Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చిక్కు పడ్డ నూల్దారం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 28,2021

చిక్కు పడ్డ నూల్దారం!

''చేనేత వృత్తి భారతదేశంలోని వైవిధ్యాన్నీ, హస్తకళా నైపుణ్యాన్నీ చాటుతోంది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులకు సంపూర్ణంగా మద్దతునిద్దాం. చేనేతకు చేయూతనిస్తూ ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ప్రయత్నాలను బలోపేతం చేద్దాం'' అంటూ ఈ ఏడాది ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్వయంగా మన ప్రధాని నరేంద్రమోడీగారి సందేశం. ఈ పిలుపునిచ్చి నిండా నాలుగు నెలలైనా గడవక ముందే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ నేతన్నల వెన్ను విరిచే నిర్ణయం తీసుకుంది. చేనేత, జౌళి పరిశ్రమలపై ప్రస్తుతం ఉన్న అయిదు శాతం జీఎస్‌టీని జనవరి ఒకటి నుంచి ఏకంగా 12శాతానికి పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే 'చేనేత' కరోనా వంటి విపత్కర పరిస్థితులతో అవసాన దశకు చేరింది. తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చేనేత రంగాన్ని పెనం మీద నుండి పొయ్యిలోకి పడేయటమే.
   'ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవం' అంటూ డెబ్బైఐదేండ్ల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే మన నాయకగణం... మరి స్వాతంత్య్ర ఉద్యమ దీపికగా నిలిచిన చేనేత రాట్నాన్ని 'ఏ కీలుకా కీలు' విరిచే పనికి ఎందుకు పూనుకుంది? మన ప్రభుత్వాల ఉపేక్షతో ఆయా రంగాలు నిర్వీర్యమవుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి అయిదు కోట్ల కుటుంబాలు చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య ముఫ్పై లక్షలకు పడిపోయింది. అందులో 67శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం అయిదు వేల కన్నా తక్కువే. ఇప్పటికే సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేక వారి పరిస్థితి అగమ్యగోచరమైంది. 'మూలిగే నక్కపై తాటిపండు పడ'్డ చందంగా కరోనా ఈ పరిస్థితిని మరింత దెబ్బతీసింది.
   వృత్తులిప్పుడు ఆరిపోయిన దీపాలు అంటున్నారు మన పాలకులు. మరి ఆ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఉమ్మడి జాబితాలో ఉన్న చేనేత, జౌళి రంగాల నుండి గడిచిన దశాబ్ద కాలంలోనే 28 పథకాలు రద్దు చేసింది సర్కార్‌. ఒకప్పుడు మన చేనేత ఖండ ఖండాంతరాలలో ప్రఖ్యాతిపొందింది. అగ్గిపెట్టెలో ఆరుగజాల చీరను బ్రిటిష్‌ యువరాణికి బహూకరించిన్న నైపుణ్యం మన నేతన్నలది. ఆ వేళ్ళను ఆనాడే నరికితే దేశం స్వాతంత్య్ర సమరాంగణమయ్యింది.' సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌' అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017లోనే చేనేతపై12శాతం జీఎస్‌టీ మోపే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలతో దిగి వచ్చింది. చేనేత రంగానికి అన్యాయం చేయడంలో మన ప్రభుత్వాలు ఆ వలస పాలకుల బాటలోనే నడుస్తున్నాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలు అంటూ ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, విక్రయాలను చేపట్టిన కేంద్రం గతేడాది జులైలోనే అఖిల భారత చేనేత బోర్డుని సైతం రద్దు చేసింది. ఆ తరవాత జాతీయ చేనేత అభివద్ధి కార్పొరేషన్‌ను కుదించింది. తాజాగా జీఎస్‌టీ పెంపు నిర్ణయం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటికే అయిదుశాతం జీఎస్‌టీతో కుదేలయిన చేనేత పరిశ్రమ ఉత్పత్తులూ ఘననీయంగా పడిపోయాయి. కేవలం వ్యాపార సంస్థలు మినహా చీరలు, ఇతర వస్త్రాలను నేతన్నల వద్దనుంచి ఇతరులెవరూ కొనే పరిస్థితి లేదు. చేనేతను ఆదుకోవటమంటే ఇదేనా?
  కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకాన్ని తెచ్చినప్పటికీ చేనేతకు, చిన్న జౌళి పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు గతేడాది 30 నుంచి 40శాతందాకా పెరిగాయి. ఇంధన ధరల పెంపువల్ల రవాణా ఖర్చులు సైతం అధికమయ్యాయి. కరోనా తరవాత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రాల సంగతి అటుంచితే కేంద్రం నుంచి చేనేత కార్మికుల కోసం సమర్థ పథకం ఒక్కటీ ఆసరాగా నిలవడంలేదు. 1990ల్లో ప్రారంబభమైన నూతన జౌళి విధానంలో నూలు మిల్లులు ఉత్పత్తి చేసే చిలపనూలు (హ్యాంక్‌ యార్న్‌)కు కోత పడటం చేనేతను అంపశయ్య మీదకు పంపింది. నేటి జీఎస్‌టీ పెంపుదల దానికి మరణశాసనమవుతుంది. కార్ల ఉత్పత్తి దార్లు మొదలు సెల్‌ఫోన్‌ తయారీ దార్ల వరకు జీఎస్‌టీని తగ్గించమని కేంద్రప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. బహుశా ఆ మిత్రులను సంతృప్తి పరిచేందుకు చేనేతను ఫణంగా పెడుతున్నట్టున్నారు. ఇప్పుడు జీఎస్‌టీని 12శాతానికి పెంచడం చేనేతకు, జౌళిరంగంలోని చిన్న పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ. తెలంగాణ, తమిళనాడు, ఒడిశావంటి రాష్ట్రాలు చేనేతరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ జీఎస్‌టీ దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కనీసం స్పందన శూన్యం. అనేక మంది ప్రజలకు ఉపాధి కల్పించే చేనేత ఉత్పత్తులపై పన్నును తగ్గించాలి. ఇప్పటికైనా అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ ఉన్న మన చేనేత ఉత్పత్తులకు రక్షణ, నేతన్నలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.