Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాణాలకు విలువేదీ..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 12,2022

ప్రాణాలకు విలువేదీ..?

కొత్త ఏడాది ప్రారంభమై పట్టుమని పదిరోజులైనా కాలేదు. అప్పుడే రాష్ట్రంలో పది మంది ఉపాధ్యాయులు, రాజకీయ వేధింపులతో ఒక కుటుంబం, అప్పుల భాదతో మరో కుటుంబం అర్థాంతరంగా తమ జీవితాలను ముగించుకున్నారు. నిన్నటికి నిన్న ఖమ్మంలో ఒక కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే ''చావుభయం కన్నా బతుకు భయమే అధికంగా ఉంది. ప్రాణాన్ని తాకట్టు పెట్టి జీవితాన్ని అప్పుగా తీసుకున్నా. అప్పుకోసం.. తలుపు తడితే, నాప్రాణాన్నే తీసుకో అంటా''.. అంటూ కృషీవలుడులో దువ్వూరి రామిరెడి రాసిన
   ''మరణ భయంబునాకు అణుమాత్రము లేదు'' అనే పద్యం గుర్తుకు వస్తోంది.
   మరి ఈ పరిస్థితికి కారణాలేమిటీ? వ్యక్తిగతమా? సామాజికమా? తప్పుప్రజలదా? పాలకులదా? పాలకులు అనుసరిస్తున్న విధానాలదా? ఈ ప్రశ్నలకు సమాధానాల సంగతి అటుంచితే ఆత్మహత్య సరియైనది కాదనడంలో మరో ఆలోచనకు తావు లేదు. కానీ అవి మన దేశానికి సహజాతాలుగా మారిపోయాయి. గత కొన్నేళ్లుగా దేశంలో రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలే వినేవాళ్ళం. అవి క్షణికావేశంతో వేసిన అడుగులు కావు. జీవితాలు అప్పుల సుడిగుండాల్లో చిక్కుకుంటున్నాయి. బతికే మార్గాలు మూసుకుపోతున్నాయి. అంతిమంగా ఈ నిర్ణయాలకు దారి తీస్తున్నాయి. కాగా ఇప్పుడు అన్ని రంగాలలో అన్ని వర్గాలలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉపాధ్యాయుల మెడలో స్థానికత గుదిబండలా మారడంతో ఈ జాబితాలోకి ఉపాధ్యాయులు కూడా చేరారు. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జీవితంతో పోరాడలేక, సమస్యలను ఎదుర్కోలేక, పాలకుల పాశవిక ధోరణి భరించలేక, చీకట్లో బతకలేక ఈ దారుణ నిర్ణయానికి వస్తున్నారు. ఒకదేశంలో ప్రజలు ఆత్మహత్యల పాలవుతున్నారంటే ఆ దేశాన్ని కచ్చితంగా బలహీనదేశంగానే పరిగణించాలి.
   నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తరువాత ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకుంటున్నాయి. దీంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతుల ఆత్మహత్యలకు కనీస మద్దతు ధర లభించకపోవడం ఒక కారణమైతే, మరోకటి పండించిన పంటను ప్రభుత్వాలు సేకరించకపోవడం. ఈ రెండింటి కారణంగా వ్యవసాయం దెబ్బతింటోంది. ఎంఎస్‌ఎంఈలు దివాళా తీస్తున్నాయి. కనీసం వీటికి బ్యాంకుల రుణాలు సైతం అందడం లేదు. దీంతో సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. తాజాగా మిర్చికి తామర తెగులు వచ్చి లక్షల్లో నష్టం వాటాల్లుతోంది. ఈ సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కనీసం అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఎంఎస్‌పీపై కేంద్రాన్ని రాష్ట్రాలు అడగటం లేదు. 2014 ఎన్నికలలో గెలిస్తే ఒకటిన్నర రెట్లు ఎంఎస్‌పీ అని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఆ మాటే మేం అనలేదని సర్వోన్నత న్యాయస్ధానానికే అసత్యాలు తెలిపింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానంతో అధికార పీఠమెక్కిన మోడీ ఏలుబడిలో నిరుద్యోగిత రేటు గత నలభై ఎండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ విధానాల ఫలితమే ప్రభుత్వ రంగం ప్రభను కోల్పోయి ప్రయివేటు రంగం పుంజుకోవడం. దీనితో అనేక లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారు బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు. ఇందుకు కారకులెవరు?
   విఫల ప్రేమలూ, కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడటం గతం నుంచే ఉండేది. వ్యాపార నష్టాలు, వ్యవసాయం దెబ్బతినడం వంటిది ఆధునిక ప్రేరకాలు. ఇవి రెండూ ప్రభుత్వాలు నియంత్రించదగ్గవే. కానీ, అందుకు సంబంధించిన చర్యలు ఒక్కటి చేపట్టడం లేదు సరి కదా, కాస్తో, కూస్తో ఆసరాగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నారు. దోపిడీవ్యవస్థలో దోపిడీశక్తులకు ప్రభుత్వం అండగా నిలబడినప్పుడు దోపిడీశక్తులు- ప్రభుత్వం ఒకటే అయినప్పుడు ప్రజలను నిరాశ ఆవహిస్తుంది. ఒక్కొక్కసారి లోతుగా ఆలోచిస్తే.. ఈదోపిడీ వ్యవస్థ కావాలని ప్రజలలో పిరికితనం పెంచుతున్నట్టు కనిపిస్తుంది. అన్నీ ప్రయివేటీకరణ చేయాలనే పాలసీ వెనుక కూడా అదే కుట్ర కనిపిస్తుంది. యావత్‌ ఉత్పత్తి రంగాన్ని, విక్రయ రంగాన్ని అంబానీలకూ, అదానీలకూ అప్పగించటంలో దాగి ఉన్నది కుట్ర కాకపోతే ఏమిటి? చిన్నచిన్న వ్యాపారులేమి కావాలి? బతకలేక.. పిల్లలను పెంచలేక.. సంసారం ఈదలేక ఏమవుతారు? ఆత్మహత్యల వెనుక ప్రభుత్వాల కుట్ర, దోపిడీ వ్యవస్థ లక్షణాలున్నాయి అనడానికి ఇవి ఓ ఉదాహరణ మాత్రమే. ఎందుకీ ఆత్మహత్యలు? ప్రశ్నిద్దాం.. పోరాడుదాం.. ఆత్మహత్యలు చేసుకోవటమంటే దోపిడీ వ్యవస్థకులొంగటమే. పుండోదిక్కున ఉందంటే మందో దిక్కున పెట్టే అలవాటు మన వ్యవస్థది. దీనిని చక్కదిద్దాల్సిన బాధ్యత పౌరసమాజానిది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.