Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రకృతికి, మానవ ప్రవృత్తికి హితవరి గోరటి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Jan 03,2022

ప్రకృతికి, మానవ ప్రవృత్తికి హితవరి గోరటి

మానవాళి ప్రయోజనాల కోసం ప్రకృతిని చైతన్యవంతంగా రూపాంతరింపజేస్తుంటాడు మనిషి. ఆవరణ వ్యవస్థలతో మానవ వ్యవస్థలు తలపడే చోటులోనే అటు ఆవరణ వ్యవస్థకు ఇటు మానవ వ్యవస్థకు చేకూరే చేటు దాగి ఉంటుంది. మానవకార్యకలాపం పేరు ఉత్పత్తి, ఉత్పాదన. ఈ ఉత్పాదనకు ఎంతో కొంత పెట్టుబడి అవసరం. అది ఎంతనేది పెట్టుబడి ఆశించే లాభాన్ని బట్టి ఉంటుంది. గోరటి వెంకన్న కవిత్వమంతా ఆవరించి ఉన్న చైతన్యం ఇదే. పర్యావరణానికి మనిషి తలపెడుతున్న పెను ప్రమాదాలను గురించి గొంతెత్తి పాడాడు. బహుశా గాట్‌ ఒప్పందాల కాలంలోంచే వెంకన్న ఉద్భవించాడు. పెట్టుబడిని ప్రకృతికి ప్రప్రథమ శత్రువుగా భావిస్తాడు వెంకన్న. ఇది అతని అవగాహన అభివృద్ధికి వ్యతిరేకి కాడు. లక్ష్యరహితమైన అభివృద్ధిని ఆధునికతను నిరంతరం పరిశీలనాత్మకంగా చూస్తూనే వ్యాఖ్యానిస్తుంటాడు. 'పల్లె కన్నీరు పెడుతుందో' అని పాటనా 'వాగు ఎండి పోయెరో' అని ఎలుగెత్తినా, భూతాపాలు గురించి మాట్లాడినా, విశ్వరమణీయాల వింత జలచక్రం గురించి గేయం కట్టినా వెంకన్న రెండు విషయాల గురించి మరింత స్పష్టమైన దృక్పథంలోకి పరిణమించాడని ఈ నాలుగు దశాబ్దాల అతని వాగ్గేయం సాక్ష్యమిస్తుంది.
   పర్యావరణ తత్వంలో రెండు భావధారలున్నాయి. ఒకటి ప్రాణికేంద్రకంగా విషయాలను చూడటం, రెండోది ధరణి / ప్రకృతి / పర్యావరణ కేంద్రకంగా ఆలోచించటం, అర్థం చేసుకోవటం. వీటినే బయోసెంట్రిక్‌, ఇకో- సెంట్రిక్‌ పద్ధతులు అని చెప్పుకుంటాం. మనిషి ప్రయోజనాల కోసం కాకపోతే ఈ సమస్త ప్రకృతి ఎందుకు? ఎవరికోసం ఉన్నట్టు అనే ప్రశ్నతో మొదలై మానవ కేంద్రకంగానే ప్రతిదానినీ చూడటం, ఆలోచించటం జరుగుతుంది. ప్రకృతిపట్ల గౌరవం, విధేయత లాంటివి ఈ వైఖరిలో పెద్దగా ప్రాధాన్యం లేని విషయాలు. వాగు ఎండిపోయిందని వెంకన్న చేసిన ఆర్తనాదంలో ఆ వాగు మీద ఆధార పడిన సమస్త ఆవరణ వ్యవస్థ అంతర్థానమైపోయిందన్న పరివేదన ఉన్నప్పటికీ మనిషి కేంద్రకంగానే ఆలోచన చట్టం ఉండటం వల్ల ఆ పరిధి దాటి రాలేకపోయాం మనం. కాని 'వల్లంకి తాళం' సంపుటి నాటికి వెంకన్న పర్యావరణ తాత్విక రచనా ధారలో ఎంతో మార్పు కనిపిస్తుంది. శుద్ధ ప్రకృతి వాదం, పర్యావరణ తత్వమంటూ ఏమీ లేదు కాని అట్లా అన్వయం పొందింది. కానీ వెంకన్న తత్వంలో తర్వాత తర్వాత వచ్చిన ప్రధాన మార్పు ఏమంటే ప్రకృతిక ప్రయోజనాత్మక విలువకంటే, ప్రకృతికి దానికదిగానే ఒకా నొక అంతర్నిహిత విలువ (Intrinsic Value) ఉందని గుర్తించటం, మనందరికీ ఈ విలువను గురించి చైతన్య, అవగాహనలను ఇవ్వటం ప్రధానమై పోయింది. అందువల్లనే 'వల్లంకి తాళం' లోని గేయాలు గుణాత్మకమైన మార్పును ప్రదర్శిస్తాయి. సామాజిక భావ తీవ్రుతను దాటిన సాంద్రత ఒకటి ఈ గేయాలలో కనిపిస్తుంది.
   'ఆదివాసుల మట్టి అడవి సిరుల ఉట్టి' అనడంలో ఆ సిరుల ఉట్టి మీద హక్కులు 'పెట్టుబడికి' కాకుండా ఆదివాసులకు చెందినవనే ఆకాంక్ష ఉంది. ఆ హక్కులు కూడా చాలా సహజంగా సంక్రమించిననే తప్ప ఆధిపత్య హక్కులు కావు. ఇందులోనే అంటాడు 'చెంచులా నవ్వులే చెట్లకు పువ్వులు' అని ఆ అడవి మీద హక్కులు ఆదివాసులతో పాటు ఇంకెవరికి ఉందో సూచిస్తాడు.
   ''ఇరికి పరికి కలమి జిట్టీత నక్కేరి
   బలుసు తునికి మేడి ఉసిరి సిమిటె జీడి
   నగరునలుపు తీపి ఫలము లెన్నోమేసి
   మెరుపుల మేనితో మెసలె జీవరాశి'' అంటాడు. ప్రకృతిలో అంతర్భాగంగా జీవించాల్సిన మనిషి అధిపతి కావటమనే భావనను గోరటి అంగీకరించడు.
   కష్ణశాస్త్రి ''తలిరాకు జొంపముల / సందుల / త్రోవలి నేలవ్రాలు తుహన కిరణ కోమల రేఖలను''. గోరటి చూపించాడు. ''కొబ్బరాకులల్లో వెన్నెల / సిబ్బి గంజోలె రాలించి వెన్నెల''ను కురిపించాడు. వెన్నెల మనమందరమూ ఆస్వాదిస్తాం. ఆనందిస్తాం. గోరటి హృద్యతమే ముచ్చట పడతాం. కానీ, వెన్నెల ఏయే ప్రాణికి ఏమిటో ఇలా చెప్పుతాడు.
   ''అంజనపు పిట్టకు పంజరము వెన్నెల
   పంది కొక్కుకాళ్ళ పగ్గము వెన్నెల
   మాటేసి మెకములకు పీటముడి వెన్నెల
   కాటేసే విషకొండ కంట నలుసెన్నెల
   శిగమూగె సీకటిని వెన్నెల
   తరమె పొగలేని సాంబ్రాణ వెన్నెల''
   మానవ పరంగా నిర్వచించబడిన ప్రతిదీ పర్యావరణ దృక్పథంలో ప్రాసంగికత లేనిదవుతుంది.
   'అవనిపై మాన్యుల అంశల వెన్నెల' అన్న వెంకన్న అపూర్వ కవితా తత్వాన్ని ఆధునిక తెలుగు కవిత్వానికి అందించాడు. ఆ పర్యావరణ వేత్తకు అకాడమి అవార్డు ప్రకృతి ఇచ్చిన కానుక, ప్రకృతి హితంగా మితంగా ఉండమని గోరటి ఉద్బోధ.
- సీతారాం, 9866563519

