Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంపన్న దేశాల కొత్త ఎత్తులు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 16,2021

సంపన్న దేశాల కొత్త ఎత్తులు

వాతావరణ మార్పులపై గ్లాస్గో ఒప్పందానికి తూట్లు పొడిచే యత్నాలను అమెరికాతో సహా సంపన్న పశ్చిమ దేశాలు భద్రతా మండలి వేదికగా చేపట్టగా, దానిని రష్యా, చైనాతోబాటు భారత్‌ వ్యతిరేకించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రపంచమంతటా నేడు పర్యావరణ పరిరక్షణ కోసం పెరుగుతున్న ఒత్తిడితో అమెరికా, కెనడా, తదితర సంపన్న దేశాలు కొత్త ఎత్తులు ఎత్తాయి. తమ వంతుగా సాగించిన వినాశనాన్ని కప్పిపుచ్చుతూ, వర్థమాన దేశాలనే నేరస్తులుగా ఇవి చిత్రీకరిస్తున్నాయి. పర్యావరణం పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. ఇందుకు తాజాగా భద్రతా మండలిని వేదికగా చేసుకోజూశాయి.
వాతావరణ మార్పులను ప్రపంచ శాంతిభద్రతలతో ముడిపెడుతూ, గ్లాస్గో ఒప్పందం అమలును పరిశీలించే బాధ్యతను భద్రతా మండలికి కట్టబెట్టేందుకు వీలు కల్పించే ముసాయిదా తీర్మానాన్ని ఐరాస భద్రతామండలిలో ఐర్లండ్‌, నైగర్‌ ఓటింగ్‌కు పెట్టగా మండలిలోని మొత్తం 15 సభ్యదేశాలకుగాను 12 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. భారత్‌, రష్యా, చైనా దీనిని వ్యతిరేకించాయి. తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేయగా, రష్యా వీటో చేసింది. చైనా ఓటింగ్‌కు గైర్హాజరైంది. 2020లో జర్మనీ ఈ తీర్మానాన్ని మొదటి సారి ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో దీనిని చైనా, రష్యా తీవ్రంగా ప్రతిఘటించడంతో చర్చల దశలోనే అది ఆగిపోయింది. దీనినే స్వల్ప మార్పులతో ఇప్పుడు నైగర్‌, ఐర్లండ్‌ మళ్లీ ముందుకు తెచ్చాయి. మండలిలో వీటో అధికారం కలిగిన అయిదు శాశ్వత సభ్య దేశాల (చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌)లో ఏ ఒక్కరు తీర్మానాన్ని వీటో చేసినా అది చెల్లదు. రష్యా వీటో చేసినందున ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది.
పెట్టుబడిదారుల లాభాల కోసం అభివృద్ధి పేరుతో జీవావరణాన్ని నాశనం చేయడంలో అమెరికా, యూరప్‌ దేశాలు ముందున్నాయి. కార్బన్‌ బ్రీఫ్‌ డాట్‌ ఆర్గ్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రపంచ జనాభాలో పది శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, కెనడాలు ప్రపంచ కాలుష్యంలో 39శాతం వాటా కలిగి ఉన్నాయి. అదే సమయంలో జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చైనా, భారత్‌, బ్రెజిల్‌ ప్రపంచ కాలుష్యంలో కేవలం 23శాతం వాటా కలిగి ఉన్నాయి. దీనిని బట్టి తలసరి కాలుష్యం విడుదలలో వర్థమాన దేశాలకన్నా సంపన్న దేశాలే ముందున్నాయన్నది స్పష్టం. ఆ ప్రకారమే కర్బన ఉద్గారాల తగ్గింపులో సంపన్న దేశాలు ముందు బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇష్టపడని అమెరికా, యూరప్‌ దేశాలు వర్థమాన దేశాలనే మొదట తగ్గించుకోమని ఒత్తిడి తెస్తున్నాయి. భూగోళ ఉష్ణోగ్రతలను 2050 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలన్న పారిస్‌ ఒప్పంద స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. తద్వారా తమ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి భద్రతా మండలి పరిధిలోకి దీనిని తీసుకురావాలని యత్నిస్తున్నాయి. అలా చేయడమంటే వర్థమాన దేశాల పిలకను అమెరికా చేతికి ఇచ్చినట్టే అవుతుంది.
ఐరాసలో అత్యంత శక్తివంతమైన భద్రతా మండలి ప్రధాన బాధ్యత అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడం. ఆ బాధ్యతను అది సరిగా నిర్వర్తించకుండా పశ్చిమ దేశాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. రేపు వాతావరణ మార్పుల అంశంపైనా అలా జరగదన్న గ్యారంటీ ఏమిటి? వాతావరణ మార్పులను రాజకీయం చేయడం ద్వారా అభివృద్ధిచెందిన దేశాలు వర్థమాన దేశాలపై స్వారీ చేసే ప్రమాదముంది. కర్బన ఉద్గారాల తగ్గింపునకు అభివృద్ధి చెందిన దేశాలు గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయి. శిలాజ ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా ఆ దేశాల అభివృద్ధిని అడ్డుకునే యత్నం చేస్తున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఆయా దేశాలు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నదీ ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని ఐరాస ప్రధాన కార్యదర్శిని ఈ తీర్మానం కోరుతున్నది. ఆ విధంగా హామీలను నెరవేర్చడంలో వెనుకబడిన దేశాలను శిక్షించే అధికారాన్ని ధనిక దేశాలు తమకు తాముగా దఖలు పరచుకోవాలని చూస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం.
వాతావరణ మార్పుల నియంత్రణకోసం ఐరాస ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యు.ఎన్‌ ఫ్రేమ్‌వర్కు క్లయిమేట్‌ ఛేంజి కన్వెన్షన్‌ (యుఎన్‌ఎఫ్‌సిసిసి) ఆ బాధ్యత చూసుకుంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల ద్వారా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిం చేందుకు అదే సరైన వేదిక. దానిని పక్కన పెట్టి భద్రతా మండలిని తెరపైకి తీసుకురావడం ఎంతమాత్రం అనుమతించరానిది. ఈ విషయంలో భారత్‌, చైనా, రష్యా ఇదే ఐక్యతతో ముందుకు సాగాలి. వర్థమాన దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవి నికరంగా నిలబడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...
అప్రమత్తతే ఆయుధం
వివక్ష మీద వివక్ష...
మహాప్రమాదం
గాజు కొంపలోనుండి...!
రామా కనవేమిరా!
దొంగ భక్తి...
చదువులకు కంచెలు
'నీచు' రాజకీయం
హిందీ - హిందూత్వ
కరెంట్‌ కష్టాలకు కారకులెవరు?

