Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2024కు ఆవే ఆలంబనా?! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 25,2021

2024కు ఆవే ఆలంబనా?!

''ఆవు తల్లిలాంటిది'' అంటున్నారు ప్రధాని. అంతేకాదు, గోమాత గురించి మాట్లాడటమే నేరమైపోయిందని కూడా వాపోయారు! ఆయనకు ఆవులమీద ఉన్న అపారమైన ప్రేమకు ఆనందించాలో, అందులో ఆవగింజంతైనా ఆడపిల్లల మీద లేనందుకు విచారించాలో అర్థంకాని పరిస్థితి దేశ ప్రజలది. ఎందుకంటే, ప్రధాని ఏ ఉత్తరప్రదేశ్‌ వేదికగా ఈ వ్యాఖ్య చేసారో, ఆ ఉత్తరప్రదేశ్‌లోనే గంటకో ఆడపిల్ల జీవితం గంగపాలవుతోంది. ఆ మాటకొస్తే ఆడపిల్లలపై అకృత్యాలను నిరోధించడంలోనే కాదు, సమస్త అభివృద్ధి సూచికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలది అట్టడుగు స్థానమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకడం సహజం. అందుకే యూపీలో గెలుపు అంత సులువుకాదని పాలకపక్షానికి బెంగపట్టు కున్నట్టుంది. ఈ అసంతృప్తిని దారి మళ్లించేందుకు తిరిగి భావోద్వేగాలను రగిలిస్తున్నారు. ప్రజల నమ్మకాలను సొమ్ము చేసుకునే వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పార్లమెంటు జరుగుతున్నా పట్టించుకోకుండా, గత పక్షం రోజులుగా ప్రధాని సాగిస్తున్న రాజకీయ కాశీయాత్రలు, గంగాస్నానాలు, విద్వేష వ్యాఖ్యలు, ఇప్పుడీ ఆవు ప్రేమలూ చూస్తోంటే ఆలోచనాపరులెవరికైనా ఈ అభిప్రాయాలు రాకమానవు.
అభివృద్ధి సంగతి అటుంచితే, అంతకంతకూ యూపీలో పెచ్చరిల్లుతున్న అసాంఘిక, అరాచక ఘటనలకు తోడు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతాంగం పట్ల ప్రభుత్వాలు అనుసరించిన తీరుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యేకించి లఖీంపూర్‌ ఖేరీ ఘటన వారికి మరింత ఆవేశం కలిగించింది. పైగా ఇది పథకం ప్రకారం సాగించిన కుట్రగా ''సిట్‌'' నిగ్గుతేల్చింది. అయినప్పటికీ అజరుమిశ్రాను మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఒకవైపు నిస్సిగ్గుగా రాజకీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూనే, మరోవైపు రాజ్యంగ విలువలను సైతం ఉపేక్షిస్తూ స్వయంగా ప్రధానే కాశీ కారిడార్‌ను ప్రారంభించడం చూస్తోంటే ఏలినవారి వ్యూహాలేమిటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ఈ సందర్భంగా ''దేశంలో ప్రతి ఔరంగజేబుకూ ఓ శివాజీ పుట్టుకొస్తాడని'' ప్రధాని కాశీలో చేసిన వ్యాఖ్యల సారం కూడా ఇదే. ఔరంగజేబు చనిపోయి నాలుగొందల ఏండ్లు గడిచిపోయాయి. ఇప్పుడాయన గురించి చర్చించడం వల్ల యూపీలోగానీ, దేశంలోగానీ యువతకు ఉద్యోగాలేమైనా పుట్టుకొస్తాయా? ఆర్థిక వ్యవస్థేమైనా సంక్షోభంలోంచి బయట పడుతుందా? లేక దేశమేమైనా అభివృద్థిపథంలో దూసుకుపోతుందా? ఇవేవీ జరుగవని ఏలినవారికి తెలియదనుకుంటే పొరపాటు. కాకపోతే, ఇలాంటి చర్చవల్ల ప్రభుత్వ వైఫల్యాలూ ప్రజల అసంతృప్తులూ మరుగునపడి, భావోద్వేగాలు చెలరేగి, మత సమీకరణలకు పురిగొల్పి భారిగా ఓట్లు తెచ్చిపెడతాయన్నది వారి వ్యూహం.
ఈ నేపథ్యంలో యూపీ అంచుల్లోనే ఉన్న హరిద్వార్‌లో జరిగిన ''ధర్మ సంసద్‌''లో వక్తల రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా యాధృచ్ఛికమని అనుకోలేం. ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు సాగిన ఈ సభ ఏకంగా ''హిందువులందరూ ఆయుధాలు చేపట్టి ముస్లింలపై యుద్ధానికి సిద్ధం కావాలి'' అని పిలుపునిచ్చింది. సభకు నేతృత్వం వహించిన యతి నరసింహానంద మాట్లాడుతూ... ''మనం ఉపేక్షిస్తే 2029నాటికి ఈ దేశానికి ఓ ముస్లింను ప్రధానిగా చూడాల్సి వస్తుంది. హిందూ జనాభా తగ్గి, ముస్లింల సంఖ్య పెరిగి రోడ్లమీద ముస్లింలు మాత్రమే కనిపించే పరిస్థితులొస్తాయి'' అని విద్వేషం వెల్లగక్కారు. దీనికి కొనసాగింపుగా ''ప్రతి హిందువూ రూ.లక్ష విలువైన ఆయుధాలు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాల''ని సాగర్‌ సింథూరాజ్‌ మహరాజ్‌ సెలవిచ్చారు. ఇవన్నీ దేనికి సంకేతాలు? ఏ వ్యూహంలో భాగాలు?!
ఇప్పుడు తాజాగా మన తెలంగాణలోనూ వినిపిస్తున్న ''హైదరాబాద్‌ వెర్సెస్‌ భాగ్యనగర్‌'' వివాదం కూడా ఈ కోవలోనిదే. బీజేపీకే కాదు, ఎంఐఎంకూ కావాల్సిందిదే. ఇది ఎలాంటి సమీకరణలకు దారితీస్తుందో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో స్వయంగా చూసాం. ప్రజల అవసరాలూ ఆకాంక్షలూ అన్నీ మట్టిగొట్టుకుపోయి బీజేపీ, ఎంఐఎం రెండు హిందూ ముస్లిం శిబిరాలుగా బలపడ్డాయి. కనుక, ఇప్పుడీ వివాదాన్నే నినాదంగా మలిచి తెలంగాణా వ్యాపితం చేస్తే రాష్ట్రంలో అధికారం సొంతమవుతుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోనూ గణనీయంగా (12శాతం) ముస్లిం జనాభా ఉందీ, దానికి తోడు నిజాం నిరంకుశ దోపిడీ పాలనా చరిత్ర కూడా ఉంది. కనుక ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని యూపీ తరహా విభజన రాజకీయాలకు బీజేపీ తెరవెనుక పన్నాగాలు పన్నుతోంది. ఎక్కడ చూసినా వీరి రాజకీయాలకు మనుషులు కాకుండా మతాలే ప్రాతిపదిక కావడం ఎంత దారుణం? కేవలం తమ రాజకీయావసరాల కోసం కలిసివున్న మనుషులను విడదీయబూనడం ఎంత అమానవీయం..? ఏ ప్రస్థానానికీ అమానవీయత? వీరి మాటల వెనుక మాయల్ని తెలుసుకోగలిగినప్పుడే దీనిని అడ్డుకోగలం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.