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు
అనుభవం ముఖ్యం కనుక...
దుఃఖనదిలో అశ్రుపడవ
విలాపం నుండి విలాసంలోకి ... 'కాల ప్రభంజనం'
చెమట చుక్కల వాసన వెలుగుపూలు
సూఫీ తత్వాన్ని వింగడించుకున్న కథలు
హార్పర్‌ లీ రాసిన నవల ''టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌''..!
ముద్దాయి
యదార్థం
రచనలకు ఆహ్వానం
భర్తీ
'తుఫాను'
తల పువ్వులు
పూలకుండి
గజల్‌ అవతరణ - అనుకూలావరణ
''కవిత్వ మినార్‌ హమారా షాయర్‌ ఆశారాజు''
మంచ్చిల్లొచ్చినై
మాటలు మాట్లాడుతున్నాయి

తాజా వార్తలు

10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

07:37 PM

మంకీపాక్స్ నేపథ్యంలో ముంబైలో అలర్ట్..!

07:24 PM

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

07:19 PM

జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

07:12 PM

మహిళల టీ20 ఛాలెంజ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్

06:52 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

06:40 PM

నాని 'అంటే .. సుందరానికీ`నుంచి పాట విడుదల..

06:33 PM

విమానంలోకి పొగమంచు.. భయాందోళనకు గురైన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు

06:17 PM

కర్నాటక మాజీ సీఎంకు సమన్లు

06:13 PM

భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర : ప్రధాని మోడీ

05:51 PM

ఓయో రూంలో విషం తాగిన యువకుడు

05:41 PM

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

05:30 PM

నిజామాబాద్‌లో విక‌సించిన‌ ప్రకృతి వింత 'మే`పుష్పం

05:21 PM

ఆ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి : పవన్ కల్యాణ్

05:15 PM

మచిలీపట్నం బీచ్‌లో ఇద్ద‌రు విద్యా‌ర్థినీలు మృతి

04:57 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.