Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాయుధంగా పల్లవించిన పాటల పండుగ తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌కు విశేషాదరణ | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

ప్రజాయుధంగా పల్లవించిన పాటల పండుగ తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్‌కు విశేషాదరణ

          మాటకు అందం పాట.. పనికి తోడు పాట.. ఆటకు జోడి పాట ఉద్యమానికి ఊపు పాట.. అన్నిటికీ వెన్ను దన్ను పాట. అసలు పాట లేని దెక్కడ.. పాటై పల్లవించనిదెక్కడ.. పాపాయి ఏడుపులో పాట.. అలల సవ్వడిలో పాట.. చిటపట చినుకుల్లో పాట.. ఆకుల గలగలలో పాట.. ధిక్కార స్వరంలో పాట.. అసలు పాటలేని పోరాటం లేదు.. పాటలేని బతుకు బాట లేదంటే అతిశయోక్తి కాదు... అలాంటి పాటకు ఒక్కసారి జేజేలు పలుకుతూ ప్రజాయుధంగా పల్లవించింది తెలంగాణ సాహితి నిర్వహించిన లిటరరీ ఫెస్ట్‌ 2022. నవంబర్‌ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా సాగిన ఈ పండుగ మూడు రోజులు పాటల కళాకారులకు, సాహితీ వేత్తలకు అభిమానుల గుండెలకు గజ్జె కట్టి పాడించింది. ఆడించింది. మనసులో పులకరిస్తూ.. పాటై పలకరిస్తూ ఒక్కో సెషన్‌లో అతిథులతో అలంకృతమై ఒక్కో ప్రత్యేకతను సంతరించుకొని సాగటం నిజంగానే ఓ జాతర సంబురాన్ని తలపించింది.
          మొదటిరోజు ''పాటకు జేజేలు'' పలుకుతూ తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్థన్‌ జెండాను ఆవిష్కరించి ఫెస్ట్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన ఫెస్ట్‌ మొదటి సెషన్‌ ప్రారంభమయ్యింది. ముందుగా సినీ నటులు కృష్ణకు నివాళి అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆది నుంచి ఉద్యమాలకు పోరాటాలకు ఊపిరిపోసి చైతన్యాన్ని రగిలించింది పాటనేనని తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌ పాట ఆవశ్యకతను వెల్లడించగా.. నిద్ర పుచ్చేది నిద్ర లేపేది మార్గాన్ని చూపేదీ పాటేనని ఇప్పటికీ జానపద పాటలు హృదయాలను హత్తుకుంటాయని సాహితీ ప్రియుల్ని తట్టి లేపే ఈ పాటల మహౌత్సవాన్ని తెలంగాణ సాహితి నిర్వహించటం అభినందనీయమని విడియో సందేశం ద్వారా పద్మభూషన్‌ అవార్డ్‌ గ్రహిత కె.ఐ.వరప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఏ విప్లవానికైనా పోరాటానికైనా దారిచూపేది పట్టాభిషేకం చేసేది పాటేనని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలుపగా పాటకు మించిన శక్తియుతమైన ఆయుధం లేదనీ ఏదేశం ఏ రాష్త్రం లోనైనా సాంస్కృతిక విప్లవం ద్వారానే సమాజ మార్పు జరుగుతుందనీ సినీ నటులు మాదాల రవి ఉద్ఘాటించారు. పాట అనేది ఓ బాట అని అదొక విజయ బావుటా అని సమాజంలోని కుళ్లును ఎత్తిచూపటానికి పాట దోహద పడుతుందనీ మతం కాదు మతతత్వంతోనే తమకు పేచీ అని సినీ సాహితీ విమర్సకులు సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు.
