Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రెండు వేళ్లతో చెక్కిన అడ్లూరి అపురూప శిల్పం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

రెండు వేళ్లతో చెక్కిన అడ్లూరి అపురూప శిల్పం

             జీవితానుభవంలోంచి పుట్టేది కవిత్వం. అది స్వయంగా అనుభవించి రాయవచ్చు, అనుభూతి చెంది వ్యక్తపరచవచ్చు. ''అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః...'' అంటాడు ప్రాచీన అలంకారికుడు ఆనంద వర్ధనుడు ఈ విశాలమైన కావ్య ప్రపంచంలో కవి ఒక్కడే ప్రజాపతి. అతను ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. కవి రస దృష్టి కలిగిన వాడైతే లోకమంతా రసమయంగా ఉంటుంది రస దృష్టి లేని వాడైతే కావ్య జగత్‌ రసశూన్యమవుతుంది. కాబట్టి కవి దృష్టిని బట్టి కావ్యంలో వస్తువు, కవిత్వంలో పద బంధాలు, పద చిత్రాలు, భావ చిత్రాలు ఉంటాయి. అంతే కాదు కవి బాల్యం, చుట్టూ వాతావరణం, పెరిగిన విధానం, ప్రాంతం, కాలం, భాషా, సంస్కృతీ... అతని జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కవి తుల శ్రీనివాస్‌ కవిత్వంలో కూడా స్థానికత, సమకాలీనత మనకు ప్రస్పుటమవుతుంది. అనుభవంతోను, అనుభూతి చెందిన భావాలతోను తనదైన దృష్టి కోణాన్ని, చుట్టూ ఉండే బహుజన సామాజిక నేపథ్యాన్ని అధ్భుతంగా, ఆర్తిగా ఆవిష్కరించారు. అతని కవిత్వంలో ప్రతి పదం, ప్రతి వాక్యం తెలంగాణ భాష, యాస, నుడికారాలతో,సామేతలతో మరియు నల్గొండ లోని అడ్లూరి మట్టి వాసనతో పరిమళింస్తాయి.
               తన్మయత్వం చెంది నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు సరికొత్తగా రాసే అక్షర కుసుమాలు తడి మనసులను మెత్తగా హత్తుకుంటాయి. కాలం రెక్కల మీద స్థిరంగా లిఖించబడుతాయి. వీరి కవితాక్షరాలు కూడా అంతే మనసుకు మెత్తగా హత్తుకుంటాయి. కొత్త కొత్త అభివ్యక్తులు గుండెలో ముద్రించుకుంటాయి. అనుబంధాలను,ప్రేమలను, ఆప్యాయతలను, ఆర్తిగా నింపుకున్న కవిత వాక్యాలు ఎప్పటికీ చిరస్మరణీయం. పల్లె వాసన వేస్తున్న ఈ ''చింతల తొవ్వ'' లోని కవితా వాక్యాలు అన్నీ అమ్మానాన్న, అన్న, అక్క, సిన్నాన్న, సిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్త మామ, తాత నాయనమ్మ అనే బంధాలతో పురి పెట్టి ప్రేమగా అల్లుకున్నవి తప్ప... కులం మతమనే గౌరవ సూచికలు లేనివి. ప్రతి వృత్తి చిత్రానికి ప్రాణం పోస్తూ ప్రేమానురాగాల కుంచె పట్టి గీసినవి. కల్మషం లేని అపురూపమైన పద సంపద వాక్యాలు ఇవి చిరస్మరణీయాలే.
''ఈ నేల మీద నా తాతల పాదముద్రలున్నవి/ ఈ గాలినిండా వారి ఊపిరి జాడలున్నవి/ అక్కడ ప్రతి అమ్మది పచ్చి పాలకుండే/ ప్రతి అయ్య హృది తెల్ల మల్లెపూల చెండే/ ఏగోడలూ ఆ ఇళ్ళను విడదీయలేవు/ ఏ రేఖలూ మనసుల్ని విభజింపలేవు/ అంటూ ఊరి గాలిని గుండెల నిండుగా పీల్చుకుని పల్లె ప్రాణాన్ని ఆవిష్కరిస్తూ.../ ఉత్సవమొస్తే ఉషిల్ల పుట్టయ్యే ఆ మట్టి/ కష్టమొస్తే ఒక్కగుండెలా పొంగిపారేది/ అక్కడ గాలి స్వేదగంధం పూసుకుంటే/ నీరు జాన పద పాడుతుంది/ అది అచ్చంగా నా ఊరే'' అని పుట్టిన ఊరును, మమకారాన్ని అపురూపంగా అక్షరీకరించాడు. నిజంగా పల్లెల్లో ఉత్సవమొస్తే ఊరు ఊరంతా గుమిగూడి ఆనందంతో ఆడి పాడుతారు కష్టమొస్తే కలిసి కన్నీళ్లను పంచుకుంటారు. అక్కడ గాలి స్వేదగంధం పూసుకుంటే నీరు జానపదం పాడుతుంది అంటూ అభివ్యక్తీకరించిన విధానం అందంగా ఉంది.
