చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని, రక్త పరీక్షల్లో కూడా అది బయటపడిందని 'యూఎన్‌ ఎయిడ్స్‌' చెబుతోంది. అయితే ఓరల్‌ సెక్స్‌ ద్వారా హెచ్‌ఐవీ వస్తుందనే అపోహ నిజం కాదు. ఇతర రకాల శృంగారంతో పోలిస్తే ఓరల్‌ సెక్స్‌ ద్వారా రిస్క్‌ తక్కువే. కానీ ప్రమాదం మాత్రం ఉంది.10వేల కేసుల్లో నాలుగు కేసుల్లో మాత్రమే హెచ్‌ఐవీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వైద్యులు అన్ని రకాల శృంగారానికి కండోమ్స్‌ ఉపయోగించమని సిఫారసు చేస్తారు.సంప్రదాయ వైద్యం ద్వారా ప్రార్థనలు ద్వారా హెచ్‌ఐవీని తగ్గించొచ్చనేది అశాస్త్రీయమైనది. సంప్రదాయ వైద్యం ద్వారానో, శృంగారం చేసిన వెంటనే స్నానం చేయడం లేదా కన్యతో శృంగారం చేయడం వల్ల హెచ్‌ఐవీ తగ్గడం జరుగుతుంది అనే దానిని గుడ్డిగా నమ్మి వైద్యం కొనసాగించక ప్రాణాలు కోల్పోతున్న వారు అనేకులు. దోమల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపిస్తుంద నేది అబద్ధం. ఇది హెచ్‌ఐవీ రక్తం ద్వారా వ్యాపించినప్పటికీ దోమల ద్వారా లేదా రక్తాన్ని పీల్చే పురుగుల ద్వారా అది సంక్రమించదు.ఈ అపోహే నిజమైతే ప్రపంచం అంతా ఎచ్‌ఐవీ బాధితులు ఉండేవారు. హెచ్‌ఐవీ ఉన్న తల్లుల ద్వారా తప్పనిసరిగా వైరస్‌ పిల్లలకు ప్రబలుతుందనేది నిజం కాదు.ప్రతిసారీ వైరస్‌ తల్లుల నుంచి పిల్లలకు రావాలని గ్యారంటీ లేదు. వైరస్‌ 'సప్రెస్డ్‌' దశలో ఉన్న తల్లులు దాన్ని వ్యాపింప జేయకుండా కూడా పిల్లలకు జన్మనివ్వొచ్చు.భార్యాభర్తలిద్దరికీ హెచ్‌ఐవీ ఉంటే కండోమ్‌ వాడాల్సిన అవసరం లేదని తప్పు. భార్యాభర్తలిద్దరికీ హెచ్‌ఐవీ ఉన్నప్ప టికీ కండోమ్‌ ఉపయోగించకుండా అంటే అసురక్షితమైన ల్కెంగిక చర్యలో పాల్గొనడం ఏమాత్రం సరికాదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్న హెచ్‌ఐవీ ఒకే రకమైనది కాకపోవచ్చు. హెచ్‌ఐవీలో కూడా రకాలున్నాయి కాబట్టి భాగస్వామి నుంచి మరో రకం వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఫలితంగా హెచ్‌ఐవీ చికిత్స నిమిత్తం ఉపయోగిస్తున్న మందు ఆ వైరస్‌కు తగినది కాకపోతే శరీరంలో వైరల్‌ లోడ్‌ పెరిగిపోతుంది. తద్వారా వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్‌ఐవీ ప్రబలిన తర్వాత భాగస్వామితో శృంగారంలో పాల్గొనే సమయంలో కూడా కండోమ్‌ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.
వ్యాధి నుంచి రక్షణ
నివారణే తప్ప చికిత్సలేని ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ నుంచి ప్రజలు రక్షణ పొంది ఆ మహమ్మారిని తరిమి వేయాలంటే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అవగాహన పొందాలి. హెచ్‌ఐవీ అంటే ఎయిడ్స్‌ కాదు. ఎయిడ్స్‌ అంటే మరణం కాదు' అన్న విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ హెచ్‌ఐవీ ప్రబలితే క్రమం తప్ప కుండా మందులు తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, నియమబద్ధమైన జీవితాన్ని గడిపే వాళ్లకు హెచ్‌ఐవి అంత భయపెట్టే దేమీ కాదు. ఎప్పటికప్పుడు వైరల్‌ లోడ్‌, సీడీ4 కౌంట్‌ పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ తదనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తగ్గుముఖం పెట్టినట్లు అనిపించినప్పటికి మందులు కొనసాగిస్తూ ఉంటే చాలా కాలం దాని ప్రభావం నుండి బయట పడవచ్చు. అయినప్పటికీ కొందరు క్షణికానందంతో కొందరు అవగాహన లేక మరికొందరు నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకుంటున్నారుజాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు.
తగ్గుతున్న కేసులు
మొత్తం మీద ఎయిడ్స్‌ లేదా హెచ్‌ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులనుంచి చూస్తే ప్రస్తుతం ఎయిడ్స్‌ అంటే భీతిల్లె పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. కాలానుగుణంగా బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్‌ కోవిడ్‌ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్‌ నుంచి జనం దృష్టి మళ్లింది. దానితో పాటు ప్రజలలో కొంత అవగాహన పెరగడం వలన కూడా కొన్నేండ్లేగా ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవు తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో 2010 నుంచి 2019 మధ్య హెచ్‌ఐవీ కొత్త కేసుల సంఖ్య 37 శాతం తగ్గిపోయింది. కేవలం జాగ్రత్తలు పాటించడం వల్లనే ఇది సాధ్యమైంది.కానీ ఎయిడ్స్‌/హెచ్‌ఐవీ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే, గడచిన రెండు మూడు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టింది. యాంటీ రిట్రోవైరల్‌ చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇది చాలా ఆశాజన కమైన పరిణామమే. ఎయిడ్స్‌ మరణాలు, కొత్త ఇన్ఫెక్షన్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ తగ్గింపులో అంత వేగం కనిపించడం లేదు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎయిడ్స్‌ కు మందు వచ్చేసింది పసరు వైద్యం,మూలికా వైద్యం,ఆయుర్వేద వైద్యం అంటూ సామాజిక మాధ్యమాలలో వస్తున్న విస్తృత ప్రచారాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాము. అయితే వాస్తవంగా ఇప్పటి వరకూ ఏ వైద్య విధానంలో కూడా దీనికి పరిష్కారం కనుగొనలేదు. అటువంటి చికిత్స ఏదయినా వచ్చింది అంటే దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించాలి.