Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుస్తకమే నేస్తం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 26,2021

పుస్తకమే నేస్తం

కృష్ణదేవరాయల కాలంలో అంగళ్ళలో రతనాలు రాశులుగా పోసి అమ్మారని గొప్పలు చెప్పుకుంటారు కానీ అదేమంత గొప్ప విషయం కాదంటాను. ఆధునిక కాలంలో అక్షరాల కుప్పల్ని పోసి, అధ్యయనశీలురారా! రండి! మీ జ్ఞాన నేత్రాలు మనసారా విప్పారగ పుస్తకమూటల్ని సొంతం చేసుకోండి. జ్ఞాన సమాజ నిర్మాణంలో పాలు పంచుకోండి. అని సంవత్సరపు చివరి మజిలీలో భాగ్యనగరంలో అక్షరాల విందు భోజనాల్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు.
   ఇవేమీ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన సెల్లుఫోన్లుకాదు. బ్రాండెడ్‌ దుస్తుల ప్రదర్శనాకాదు. హీరోయినో, హీరోనో తొడిగి సృష్టించిన ట్రెండ్‌ డిజైనింగ్‌ డ్రెస్సులూ కావు. దూకుతూ రైడ్‌ చేయగల బైకో, కారో, స్పోర్ట్స్‌ మోటరోకాదు. ఇంట్లో ఉంటేనే హౌదా అమాంతం పెరిగిపోయే టీవీనో, ఫర్నిచర్‌సెట్‌ల ప్రదర్శనో కాదు. తిరిగి తిరిగి లాభాలు తెచ్చిపెట్టే రియల్‌ ఎస్టేట్‌ సమాగమమో, బంగారు ఆభరణాల మెరుపుల కౌంటర్లూ కాదు. కేవలం కాగితంపై పరుచుకున్న అక్షరాల సంపుటుల కోలాహలం! హృదయానికి ఆలోచనను అనుసంధానించే మధ్యవర్తుల మాటల సమూహాలు. వీటి పట్లా మోహము కలవాళ్ళు సమాజంలో ఉండటం మూలానే మనమింకా ఇలా మిగిలున్నాం. పుస్తకాలు కూడా వ్యాపారం కావచ్చు. కానీ కొన్నవాళ్ళు తిరిగి అమ్ముకుని సొమ్ముచేసుకోవడానికైతే కాదు. ఏదో నేను ఇంకా తెలుసుకోవాల్సినది ఉందనే ఎరుకతోనే పుస్తకాల్ని కొంటాము. ఈ ఎరుకే జ్ఞానమనవచ్చు. విజ్ఞానాన్ని పెంచుకోవాలనే తపన సమాజంలో పెరగటాన్ని ఆహ్వానించాలి. సరుకులపై, విలాస వస్తువులపై మోజును రోజు రోజుకూ పెంచి పోషిస్తున్న మార్కెట్‌ మాయాప్రపంచాన, అక్షరంపై ఆర్తిని రగిలించే ఇలాంటి పుస్తక ప్రదర్శనలకు హృదయపూర్వకంగా స్వాగతం పలకాలి.
   పుస్తకం లేని ఇల్లు ఆత్మలేని శరీరం లాంటిదంటారు. అంతేకాదు, రొట్టె శరీరాన్ని పోషిస్తుంది. పుస్తకం మనసును పోషిస్తుందనీ చెబుతారు. పుస్తకం మస్తకాన్ని తీర్చిదిద్దే సాధనం. ఏముంటుంది పుస్తకంలో? సమాజమే ఉంటుంది. ఈ విశ్వరహస్యమూ ఉంటుంది. మనుషులుంటారు. మనస్తత్వాలూ ఉంటాయి. పనులుంటాయి. ఫలితాలుంటాయి. ప్రదేశాలుంటాయి. అద్భుతాల వెనకాల దాగిన నిజాలుంటాయి. అనుభవాలుంటాయి. మొత్తంగా చూడలేని దృశ్యాలన్నీ గుదిగుచ్చి, వినలేని తెలుసుకోలేని అన్నింటినీ పోగేసి సంభాషించడముంటుంది. అందుకే ఒక జీవితం స్వతహాగా కూర్చుకోలేని జ్ఞాన సారమంతా అక్షరమై నిలిచేది పుస్తకంలోనే. మన మానవ జాతి వారసత్వంగా అందిస్తున్న అనుభవాల సంచితమే పుస్తకం. మానవాతీత మైనదేదీ ఉండదు. అన్నీ మానవుని సృజనాత్మకాలే. మనల్ని మనం ఆవిష్కరించు కోవటమే పుస్తకమంటే.