          పాట గజ్జె కడితే మనసు తాండవిస్తదనీ, ఆలోచ నలు నిరంతరం సంఘర్షించుకుంటూ సమాజ ఉన్నతి కోసం రచనలు.. పాటలు సాగాలని తనదైన శైలిలో ఆడి పాడారు ఎమ్మెల్సి గోరటి వెంకన్న. సమాజాన్ని ఆవహిస్తున్న రుగ్మతలపై పాటలు జూలు విప్పాలని రచయిత్రి పీ.ఏ దేవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ఆనందాచారి మాట్లాడుతూ పాటపై చర్చ జరగాలనే ఉద్దేశ్యంపై పాటకు జేజేలు కార్య క్రమం తలపెట్టామనీ, కళలపై మత సాంస్కతిక దాడు లను కళాకారులు గుర్తిస్తున్నారనీ పాట అనేది జోలపాడేదీ నిద్రపుచ్చేది మాత్రమే కాదనీ అది చైతన్యాన్ని రగిలించేది కూడా అని గుర్తు చేశారు. ఆదిపత్య భావజాలంపై ఎగిరే విజయ బావుటా పాట అని అక్షరానికి రూపమిస్తే అది పాటై అమృతాన్ని పంచుతుందని బ్రహ్మంగారి కాల జ్ఞానం నుంచి రగుల్‌ జెండా వరకూ అన్నమాచార్యుని కీర్తనల నుంచి అమర వీరుల దాకా ప్రతీ సందర్భాన్ని సన్నివేశాన్ని పాట అంది పుచ్చుకుందనీ, పుట్టుక నుంచి గిట్టే వరకూ పాట తోడై మనతో నడుస్తుందని వ్యక్తలు పాట ప్రాముఖ్యతకు పట్టం కట్టారు.
          ఇక మధ్యహ్నం సెషన్‌లో ప్రముఖ గాయని విమలక్క, పద్మశ్రీ పురస్కార గ్రహిత కిన్నెర మొగిలయ్య సినీ నటులు ఎల్‌.బి శ్రీరాం చలోక్తులు స్వీయగానం హాస్యాన్ని పండించాయి. గాయకులు పల్లె నర్సింహ, బండి సత్తెన్నలు పాటలు పాడి సభికుల్ని అలరించారు. నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌.సుధాభాస్కర్‌, కవి యాకుబ్‌, గీత రచయిత ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శికట్ట నర్సింహ్మ, తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు రాంపల్లి రమేష్‌, స్ఫూర్తి, తంగిరాల చక్రవర్తి, సలీమ, అనంతోజు మోహనకృష్ణ, కవి పోతగాని సత్య నారాయణలు మొదటి రోజు సెషన్లు విజయవంతంగా జరగటానికి కవి గాయక సమ్మేళనమై ఈ పాటల పూదోటలో విరబూసారు. తెలంగాణ సాహితి నగర కమిటి ఏబూసి నర్సింహ విశాఖ నుంచి వచ్చిన సుభాషిణి పాట పాడి అలరించారు. పురుషోత్తం సతీశ్‌, చంద్రమౌళి, ప్రభాకారాచారి, మేరెడ్డి రేఖ, పేర్ల రాము, స‌య్య‌ద్ ముజాహిద్ అలీ, అజయ్‌ నిర్వహణ సమన్వయం చేశారు. ప్రసిద్ధ గీత రచయిత దేవేంద్ర పాటపై చేసిన ప్రసంగం గాయకులను ఆకట్టుకుంది. గాజోజు నాగభూషణం, సాంబరాజు యాదగిరి పాటలు ఉర్రూతలూగించాయి. మద్దూరి ఐలయ్య, సైదులు సంగీతం అలరించింది.
రెండవరోజు సినిమా పాటల సదస్సు మరింత ఉర్రూతలూగిం చింది. సినీగీత రచయిత డా.తిరు నగరి శరత్‌చంద్ర అధ్యక్షతన సాగిన సభలో ప్రముఖ కవి డా.నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీగీత రచయిత జె.కె.భారవిల ప్రసంగం సదస్సుకు ఊపునిచ్చింది. ప్రముఖ కవి బిక్కి కృష్ణ, దుర్గాచారి తదితరులు సభలో చక్కటి ప్రసంగాలు చేశారు. ఇక నాల్గో సేషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. కవి డా.కటుకోఝ్వల రమేష్‌ అధ్యక్షతన సాగిన సభలో ప్రముఖ సినీగీత రచయిత మౌనశ్రీ మల్లిక్‌ నా మదిలో విరిసిన ఆమనివో నా కన్నుల మెరిసిన పున్నమివో అంటూ తాను రాసిన పాట పాడి సభికుల్ని ఆనంద భరితుల్ని చేశారు. పలు సెషన్స్‌లో ఖాజా మోయినుద్దీన్‌, కార్తీక్‌ రాజు, రచయిత్రి వి.సునంద, ప్రముఖ కవి ఎంవీ రామిరెడ్డి, శరత్‌ సుదర్శి, గంగాధర్‌, సినీగీత రచయిత్రి విశ్వైక పింగళి చైతన్య, కందేపి రాణీప్రసాద్‌, రాములు, ఖాజా మొయినుద్దీన్‌, మద్దిరాల సత్యనారాయణ రెడ్డి తదితరుల పాల్గొన్నారు. 78 మంది పత్ర సమర్పణ చేశారు. 85 మంది సినిగీత రచయితల పరిచయం లో రూపొందించిన ''సినీ గీతావ రణం'' సినిమా పాటల్లో సాహిత్యం - ఓ విశ్లేషణ అద్భుతంగా వెలువడింది.