శాస్త్రీయంగా ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఏ ఇతర ప్రముఖ ఆరోగ్య సంస్థలు కానీ అధికారికంగా ఏ వైద్య విధానాన్ని ఎయిడ్స్‌ చికిత్స కోసం గుర్తించలేదు.ప్రామాణికత లేని వైద్యాలను ఆశ్రయిస్తున్న అనేక మంది ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ) మందులు వాడకుండా, వైద్య పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలను పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు.మోసపూరిత ప్రకటనలను నమ్మకుండా ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ) మందులు వాడుతూ ఉంటే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. హెచ్‌ఐవీ పరీక్ష చేసిన రక్తాన్ని మాత్రమే రక్త మార్పిడికి ఉపయోగించడం డిస్పోజబుల్‌, స్టెరిలైజ్డ్‌ సిరంజీలు, సూదులనే వాడటం వంటి ప్రాధమిక జాగ్రత్తలు పాటించాలి.ప్రధానంగా ఎయిడ్స్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఎయిడ్స్‌ వచ్చిన వారు తమ మూలంగా వేరొకరికి ఈ వ్యాధి మరొకరికి సంక్రమించకుండా జాగ్రత్తలు చేపట్టడం అంత ముఖ్యం. ఐక్యరాజ్య సమితి, ఎయిడ్స్‌ పోరాట సంస్థ 'యూఎన్‌ ఎయిడ్స్‌' మార్గనిర్దేశనంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలూ, ప్రజలూ, మీడియా, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు, వైద్యులూ సరైన రీతిలో స్పందించి ఎయిడ్స్‌ను చాలావరకూ అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించే ఎయిడ్స్‌ను అంతం చేయాలనే 2030 లక్ష్యానికి ఇంకా ఎనిమిదేండ్లు మాత్రమే మిగిలి ఉంది. దీనికి ప్రపంచ దేశాల కృషితో పాటు ప్రజల్లో అవగాహన, అప్రమత్తత అత్యంత ఆవశ్యం.
మూడు రకాల పరీక్షలు ముఖ్యం
      హెచ్‌ఐవీ బారినపడ్డవారికి తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ప్రబలుతున్నకొద్దీ.. ఇన్‌ఫ్లు యెంజా తరహా లక్షణాలు బయటపడ తాయి. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. తర్వాత ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు మొదలవుతాయి. శరీరం ఇతర వ్యాధులను ఎదుర్కొనే శక్తి కోల్పోతుంది. చికిత్స లేకపోతే.. టీబీ, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశమూ ఉంది. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తిలో ఐదేండ్ల వరకు బాహ్యంగా ఎటువంటి రోగ లక్షణాలు కనిపించవు. బాధితుడిని హెచ్‌ఐవీ వ్యక్తిగా గుర్తించలేం. సాధారణ వ్యక్తిలాగే కనిపిస్తాడు. కేవలం ఎలీసా,వెస్టన్‌ బ్లాట్‌,పీసీఆర్‌ వంటి మూడు రకాలైన రక్త పరీక్షల ద్వారా మాత్రమే హెచ్‌ఐవీ ఉనికిని తెలుసుకోవచ్చు.
హెచ్‌ఐవీ వ్యాప్తి, మరణాలు
      ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయస్సు నుంచి మధ్య వయస్సుని వారిలో ఎక్కువశాతం మరణాలకు ఇది కారణమవుతోంది. ఇప్పటిదాకా 3.5కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్‌ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేవలం గత ఏడాదిలోనే దాదాపు 10 లక్షల మంది హెచ్‌ఐవీ సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోయారు. ప్రస్తుతం సుమారు 3.7కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. అందులో 70శాతం ఆఫ్రికాలోనే ఉన్నారు. వారిలో 18లక్షల మందికి 2017లోనే హెచ్‌ఐవీ ప్రబలింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 'ఎయిడ్స్‌'తో సుమారు 3.6 కోట్ల మంది చనిపోయారు ప్రతిరోజూ 900 మంది పిల్లలు పుడుతూనే కొత్తగా హెచ్‌ఐవి బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.అభం శుభం తెలియని చాలామంది చిన్నారులు తల్లుల ద్వారానే ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే, తల్లుల నుంచి బిడ్డలకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్‌ఐవీ వస్తున్నదని యూనిసెఫ్‌ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏండ్ల లోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. 2019లో 3.20 లక్షల మంది హెచ్‌ఐవీ బారినపడగా వారిలో 1.10లక్షల మంది చనిపోయారని పేర్కొంది.ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తిని అరికట్టకలేకపోతే 2030 నాటికి రోజుకు 80 మంది యుక్త వయస్సులు ఈ మహమ్మారికి బలవ్వాల్సిందేనని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
డిసెంబర్‌1 ఎయిడ్స్‌ డే
      ఎయిడ్స్‌ మహ్మమారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మరణిస్తుండటం తో దాని గురించి జనాలకు అవగాహన కల్పించడానికి 1988 నుంచి ఏటా డిసెంబర్‌ 1న ప్రపంచ ఆరోగ్యం సంస్థ వరల్డ్‌ ఎయిడ్స్‌ డేను నిర్వహిస్తోంది.ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం వరల్డ్‌ ఎయిడ్స్‌ డే నిర్వహిద్దామని 1987 ఆగష్టులో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జేమ్స్‌ బన్‌, థామస్‌ నెట్టెర్‌ అనే ఇద్దరు పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు అనుకున్నారు. ఎయిడ్స్‌పై పోరాటం చేస్తున్న గ్లోబల్‌ ప్రోగ్రాం ఆన్‌ ఎయిడ్స్‌ కూడా దానికి ఆమోదం తెలిపింది.దీని కారణంగా 1988 డిసెంబర్‌ 1 నుంచి ఎయిడ్స్‌ జరుపు తున్నారు. ఎయిడ్స్‌ సోకిన వ్యక్తులకు ఈ రోజున సంఘీభావం ప్రకటిస్తాయి. ఐక్యరాజ్య సమితి సంస్థలు, ప్రభుత్వాలు, సివిల్‌ సొసైటీలు ఈ వ్యాధికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించే రోజు మాత్రమే కాకుండా, ఇది వైరస్‌తో సావాసం చేసే వ్యక్తుల కోసం నిధులను సేకరించే సమయంగా ఈ రోజును గుర్తించారు.

- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి
పుస్త‌క‌మేవ జ‌య‌తే
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు
నాటి నవ్వుల కలలరాణి షర్మిలా ఠాగూర్‌
ఆన్‌లైన్‌లో తెవెలుగు
రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా!
పర్యావరణం!
తారా ప్రపంచంలో తళుక్కుమన్న రేఖ
మానవాభివృద్ధికి మార్గాలు.. పుస్తకాలు..
ఆహారం భద్రమేనా?
ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'జూబ్లీ గర్ల్‌' ఆశా పరేఖ్‌
గాంధీజీ కన్న కలలు ఏవి..?!
బ‌తుకుమ్మా బ‌తుకు
హీరోగా, విలన్‌గా నటించి మెప్పించిన రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు
వీరుల త్యాగాల నేల నా తెలంగాణ
సమాజ దార్శనికుడు గురువు
నేటి సమాజంలో వృద్ధుల జీవన చిత్రం
పోరాటం ఇంకా మిగిలేఉంది
పెరుగుతున్న మూఢనమ్మకాలు మన ఏలికలు
మధురామృతానికి మారుపేరు మహ్మద్‌ రఫీ
సుట్టబట్ట సుట్టి బోనమెత్తుకున్న తెలంగాణ
భార‌తీయ స‌మాంత‌ర చ‌ల‌న‌చిత్ర న‌టుడు న‌సీరుద్దీన్ షా
జనాభా సమస్య - భిన్న కోణాలు
కాకతీయ వైభవ జాతర
మాదక మత్తుతో తప్పదు ముప్పు
భ‌గ్న‌ ప్రేమికురాలు అలనాటి అందాల తార గాయని సూరయ్య
నేల తల్లిని కాపాడుకుందాం...