తాజా వార్తలు

01:26 PM

సిక్రెట్ గా సినిమా చూసిన నటి సాయిపల్లవి

01:14 PM

ఈరోజు నేరుగా రైతుల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నాం: జగన్

01:08 PM

హైదరాబాద్‌లో బ్లూ ఫ్యాబ్ స్వి‌మ్మింగ్ ఫూల్ సీజ్‌

01:01 PM

టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి కారు ఎత్తుకెళ్లాడు..

12:57 PM

పుట్టినరోజు పేరుతో బాలికకు 35 ఏండ్ల వ్యక్తితో పెండ్లి..!

12:44 PM

వేములవాడ ఆలయం వద్ద పసికందు కిడ్నాప్

12:36 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం

12:27 PM

24 గంటల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు..!

12:22 PM

ఘోర ప్రమాదం..తల, మొండెం వేరు

12:19 PM

నేపాల్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీ

12:10 PM

ఏపీలో మహిళా వాలంటీర్ దారుణ హత్య

12:00 PM

రష్యా అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత..!

11:54 AM

వేముల‌వాడ గుడి వ‌ద్ద ప‌సికందు కిడ్నాప్

11:50 AM

యూపీలో డిజిటల్ లైంగికదాడి..!

11:34 AM

49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. ఎక్కడంటే..?

11:30 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

11:23 AM

విజయ్ దేవరకొండ, సమంతల 'ఖుషీ`ఫస్ట్ లుక్ విడుదల

11:17 AM

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

11:14 AM

నిద్రమత్తులో భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

11:06 AM

నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

10:54 AM

అస్సాంలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు..

10:27 AM

నిజామాబాద్ జిల్లాలో కంటైనర్-కారు ఢీ..ఐదుగురికి గాయాలు

10:25 AM

దేశంలో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు

09:08 AM

న్యూయార్క్ కాల్పుల ఘ‌ట‌న‌పై స్పందించిన బైడెన్

08:56 AM

తిరుమలలో భక్తుల రద్దీ

08:47 AM

బైక్‌పై 35 చలాన్లకు రూ. 8,125 బకాయి వసూలు

08:33 AM

నేడు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు

08:17 AM

క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' ట్రైల‌ర్

07:42 AM

ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..ప్రయాణికులకు గాయాలు

07:36 AM

బాలుడి పెదా‌లపై పురు‌షుడు ముద్దు..అస‌హ‌జ శృంగార‌మేమీ కాదు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.