Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గజల్‌ అవతరణ - అనుకూలావరణ | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Apr 18,2022

గజల్‌ అవతరణ - అనుకూలావరణ

              అరబ్బులది కనుచూపుమేర ఎడారితో నిండిన అరేబియా దేశం. ఎడారిలో నీటి లభ్యత తక్కువ అక్కడక్కడా ఒయాసిస్సులు (నీటి కుంటలు) తప్ప జలాశయాలు కనిపించవు. వర్షపాతం అత్యంత స్వల్పం. పచ్చదనానికి కరువు. ఎక్కడో ఒయాసిస్సులున్న చోట ఏపుగా ఎదిగే ఖర్జూర చెట్లు, ముండ్ల పొదలు తప్ప ఆకుపచ్చని తోటలంటే అరేబియన్లకు స్వప్న సదశ్యమే! పెంపుడు జంతువులు ఎడారి ఓడలనబడే ఒంటెలు, దూర ప్రాంతాలకు మోసుకుపోయే గుర్రాలు. వ్యాపారం వారి ప్రధాన వత్తి.
              వ్యాపారం చేయడం కోసం ఎడారిని దాటుకొని స్వదేశాన్ని విడిచి సుదీర్ఘకాలం ప్రయాణం చేసి, సరిహద్దు దేశాలకు చేరుకోవాలి. ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి గుడారాలు వేసుకోవాలి. ఇసుక తుఫానులను తట్టుకొని వాటి నుంచి తెలివిగా బయట పడాలి. ప్రయాణ మార్గంలో నీరు లభించకపోతే, సముద్రపు ఉప్పు నీటితో దాహం తీర్చుకోవాలి. లేదంటే ఒంటెల్ని చంపి వాటి కడుపులోని నీటిని సేవించాలి. ఆహారానికి కొరత ఏర్పడితే, గుర్రాలనో, ఒంటెలనో కోసి వాటి మాంసంతో ఆకలి తీర్చుకోవాలి. తరచుగా ఖర్జూర ఫలాలు తినాలి. ఇలా అరబ్బుల జీవన విధానమంతా నిత్య సంఘర్షణలతో కూడి ఉంటుంది. ప్రయాణాలలోనే వారి జీవితం అధికభాగం ఖర్చై పోతుంది. ఇల్లు విడిచి వ్యాపారానికి బయలుదేరితే తిరిగి ఎప్పుడు ఎలా చేరుకునేది చెప్పేది కష్టం. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కుటుంబానికి దూరం కావలసి వుంటుంది. ప్రియమైన వారికి, ఇల్లాలికి దూరమై వారి జ్ఞాపకాలతో, తలపులతో మనుసును సమాధాన పరచుకుంటూ నిరీక్షణతో కాలాన్ని వెళ్ళదీయాలి.
వారి ప్రయాణాలలో మనస్సును ఆహ్లాదపరిచే, సెలయేళ్ళు, పూల తోటలు కనిపించవు. జీవ వైవిధ్యంతో కళకళలాడే అడవులు ఎదురుకావు. ఆకాశంలో నీలి మబ్బులు సయ్యాట లాడుతూ నెత్తిమీద చల్లదనాన్ని నాలుగు చినుకులుగానైనా చిలకరించవు. ఎటుచూసినా దరి కానరాని ఎడారిలో కాళ్ళ కింద ఇసుక, నెత్తిమీద శూన్యాకాశం. హదయంనిండా ప్రియురాలి తలపుతో పెల్లుబికే పరివేదన, విరహం, విస్మయాది వికారాలు. అయినా వీటన్నింటినీ తట్టుకుంటూ, సముద్ర గాంభీర్యాన్ని ప్రదర్శించే సహనం అరబ్బుల సొంతం.
ఎడారిలో ఇసుక రేణువుల్ని, ఆకాశంలో మిణుగురు చుక్కల వెలుగుల్ని లెక్కిస్తారు. గ్రహగతుల్ని గమనిస్తారు. అందుకే అరబ్బులు జ్యోతిశ్శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సాధించారు. ఉష్ణ ప్రాంతాలలో జీవిస్తారు గనుక ఉద్రేకమూ ఎక్కువే.
              ఒంటెలపై ప్రయాణం చేస్తూ ఊహల రెక్కలు తొడుక్కుంటారు. ఉప్పొంగే భావ సముద్రాలను పదాలకు పట్టిస్తారు. కొద్దిపాటి భాషా సంపత్తితోనే కవితలు అల్లుకుంటారు. ప్రేయసితో జరిపిన సరస సల్లాపాలను జ్ఞాపకం చేసుకుంటారు. మనోహరి మోమును, కండ్లను, పెదవులను, చిరు నగవును, శిరోజాలను మనసుకు తోచిన విధంగా వివిధ వస్తువులతోనో, అందమైన పూవులతోనో, రకరకాల జీవులతోనో పోలిక చేసి అనుభూతుల వర్షంలో తడిసి పోతుంటారు. అనురాగాన్ని, అప్యాయతల్ని మననం చేసుకుంటూ అప్రాప్య అయిన మనోహరి కోసం జీవితమంతా వేచి ఉంటామని ప్రకటించుకుంటారు.