   మార్కెట్ల విస్తరణతో సరుకుల వినియోగమే మనిషితనంగా కీర్తించబడుతున్న తరుణంలో, ఉద్యోగం, ఆదాయమే పరమావధిగా చదువులు అమ్మబడుతూ కొనబడుతున్న సందర్భంలో పాఠ్యేతర అంశాల పట్లా చూపులు విస్తరించటం బుక్‌ఫెయిర్‌ సాధించిన విజయం. మరీ ముఖ్యంగా యువత విరివిగా పాల్గొంటూ పుస్తకాలను కొంటూ సెలెబ్రేట్‌ చేయటం ఆనందకరమైన అంశం. ఎంత ఆదాయమున్నా, చదువెంత కొనగలిగినా ఏదో మనం మిస్సవుతున్నామన్నలోటుతోనే అక్షరాలవైపుకు మళ్ళుతున్నారు. భోజనం కోసం కిరాణా సరుకుల్ని, కూరగాయలను ఎలా కొనుక్కుంటామో మేథోదాహం తీర్చుకునేందుకు పుస్తకాల్ని కొనుక్కుపోవాలి. అవును ఆవైపుగా దాహం పెరగాలి. రంగుల వెనకాల రహస్యాలను, మెరుపుల మాటున దాగిన వాస్తవాలను తెలుసుకోవాలి. భ్రమల తెరలు తొలగిపోవాలి.
   అయితే మనకు లభ్యమయ్యే పుస్తకాలన్నింటిలో జ్ఞానమే, సత్యాలే ఉంటాయని అనుకోరాదు. ఏ పుస్తకాలు చదవాలో ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం కసరత్తుచేయాలి. పుస్తకాలు మనం చదవాల్సిందే.అయితే మన సమాజ వాస్తవికత, పరిస్థితుల సమగ్రత ఏ పుస్తకాల్లో దొరుకుతాయో వెతుక్కోవాలి. కేవలం పుస్తకపూజ పనికిరాదు. ఆచరణశీలమైన అధ్యయనం అలవర్చుకోవాలి.
   పిల్లలకు పాఠ్యేతర పుస్తకాలను తల్లిదండ్రులు అందుబాటులోకి తేవాలి. అందుకు ఈ ప్రదర్శన శాలలు ఎంతో ఉపయోగపడతాయి. వందలాది పుస్తక సంస్థలు, రచయితలు, కవులు, పత్రికల నిర్వాహకులు ఈ సందర్భంగా లక్షలాది గ్రంథాలను సుందరంగా అలంకరించి ప్రదర్శించడం పండుగలా దర్శనమిస్తోంది. నిర్వాహకుల కృషి అభినందనీయం. ఒక్క రాజధానిలోనే కాదు. జిల్లా కేంద్రాలలో, గ్రామాలలోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాలి. యువత చేతుల్లో సెల్లుకాదు, పుస్తకం అలవాటుగా మారే పరిణామం రావాలి. పుస్తకం హస్తభూషణమై వర్థిల్లాలి. పుస్తక ప్రదర్శన సందర్భంగా కేవలం పుస్తకాలు కొనడమూ అమ్మడమే కాదు, ఎంతోమంది స్నేహితుల సాహితీకారుల కలయికలు, పలకరింపులు, సభలు, సమావేశాలు, కొత్తపుస్తకాల ఆవిష్కరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, చర్చలు విజ్ఞాన పునర్వికాసానికి నెలవుగా పుస్తక ప్రదర్శన నిలవడం గొప్ప సందర్భం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.