ఊరంటే ముందుగా యాదికొచ్చేది అమ్మే ఆ తర్వాతే అన్ని గుర్తుకు వస్తాయి. అమ్మ ప్రేమను మించింది మరొకటి లేదు అలాంటి అమ్మ ప్రేమను కవి అనురాగపు జల్లు అనే కవితలో తల్లి పిచ్చి ప్రేమను అమాయకత్వాన్ని ఎంతో చక్కగా కవితీకరించాడు.
''అగ్గిగోళమైన అమ్మ గుండె/ చల్లార్చుకోవాడానికి ఎన్ని కన్నీళ్లు ఎగజల్లేదో!/ ఎవరినీ ఏమనలేని నిస్సహాయతలో/ ఎందరు దేవుళ్ళ కడుపున మన్నుబోసేదో/ ఎన్ని గుళ్ళ గలుమలకు కంప గొట్టేదో!/ ఏ మజ్జెరాత్రో నిద్రలో ఉలికిపడితే/ అంతలోనే అందరి దేవుళ్ళనూ తలుసుకునే/ మాయమ్మ, తలుపు గూట్లే ఆటానాదెచ్చి మీదంగ దిప్పి ముడుపు గట్టేది'' నిజంగా తల్లి పిచ్చి ప్రేమ కాకపోతే.. అప్పటిదాక దేవుళ్ళను తిట్టి మళ్లీ నా కొడుకుకు మంచిగావాలని దేవుళ్ళకి ముడుపు గడుతది. అలాంటి అమాయకపు, సహజంగా కనిపించే అమ్మ ప్రేమను నిజంగా అక్షరీకరించిన తీరు చాలా బాగుంది.
నాగరికత మొదలైందే చక్రంతో అలాంటి చక్రంతో జీవిత చక్రాన్ని తిప్పుకునే కుమ్మరి వృత్తి గురించి వారి సాధకబాధకాల సారె గురించి రెండు వేల్లతో తుల శ్రీనివాస్‌ చెక్కిన మట్టి శిల్పం కవిత ఆయన సంస్కారానికి అద్భుతమైన ఆకృతి.
''ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఆధునిక సాంకేతికత/ నీ కుటుంబాన్ని విచ్చిన్నం చేసి/మావి కుండ నుండీ అంతిమ కుండదాకా / నీ బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచి/నీ వారసత్వానికి ఖరీదైన రంగు పులిమి/ అద్దాల గుహలో దర్పంగా నిలబెట్టింది''.
ఇక్కడ కుండకు మనిషికి ఉన్న అవినాభావ సంబంధం, దాని ప్రాధాన్యతని చెప్పిన వైనం హర్షించదగ్గ వ్యక్తీకరణ. ప్రపంచీకరణ తర్వాత కుండ, వృత్తి కనుమరుగైన తీరును వారి జీవితాలను చిన్నా భిన్నం చేసిన ఆధునికతను ఆవేదనతో చిత్రించాడు కవి, అంతే కాదు ఇందులో ఎత్తుగడ, శిల్ప, పద చిత్రాలు, భావ చిత్రాలు, ముగింపు గొప్పగా ఉన్నాయి.
మనిషి కుండ ఎప్పుడు పగిలిపోతుందో తేలియదు కానీ శాశ్వతంగా ఉంటుందనుకుని లేని పోని ఆశలు పెంచుకుని అహం ప్రదర్శించే వాడిని
''ఎందుకు నీకీ మిడిసిపాటు! / గట్టిగా రాస్తే నీ చరిత్ర సమస్తం ఒక్కటంటే ఒక్క వాక్యం కాదు!! / నీ ఉనికి ఊరపిచ్చుకంత/ ఊపిరి ఉఫ్మంటే రాలి పోయేంత'' అని గుప్పెడంత జీవితం కవితలో మనిషికి చురకలు అంటిస్తూ...
''ఋతువులు సృష్టించగలవా/ సముద్రాలు తవ్వగలవా/ గాలిని ఆపగలవా / పర్వతాలు నిర్మించగలవా/ కులమతాల పాకుడురాళ్లపై ఇంకెంత కాలం జారుతావు/ అసమానతల హద్దురాళ్లు ఇంకెన్నాళ్ళు పాతుకుంటావు'' అంటూ మనిషి పోకడలను ఎండగట్టే ప్రయత్నం చేశాడు. సృష్టి ధర్మాన్ని, మానవిలువలను కాపాడడం మన గురుతర బాధ్యత, అవి నిర్వహిస్తూ ఎరుకతో జీవిస్తే మట్టిలో కలిసినా కూడా మంచి మనిషిగా మిగిలిపోతావని హెచ్చరిక చేశాడు.