వర్తక వ్యాపారాల కోసం ప్రయాణంలోనే అధిక సమయం గడిపే అరబ్బులకు విశ్రాంతి సమయంలో ప్రణయ విరహాది విషయాలను కవిత్వం చేయడానికి చాలినంత అవకాశం దొరుకుతుంది. ఇలా కొందరు ఇష్టసఖుల పట్ల ప్రేమ, శంగారం, విరహం మొదలైన విషయాలను వర్ణిస్తే, మరికొందరు భగవంతుని పట్ల భక్తితో, అనురక్తితో కవితలు రాస్తారు. మధువును, మగువను వాంఛిస్తూ లౌకికంగా ప్రారంభమైన ప్రేమ భావాలను పారలౌకికంగా పరిణమింపజేస్తారు.
వియోగ దుఃఖాల వలన నాయికపై ప్రేమను భూమికగా చేసుకుని శంగారాన్ని పలికించడాన్ని ''మజాజ్‌'' అని, భగవద్భక్తిని, పారలౌకిక ప్రేమను పలికించడాన్ని ''హకీకి'' అని అంటారు.
              ''అరబ్బీ, ఫారసీ, ఉర్దూ కవితా సంప్రదాయాలలో విప్రలంబ శంగారానికే ప్రాధాన్యము గలదు. ఈ శంగారానికి పునాదియైన ప్రేమ హకీకి యని, ''మజాజి''యని రెండు తరగతులకు చెందినదిగా పరిగణించబడినది. ''మజాజి' అనగా సాధారణమగు లౌకికమగు నాయికా నాయకుల ప్రేమ 'హకీకీ'' అనగా భగవద్భక్తితో కూడిన పారలౌకిక ప్రేమ' విప్రలంబ శంగారము ఈ రెంటికిని సామాన్యమైన రసము.'' (గాలిబ్‌ గీతాలు, పీఠిక-డా.బూర్గుల రామకష్ణారావు)
              ఇలా నాయికలను వర్ణించడానికి ఆనాడు వారికి ప్రచలితమైయున్న ప్రక్రియ ''ఖసీదా''. ఈ ''ఖసీదా'' అతిశయోక్తి అలంకార ప్రధానంగా స్తుతులతో, పొగడ్తలతో నిండి ఉంటుంది. అలా ఖసీదా అరబ్బీలో ప్రప్రథమ ప్రక్రియగా గుర్తింపు పొందింది. ఈ ప్రక్రియ ఆ తరువాత కాలంలో ప్రాచుర్యాన్ని సంపాదించింది. అనేక మంది కవులు, రాజస్థానాలలో ఆశ్రయం పొందడానికి, బహుమానాలను (ఈనామ్‌) అందుకోవడానికి ఈ ఖసీదాలనే ఉపయోగించేవారు.
              క్రీ.శ. 8వ శతాబ్దం వరకూ ఖసీదా కేవలం సుత్తి పాఠాలతో పొగడ్తలతో నిస్సారమై ఉండేది. కవులు ప్రవక్తను, అల్లాను స్తుతించుట కోసమే గాక, పాలకులైన ఖలీఫాలు, అమీర్ల మెప్పులు పొందడానికి ఖసీదాలను పుంఖాను పుంఖాలుగా రచించేవారు.
              ఈ కాలంలో అరబ్బు దేశంలో ఇస్లాం మత సిద్ధాంతాలతో పాటు ఉన్నత, సామాన్య వర్గాలలో స్వేచ్ఛా, విలాసాలు, ప్రాబల్యం వహించాయి. భోగలాలస ఎక్కువైంది. క్రీ.శ. 7వ శతాబ్దం వరకు మతవ్యాప్తి కోసం యుద్ధాలతోను, అంతకుముందు వర్తక, వ్యాపారాల కోసం సంవత్సరాల తరబడి అనివార్యంగా నిరీక్షించవలసి వచ్చిన విరహంతోను విసిగిపోయిన వారికి సస్యశ్యామలమైన పర్షియాను హస్తగతం చేసుకున్నాక సెలయేళ్ళు, పూలవనాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం, స్వేచ్ఛా ప్రియత్వానికి, భోగలాలసకు దారితీశాయి. వారి ఆలోచనలు, కవిత్వం పైన కూడా ప్రతిఫలించింది.
ఖలీఫాల కాలంలో అరబ్బీ కవిత్వ రచనలో శంగార రస ప్రధానములైన ''బుదానియా - జమీత్‌-బ-మమార్‌, లుబనా-కైస్‌-బ-జరీహౌ'', లైలామజ్నూ మొదలైన ప్రేమకావ్యాలు వచ్చాయి. పర్షియన్ల సంపర్కంతో అరబ్బీ కావ్యం లలిత భావాలకు, మధురోక్తులకు అలవాలమయింది.
ఇటువంటి లౌకిక కావ్య రచనలు చేసిన రచయితలలో 'ఉమర్‌-బ-అరేబియా'కు విలక్షణ స్థానం ఉంది. కుర్రేష్‌ తెగకు చెందిన ఈ కవి రచనలు ఒక సంకలన గ్రంథంగా వెలువడ్డాయి. ఈ రచనల్లో ఖసీదాలు కాక 'గజల్‌' అనబడే గేయాలు వాడబడ్డాయి. లభించిన ఆధారాలను బట్టి అరబీ భాషలో తొలి గజల్‌ రచయితగా 'ఉమర్‌-బ-అరేబియా'ను చెప్పుకోవచ్చు. ఇదే కాలంలో ఖలీఫాలకు సామంతులుగా పర్షియాను పాలించిన సామానీ రాజుల కాలంలో ''రూదగీ'' (రూద్కీ) అనే మహాకవి కూడా ''గజళ్ళు'' రాసినట్లు తెలుస్తున్నది.