          ఇక ముగింపు వేడుకగా సాగిన కవి సమ్మేళనం సహజంగానే సాహిత్య హృదయా లను దోచు కుంది. సమ్మేళన సభలో వి.ఆర్‌. తూములూరి ''దేశానికో అశ్రులేఖ'' కవిత సంకలనాన్ని ఆవిష్క రించారు. తంగిరాల చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి అదనపు కలెక్టర్‌ మేడ్చెల్‌ ఏనుగు నర్సింహరెడ్డి స్వయంగా పాట పాడి సభను ఉర్రూతలూగించారు. ప్రముఖ కవయిత్రి అయినపూడి శ్రీలక్షి, భూపతి వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్‌, కపిల రాంకుమర్‌, రామ కృష్ణ చంద్రమౌళి, కొండా రవీందర్‌, రూప్‌కుమార్‌ డబ్బీకార్‌, కాసుల రవి కుమార్‌, వెన్నెల సత్యం, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, తదితరు లతో కవితా గానం సాహిత్య సౌరభాలను వెద జల్లింది. కవులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపో యింది. మూడు రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సాహిత్య మిత్రుల హృదయాల నిండా చైతన్యాన్ని, సాహిత్య సొబగుల్ని నింపుకుని వెళ్లటం ఈ కార్యక్రమం విజయాన్ని తెలుపకనే తెలిపింది.
- డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏకాంత మనో సంభాషణల 'డియర్‌ జిందగీ'
హేతువాద ఉద్యమాద్రి రావిపూడి
ఎర్రజెండా
నేడు 'ఎదురీత' ఆవిష్కరణ
రేపు పెళ్ళిపాటలు పుస్తకావిష్కరణ
కవి జయరాజు, కె శ్రీనివాస్‌లకు మఖ్దూమ్‌ జాతీయపురస్కారం
కె రామచంద్రమూర్తి, కుప్పిలి పద్మలకు అరుణ్‌సాగర్‌ పురస్కారాలు
కొలకలూరి పురస్కారాల గ్రహీతలు
వీరే సఫాయి కార్మికులు
బక్రా
ఎండమావిలో ఈత
నానీలు
'గంగెద్దు' కథలు సిస్మోగ్రాఫిక్‌ కథలు
వైవిధ్య కథల సమాహారం - ఆకాశంలో ఒక నక్షత్రం
మనం మనుష్యులం కాదు
అమ్మా ఆకలైతుందే
అడవి ఆత్మను కోల్పోయాక ..!
నేడు ఆధ్మాత్మిక దారుల్లో చార్‌ధామ్‌ యాత్ర ఆవిష్కరణ
29న నాగలికి నా నమస్కారం ఆవిష్కరణ
జాషువా స్మారక కవితల పోటీ ఫలితాలు
జన రంజక కవి ప్రతిభా పురస్కారాల ఫలితాలు
'మద్దూరి' స్మారక కవితా పురస్కార గ్రహీతలు
నిజాం వేంకటేశానికి అలిశెట్టి పురస్కారం
కందికొండ రామస్వామి స్మారక పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
గురురాజరావు కవితా పురస్కారానికి కవితా సంపుటాలకు ఆహ్వానం
పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాల ఆహ్వానం
'అక్షరాల తోవ' కథల పోటీ విజేతలు
ఏ రకమైన అనువాదం మంచిది?
'ధైర్యవచనా'నికి మద్దూరి పురస్కారం
నానీలు...

తాజా వార్తలు

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.