రుడుం అనే కవితలో తెలంగాణ జీవన చిత్ర క్రమాన్ని కళ్ళకు కట్టినట్లు రాశాడు కవి. ఇది చదువుతుంటే కథ చదివినట్లే అనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైన అంశాన్ని క్రమానుగతాన్ని కవిత్వీకరించడం అంటే అది కవి ప్రతిభ మాత్రమే.
''మా రెక్కలు గంధంశెక్కల్లెక అరగదీశిండ్రు/ మీ నాయంల మన్నువొయ్య/ మా మనవలు మల్లా మీ కార్లు తుడవడానికి పట్నం వస్తుండ్రు/ ఇంకెన్ని తరాలు మీకు బాకీ ఉన్నామో/మీరెంత గొప్ప బతుకు బతికినా మా జాతి రుడాన పడే సస్తరులే...'' అంటూ నిజంగా సామాజిక జీవన చిత్రనను ఉన్నతంగా ఉన్నతీకరించారు.
ఇక పూలులేని చెట్టు కవితలో నాన్న వెల్లిపోయాక అమ్మ స్థితిని చూసి రాసిన ఆవేదనాక్షరాల గురించి ఎంతైనా వర్ణించవచ్చు
''తన జడలో పూలు గుంజుకుని/ నాన్న తన మెడలో వేసుకున్నందుకు కాబోలు/ అమ్మ ఇంతలా చిన్నబోయింది.'' అంటాడు ఎంతో గాఢమైన భావ చిత్రం ఇది, అంతే కాదు ''తాను తింటున్నప్పుడల్లా/ బోర్లించిన ఒక కంచం అమ్మకిప్పుడు మెల్లెకన్ను'' అంటూ అభివ్యక్తీకరించిన తీరు మనుసును కదిలిస్తుంది.
అలాగే అంతిమ యాత్ర కవిత కన్నీళ్లు పెట్టిస్తది ఆ చివరి క్షణాల దృశ్యం, అతను పడిన మానసిక సంఘర్షణ, ఏం చేయలేని నిస్సహాయత, నాన్న నిజం దేవుడేమాత్రమూ నిజం కాదనిపంచే ఆ క్షణం ''ప్రాణాలన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటూ/ అంతిమ పయనానికి సిద్దమవుతున్న నాన్న..'' అని వెక్కివెక్కి ఏడుస్తూ వెళ్లిపోతున్న నాన్నకు అంజలి ఘటించిన కవిత నిజంగా కంటతడి పెట్టిస్తుంది.
తుల శ్రీనివాస్‌ కవిత్వంలో ఆర్తి ఎక్కువగానే కనిపిస్తుంది ''ఏకోరసః కరుణ ఏవ'' అన్నట్లు ఎన్ని రూపాలు మారిన నీరు ఒక్కటే అన్నట్లు అతని కవితలు ఎన్ని తీసుకున్న ప్రతిదీ ఆర్తితో నిండినదే.
ఇకపోతే కవి శ్రీనివాస్‌ ఏదైనా రాయగలడు, ఎంతైనా రాయగలడు. సైకిల్‌, పిన్నీసు వస్తువు ఏదైనా ఆర్తిగా లోతైన భావాలతో గాఢమైన ముద్రలను వేస్తూ మనుషుల్ని కదిలిచగలడు, కంటతడి పెంటించగలడు. చైత్యం పరుచగలడు. అందంగా పూల దండ కట్టినట్లు కవిత్వాన్ని కట్టి మానవ విలువల హారాన్ని సమాజం మేడన అలకరించగల గొప్ప కవిత్వ బంధువు. ఋణబంధం, యాసంగి నాట్లు, నాయినమ్మా ఒక్కసారొచ్చిపోవే, చిన్నాన్న, ఓ స్నేహితుడి కథ, అలా తాటివనంలో, కళ తప్పిన కల్లు ముంత అనే కవితలు పాఠకులను ఆసక్తిగా చదివిస్తాయి. అంతే కాదు ఇందులో ఉండే 45 కవితలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొదటిదే అయినా ఎప్పటికీ తడారని సిరాక్షర కవన సంపుటి ఇది. తుల శ్రీనివాస్‌ సాహితీ వనంలో సౌగంధికా పుష్పమై పరిమళించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

- శ్రీతరం, 7893613015

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ'
హేతువాద ఉద్యమాద్రి రావిపూడి
ఎర్రజెండా
నేడు 'ఎదురీత' ఆవిష్కరణ
రేపు పెళ్ళిపాటలు పుస్తకావిష్కరణ
కవి జయరాజు, కె శ్రీనివాస్‌లకు మఖ్దూమ్‌ జాతీయపురస్కారం
కె రామచంద్రమూర్తి, కుప్పిలి పద్మలకు అరుణ్‌సాగర్‌ పురస్కారాలు
కొలకలూరి పురస్కారాల గ్రహీతలు
వీరే సఫాయి కార్మికులు
బక్రా
ఎండమావిలో ఈత
నానీలు
'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...

తాజా వార్తలు

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.