తాజా వార్తలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

11:18 AM

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి కన్నుమూత..

10:40 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

10:32 AM

ఈస్ట్‌మారేడుపల్లి..అపార్ట్‌మెంట్‌లో మంటలు

10:23 AM

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

10:05 AM

జర్దారీ నన్ను చంపాలని చూస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

09:09 AM

టీఎస్ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌ పార్సిల్‌ సర్వీసు ప్రారంభం

08:52 AM

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

10:06 AM

గోశాలలో 45 ఆవులు మృతి

08:16 AM

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు...

08:06 AM

బైకర్‌ను కొట్టిన ఎస్సై..కేసు పెట్టించిన మాజీ కలెక్టర్

10:06 AM

జెరూసలేంలో కాల్పుల మోత..8 మంది మృతి

07:40 AM

అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు

07:21 AM

నేడు నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్‌

07:14 AM

భారత్‌ జోడో యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

07:10 AM

బెంగళూరుకు తారకరత్న తరలింపు...

09:55 PM

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

09:45 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

09:35 PM

బిటెక్ విద్యార్థిని అదృశ్యం..

09:27 PM

హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..

09:25 PM

కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్

09:03 PM

రేపు నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

08:54 PM

భార‌త్ విజయల‌క్ష్యం 177..

08:46 PM

నగ్న వీడియోలు పంపాలని బాలికను బలవంతం..విద్యార్థి అరెస్ట్‌

08:41 PM

తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం బాధాకరం: పవన్ కల్యాణ్

08:33 PM

భవనంలో చెలరేగిన మంటలు..

08:28 PM

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన జకోవిచ్..

08:01 PM

అన్ స్టాపబుల్.. పవన్ ప్రోమో రిలీజ్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.