Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సత్య (పాల్‌ మాలిక్‌) వాక్కులు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 05,2022

సత్య (పాల్‌ మాలిక్‌) వాక్కులు

''మోడీ ఓ దురహంకారి''.
''రైతులేమైనా నాకోసం చనిపోయారా? అని విరుచుకుపడిన పొగరుబోతు.''
''రైతుల మరణాలను అపహస్యం చేసిన ప్రధాని''
   ఈ మాటలు ఏ ప్రతిపక్ష నాయకుడివో అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నోటి వాక్కులివి! ఆదివారం హరియాణాలోని దాద్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజలపట్ల ప్రధాని క్రూరత్వానికీ, ప్రజా ఉద్యమాల పట్ల పాలకుల అమానవీయతకు దర్పణాలు.
   కారణాలేమైనప్పటికీ మొదటి నుంచీ రైతుల ఉద్యమం పట్ల ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఈ గవర్నర్‌ మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయమై తాను ప్రధానిని కలిసినప్పుడు, ఆయన అత్యంత దురహంకార పూరితంగా ప్రవర్తించారనీ, ఉద్యమంలో 500మందికి పైగా రైతులు మరణించడాన్ని ప్రస్తావిస్తుండగానే ''వారేమైనా నాకోసం చనిపోయారా'' అంటూ దురుసుగా విరుచుకు పడ్డారనీ ఆయన తెలిపారు. దానికి నేను ''దేశాన్ని పాలించేది మీరే గనుక వారి మరణాలకు మీరే బాధ్యులు'' అని బదులిచ్చాననీ పేర్కొన్నారు. అలా కొంతసేపు జరిగిన తీవ్ర వాగ్వావాదం తరువాత ఆయన సూచన మేరకు అమిత్‌షాను సంప్రదించగా ''సత్యా... ఆయనకు మతిపోయింది.'' అన్నారని కూడా వెల్లడించారు. ఆ తరువాత దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆయన వివరణ పేరుతో కొంత వెనక్కి తగ్గినా, అప్పటికే ఓ వీడియో ద్వారా ఈ ప్రసంగమంతా వైరల్‌ కావడంతో ప్రధాని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
   రైతులపై ప్రధాని స్పందన ఆయన అహంకారాన్నే కాదు, ప్రజల పట్ల బాధ్యతారాహిత్యాన్నీ సూచిస్తున్నది. అయితే ఇదేమీ సత్యపాల్‌ మాలిక్‌ వ్యాఖ్యల ద్వారా మాత్రమే తెలిసిన కొత్త విషయమేమీ కాదు. ఉద్యమ ప్రారంభం నుంచీ విరమణదాకా... ప్రధాని, ప్రభుత్వం రైతాంగంతో వ్యవహరించిన తీరు ఆయన క్రూర స్వభాన్ని ఎప్పుడో తేటతెల్లం చేసింది. మరణించిన రైతుల పట్ల కనీస సంతాపం, విచారం కూడా వెలిబుచ్చలేని వీరి కసాయితనాన్ని ప్రజలెప్పుడో పసిగట్టారు. స్వాతంత్య్రోద్యమం తరువాత దేశం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఎగిసిపడిన ఈ ఉద్యమానికి అబ్బురపడి ప్రపంచమే సలాం చేసింది కానీ, ఈ కాషాయ పాషాణాలు మాత్రం కరిగింది లేదు.
   పైగా ఒక వైపు అధికారిక నిర్బంధాలు, మరోవైపు అసాంఘిక శక్తుల దాడులూ దౌర్జన్యాలూ, ఇంకోవైపు అమానుష అసత్య ప్రచారాలతో ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారు. కానీ ప్రాణాలు కోల్పోతూ కూడా మొక్కవోని దీక్షతో ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టిన అన్నదాతల ముందు ఈ ప్రభుత్వానికి తలవంచక తప్పలేదు. అలా తప్పని స్థితిలోనే ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకుంది తప్ప, చిత్తశుద్ధితో కాదనడానికి సత్యపాల్‌ మాలిక్‌ ప్రసంగం మరో ఉదాహరణ మాత్రమే. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందో లేదో, వాటిని మరో రూపంలో తీసుకొస్తామని స్వయానా వ్యవసాయమంత్రే నోరుజారడం, ఆ తరువాత మాట మార్చడం కూడా ఈ ''చిత్తశుద్ధి''ని ఎత్తిచూపడం గమనార్హం. లేదంటే రద్దు చేసే చట్టాలను కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఆకాశానికెత్తడంలోని ఆంతర్యమేమిటి? అంతెందుకు, నిర్దాక్షిణ్యంగా రైతులను వాహనాలతో తొక్కి చంపిన, లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో మాత్రం ప్రభుత్వ వైఖరి చెపుతున్నదేమిటి?
   ఘటనకు కేంద్ర మంత్రి అజరుమిశ్రా తనయుడు అశిష్‌మిశ్రాయే కారకుడని బాధితులైన రైతులూ, ప్రత్యక్ష సాక్షులూ చెప్పినప్పుడు బీజేపీ ఏం చేసింది? అసలు ఆ సమయంలో అతడు అక్కడ లేనేలేడని తోసిపుచ్చింది. అందుకు దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసును నీరు గార్చేందుకు పూనుకుంది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ''సిట్‌''ను ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పుడు ఆ ప్రత్యేక దర్యాప్తు బృందమే (సిట్‌) నిందితుడు ఆశిష్‌ మిశ్రా ఆ సమయంలో ఘటనాస్థలంలోనే ఉన్నాడని దర్యాప్తులో తేల్చి చెప్పడంతోపాటు, అతడే ప్రధాన నిందితుడని కూడా చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనికి బీజేపీ ఏం సమాధానం చెపుతుంది? ఘటనకు ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అజరుమిశ్రాను కూడా చార్జిషీట్‌లో చేర్చాలని రైతులూ, వారి తరుపు న్యాయవాదులూ కోరుతున్నారు. ఘటనకు కారణమైన వాహనం కూడా ఆయనపేరు మీదే నమోదై ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. విచారణకు వీలుగా ఆయనను మంత్రివర్గంలోంచి తొలగించాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ నిర్లజ్జగా అజరుమిశ్రాను మంత్రివర్గంలో కొనసాగించడమే కాదు, యూపీ ఎన్నికల సభల్లోనూ తిప్పుతున్నారు కదా! దీన్నేమంటారు? ఇది విచారణకు ఆటంకం కాదా..? ఇవి ప్రభుత్వ పెద్దల దురహంకారాలకూ, దురన్యాయాలకూ ప్రతీకలు కావా..? ఇవన్నీ చూశాక కూడా సత్యపాల్‌మాలిక్‌వి ''సత్యవాక్కులు'' కాదని ఎవరు మాత్రం భావించగలరూ..?! బహుశా అందుకేనేమో ఈ వ్యాఖ్యల్ని ఖండించడానికి కూడా కమలనాథులెవరూ ప్రయత్నించడం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.