              ''గజల్‌ ఆ కాలమునకింకా సర్వ లక్షణ సహితమై పరిపూర్ణ స్వరూపమును బొందియుండలేదు. గజల్లో కూడ 'రూద్కీ శ్రేష్టుడని తరువాత ప్రసిద్ధుడైన గజల్‌ కవియగు 'అన్‌ సురీ' కొనియాడెను. రుదగీ మహాకవి సామానీ వంశరాజైన నసర్‌ బిన్‌ అహమద్‌ సామానీ యొక్క దర్బారులో పోషించబడ్డాడు. ఈ ''కవే, ఫారసీ భాషకు నన్నయ భట్టారకుడు'' అని బూర్గుల రామకష్ణారావు గారు అభివర్ణించారు.
              దీనిని బట్టి అరబ్బీలోను, ఫారసీలోను ''ఖసీదా'' స్వల్ప మార్పులతో ''గజల్‌'' ప్రక్రియగా ఒకే వాతావరణంలో... రూపొందించబడిందని తెలుస్తున్నది.
              'నసర్‌ బిన్‌ అహ్మద్‌ సామానీ కాలం క్రీ.శ. 10వ శతాబ్దము. ఈ రాజు ఆస్థానంలోని వాడు ''రూదగీ'', ఈ మహాకవి గజళ్ళు రాసినట్టు ''అన్‌ సురీ'' అనే తరువాత తరం కవి కొనియాడుట వలన గజల్‌ క్రీ.శ. 10వ శతాబ్దంలో ప్రారంభమైందని ప్రామాణికంగా ఋజువగుతున్నది.
ఈ పై ఆధారాలను బట్టి గజల్‌ ప్రక్రియ అరబ్బీ భాషలోని ఖసీదా నుండి ఫారసీ, అరబ్బీ భాషల్లో పర్షియా భూభాగం నుండి క్రీ.శ. 10వ శతాబ్దిలో ప్రారంభమైనదని నిర్ధారించవచ్చు.
ఖసీదా నిర్మాణం - గజల్‌ ఆవిర్భావం :
              ''అరబ్బీ భాషలో 'ఖసీదా' అనేది ఒక కవితా ప్రక్రియ. ఈ ఖసీదా ఐదు భాగాలుగా నిర్మితమై ఉంటుంది. దానిలో మొదటి భాగాన్ని ''తష్బీబ్‌'' అంటారు. రెండవ భాగము దువా, మూడవ భాగము స్తోత్రపాఠం, నాలుగో భాగం అర్జీ (వినతి) చేసుకోవడం, ఐదోభాగం శుభాన్ని కోరుతూ భగవంతుని ప్రార్ధన చేయడం.
              ఖసీదాలో మొదటి భాగమైన ''తష్బీబ్‌''లో వస్తువును మార్చడం వలన, బహారియా లేదా గజల్‌ గా మారుతుంది. తష్బీబ్‌లో వస్తువు 'వసంతం' అయితే అది 'బహారియా' ప్రేయని అయితే గజల్‌ అవుతుంది. ఇలా ఖసీదా నుండి తష్బీబ్‌ను వేరుచేసి దానిలో ప్రేయసిని వస్తువుగా గ్రహించి రాస్తే అది గజల్‌గా ఏర్పడింది.
              గజల్‌ ఇలా అసమగ్రమైన రూపంతో మొదలై దాదాపు మూడు దశాబ్దాల పాటు అరబ్బీ, ఫారసీ భాషల్లో కాలానుగతంగా పరిణామం చెందింది. క్రీ.శ. 10వ శతాబ్దం నుండి క్రీ.శ. 13వ శతాబ్ధం ప్రారంభం వరకు రూదగీ, దకీకీ, ఉమర్‌ ఖయ్యాం, నిజామీ గంజవీ, ఖ్వాజా ఫరీదుద్దీన్‌ అత్తార్‌, మౌలానా రూమీ, ఇస్మాయిల్‌ వంటి కవులు గజళ్ళు రాసినట్లు తెలుస్తున్నది. అయితే వీరు రాసిన గజళ్ళు కేవలం అలంకార ప్రయుక్తమైన వచన రూపానికి సంబంధించినవి. ఆ తరువాత క్రీ.శ. 13వ శతాబ్దంలో 'ఇస్మాయిల్‌' అనే కవి గజల్‌ కు ఒక నిర్మాణ సౌష్టవాన్ని కల్పించి గజల్‌ స్వరూపాన్ని నిర్ధారించాడు. అంటే నియమబద్ధమైన ఛందో నిర్ణయం చేశాడు.
              ''గజల్‌ కవితకు ఫక్కిని ఏర్పరచిననాడు మొదట ''కమాల్‌'' తర్వాత 'షేకు షాదీ' దానిని పూర్తిగావించి గజల్‌ పితామహుడని పేరుగాంచెను. హఫీజ్‌ మున్నగువారు దానికి మరింత వన్నెతెచ్చిరి. (ఫారసీక వాజ్ఞ్మయ చరిత్ర-డా.బూర్గుల రామకష్ణారావు)'' దీనిని బట్టి క్రీ.శ. 13వ శతాబ్దంలో గజల్‌ సమగ్రమైన స్వరూపంతో పార్సీలో రాయబడిందని చెప్పవచ్చు.

