Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫార్ములా తిరగబడుతోంది..! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 15,2022

ఫార్ములా తిరగబడుతోంది..!

మంత్రులూ ఎమ్మెల్యేలంతా వరుసబెట్టి వలసబోతుంటే ఈ సంక్రాంతి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది కమలనాథులకు. మరోసారి యూపీని గెలుచుకోవడం ద్వారా ''ఢల్లీీ''ని నిలుపుకోవాలన్న బీజేపీ వ్యూహాలకు స్వపక్షం నుండే సవాళ్ళు ఎదురవుతున్నాయి. మొన్న స్వామి ప్రసాద్‌ మౌర్య, నిన్న దారాసింగ్‌ చౌహాన్‌, ఇప్పుడు ధరంసింగ్‌ సైనీ... ముగ్గురు కీలక నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేసి, పార్టీని వీడి సమాజ్‌వాదిపార్టీలో చేరడం వారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. వీరిని అనుసరిస్తూ పలువురు ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతుండటంతో ఈ సంఖ్య పదిహేనుకు చేరింది. ఇది ఇప్పటికే బీజేపీని షాక్‌కు గురిచేస్తుండగా, ఈ షాక్‌లు ఇంకా కొనసాగుతాయంటూ ధరంసింగ్‌ సైనీ హెచ్చరిస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ సైతం ''బీజేపీని వీడే నేతల వార్తలు లేకుండా ఇకపై రోజు గడవబోదు'' అని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
చూస్తుంటే బీజేపీ మార్క్‌ ''సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములా'' ఇప్పుడు రివర్స్‌ గేర్‌లో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. గత 2017 ఎన్నికల నాటికి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పట్ల నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, అక్కడి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఉపయోగించుకుని రూపొందించిన ఈ ''సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫార్ములా'' బీజేపీకి ఘన విజయాన్ని సమకూర్చింది. ఈ ఫార్ములాకు ఆకర్షితులైన ఓబీసీలంతా తమ వాటా తమకు దక్కుతుందని భావించి హిందూత్వ శక్తులకు మద్దతిచ్చారు. కానీ, బీజేపీతో ఇన్నేండ్ల ప్రయాణం తరువాత, ప్రస్తుత 2022 శాసనసభ ఎన్నికల నాటికి వారి భ్రమలన్నీ తొలగిపోవడంతో ఇప్పుడు అదే ''ఫార్ములా'' తిరుగబడుతోంది. ఆ ఫలితమే ఈ పరిణామాలంటూ వెలువడుతున్న విశ్లేషణలు యూపీలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ పార్టీని వీడుతున్న నేతలంతా వెనుకబడిన తరగతులకు చెందినవారే కావడంతో పాటు, ఓబీసీల్లో గణనీయమైన ప్రాబల్యమున్నవారు కావడం గమనార్హం.
నిజానికి కేవలం ఓబీసీలు మాత్రమే కాదు, అన్ని తరగతుల ప్రజలూ యోగీ పాలనాతీరుపై అంతే వ్యతిరేకతతో ఉన్నారు. ఈ అస్తవ్యస్థ అసమర్థ పాలనకు యోగి ఎంత కారణమో, బీజేపీ అధిష్టానమూ అంతే కారణమని గుర్తిస్తున్నారు. కరోనా నియంత్రణలో, రోగులకు వైద్యం అందించడంలో బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘోర వైఫల్యాలను గంగానది సాక్షిగా గమనించారు. మత విద్వేషాలూ, మూకదాడులూ, బూటకపు ఎన్‌కౌంటర్‌లూ, హత్యలూ - అత్యాచారాలూ, దాడులూ - దౌర్జన్యాలతో శాంతిభద్రతలకు తావేలేని అరాచక పాలనను అనుభవించారు. వీటికి తోడు చారిత్రాత్మకమైన రైతుల న్యాయపోరాటంపై సాగిన దారుణకాండలూ, లఖీంపూర్‌ఖేరీ మారణకాండలూ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో బీజేపీకి వీస్తున్న ఎదురుగాలులు కూడా ఈ వలసలకు ప్రేరకాలనడంలో సందేహమేమీలేదు.
అయితే ప్రతికూలతలెన్నున్నా, ఈ ఊహించని ఎదురుదెబ్బలు కలవరపెడుతున్నా... రేపు ఢిల్లీలో తిరిగి నిలవాలంటే నేడు యూపీని గెలవడం బీజేపీకి అనివార్యంగా మారింది. ప్రధానమంత్రిగా మోడీ పునరాగమనమనేది ముఖ్యమంత్రిగా యోగీ విజయంపైనే ఆధారపడి ఉంటుందన్న అమిత్‌షా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అందుకే ఈ ప్రతికూలతలన్నిటినీ అధిగమించడానికి మత విద్వేషాలే ఏకైక పరిష్కారంగా అది ముందుకు సాగుతోంది. యోగి ఆధిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను ''80:20'' పోరాటంగా అభివర్ణించడంలోనే వారి వ్యూహమేమిటో బోధపడుతోంది కదా! రాష్ట్రంలోని హిందూ ముస్లిం జనాభా నిష్పత్తిని దృష్టిలో ఉంచుకునే ఆయనీ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం. తమ పాలనా వైఫల్యాల పుణ్యమాని ప్రజాజీవితం ఇంతటి సంక్షోభంలో ఉంటే... వాటి పరిష్కారాల గురించి మాట్లాడకుండా, నిస్సిగ్గుగా ''మనం'', ''వారు'' అనే విభజన రాజకీయాలతో తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మొన్న మోడీ వారణాసిలో కాశీకారిడార్‌ ప్రారంభించినా, నిన్న హరిద్వార్‌లో మత విద్వేషం బుసలు కొట్టినా, రేపు యోగి ఆధిత్యనాధ్‌ అయోధ్య నుండి పోటీ చేసినా అవన్నీ ఈ వ్యూహంలో భాగాలే.
ఈ వ్యూహం కేవలం యూపీకే పరిమితమని కూడా అనుకోలేం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ట్రాలకు వ్యాపింపజేస్తారనడంలో సందేహమేలేదు. ఎందుకంటే యూపీకి ముందే గోవాలోనూ మంత్రి మైఖేల్‌ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్‌జాంతేలు ఆ పార్టీని వీడారు. వీడుతూ ''బీజేపీ సామాన్యుల పార్టీ కానేకాదని'' కుండబద్దలు కొట్టారు. ఇలా అంతటా ఎదురుగాలులే వీస్తున్న తరుణంలో ఇంతకుమించి వారు చేయగలిగిందేముంటుంది? విద్వేషమే ఓ విధానంగా అమలుచేసే వారి నుండి ఇంతకన్నా ఏం ఆశించగలం? కాకపోతే, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న అసలు సమస్యలను పక్కకు పెట్టి, కలిసివున్న ప్రజల్లో చీలికలు సృష్టించి, తమ అధికారయాగానికి వారిని సమిధలుగా వాడుకోజూడటం ఎంత దారుణం..?! ప్రజలన్నా, వారి జీవితాలన్నా వీరికి అంత చులకనా? అయినా ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా..? ఏం జరుగుతుందో వేచి చూడాలి. మార్చి 7న 'బొమ్మ' రిలీజవుతుంది కదా!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.