- పోతగాని సత్యనారాయణ
   తెలుగు పరిశోధక విద్యార్థి,
   కాకతీయ విశ్వవిద్యాలయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ కాతోజు
అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కె.సజయకు అభినందనలు
గొలుసు పంక్తుల అనువాదంలోని ఇబ్బందులు
స్వేచ్ఛ - ఫాసిజం - కాల్పనిక సాహిత్యం
సమాజాన్ని 'పంచనామా' చేసిన కవిత్వం
తొలకరి
మెరుపు గింజలు
ఖరీదైన సమయం
నేనేమీ పాపం చేశానురా..
సాహితీ వార్తలు
ఉద్యమ కంఠస్వరం - కపిల రాం కుమార్‌ కవిత్వం!
కులదురహంకార హత్యలపై ఒక ఆలోచనాత్మక నవల మధులతా
శిలావీ పె(క)న్ను మూత
కరకరలాడే గడుసుకథల మిక్చర్‌ పొట్లం
హెన్రీ డేవిడ్‌ థోరో అరణ్య కుటీరం ''వాల్డెన్‌''
'రావణ మరణం తర్వాత' ఓ గందరగోళం
శేషేంద్ర భావాంతరంగం
సాహిత్య విమర్శ - ఒక పరిశీలన
గౌతమీ తీర జీవన అనుభవం
మాదిగ ఖాకీ మార్పుకు మూలమలుపు
సమాజాన్ని ఎక్స్‌రే తీసిన కథలు
పైసలతో సోపతి
సలపరింతల గాయాల పలవరింతే ''పరావలయం''
కొత్త కవులకు దివిటీ దిక్సూచి
అన్నపురెడ్డి పల్లి అవార్డ్స్‌ - 2022
తెలుగు బాలగేయ సంకలనాల ప్రచురణ
ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌ ప్రతిభా పురస్కారాలు
సూర్య హోళీ
అమృతం
ఇది రాజకీయ కవిత కాదు

తాజా వార్తలు

08:15 PM

5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

07:59 PM

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.