Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విరాట్‌ పర్వం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2022

విరాట్‌ పర్వం

కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు విరాట్‌ కోహ్లీ ప్రకటించడంతో భారత టెస్టు క్రికెట్‌లో ఒక పర్వం ముగిసినట్లైంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తరువాత రోజే విరాట్‌ కోహ్లి ఈ బాంబు పేల్చాడు. వచ్చే నెలలో శ్రీలంకతో బెంగళూరులో మొదటి టెస్టు కోహ్లికి వందో టెస్టు. ఈ మ్యాచ్‌లో ఆడిన తరువాత కావాలనుకుంటే అభిమానుల సమక్షంలో కెప్టెన్సీ నుంచి వీడ్కోలు తీసుకోవచ్చని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) చేసిన ప్రతిపాదనను అతడు తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. ఒక మ్యాచ్‌తో మారిపోయేదేమీ ఉండదని, ఏ పని చేసినా 120 శాతం ఫలితం సాధించాలి. లేనప్పుడు తప్పుకోవాలన్నదే తన ఫిలాసఫీ అని కోహ్లి విస్పష్టంగా చెప్పాడు. చాలా మంది కెప్టెన్లు తాము నిష్క్రమించడానికి ముందు మెరుపులు మెరిపించి అభిమానులతో భేష్‌ అనిపించుకోవాలని ఆరాటపడతారు. కోహ్లి అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉంటూ వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్‌ కోహ్లి నిష్క్రమణలోనూ తన విలక్షణతను చాటుకున్నాడు. భారత క్రికెట్‌ జట్టును సమర్థవంతంగా నడిపించడంలో విజయవంతమైన సారథిగా అతనికి మంచి పేరే ఉంది. అతడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌ రేటింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉన్న భారత జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టడంలో తనదైన ముద్ర వేశాడు. కోహ్లి సారథ్యంలో భారత్‌ 68టెస్టులు ఆడగా 40మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం 17 మ్యాచ్‌లలోనే ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన 11టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న కోహ్లి సేన, విదేశాల్లో 37 టెస్టులు ఆడి 16 విజయాలను నమోదు చేసుకుంది. 43.6శాతం సగటు విజయాల రేటుతో కెప్టెన్‌గా బాగానే రాణించాడు. అంతకు ముందు కెప్టెన్‌ ఎంఎస్‌ దోని ఇతర ఫార్మేట్లలో రాణించినా, టెస్టుల్లో అంతగా క్లిక్‌ కాలేకపోయాడు. మరో మాజీ కెప్టెన్‌ , ప్రస్తుత బిసిసిఐ చైర్మన్‌గా ఉన్న సౌరబ్‌ గంగూలీ 28 టెస్టులు ఆడి 39.3 సక్సెస్‌ రేటుతో కోహ్లి తరువాతి స్థానంలో నిలిచాడు. ఏ విధంగా చూసినా కోహ్లి సారథ్యంలో భారత టెస్టు క్రికెట్‌ పరిస్థితి మెరుగుపడిందనేది వాస్తవం.
   అయితే, టి-20, వన్డే పార్మేట్లలో ప్రపంచ కప్‌లో కానీ, ఐసిసి అంతర్జాతీయ టోర్నీల్లో కానీ భారత్‌ను విజేతగా నిలపడంలో అతడు విఫలమయ్యాడు. టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇదమిత్థంగా తెలియరాలేదు. కెప్టెన్‌గా పెరుగుతున్న ఒత్తిడి వల్ల బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నానని, అందుకే తప్పుకుంటున్నానని అతడు ఇచ్చిన వివరణ విశ్వసించేదిగా లేదు. టి-20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లిని తప్పించినప్పుడు అతనికి, బిసిసిఐకి మధ్య సంబంధాలు సవ్యంగా లేవన్న సంకేతాలు వచ్చాయి. కోహ్లికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని బిసిసిఐ చీఫ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలతో కోహ్లి బాహాటంగానే విభేదించాడు. ఆ తరువాత కూడా ఈ విభేదాలను పరిష్కరించేందుకు బిసిసిఐ నుంచి ఎలాంటి ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. ఆటగాళ్ల ఎంపికలో కెప్టెన్‌ అభిప్రాయాలకు బిసిసిఐ విలువ ఇవ్వలేదన్న విమర్శలూ వినిపించాయి. బిసిసిఐ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా పుత్ర రత్నం జైషా వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. గత ఏడాది టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైనప్పుడు పేసర్‌ మహ్మద్‌ షమీ పాకిస్థాన్‌కు అమ్ముడుపోయాడంటూ విద్వేషకులు కొందరు ఆయనపై విషం కక్కినప్పుడు కోహ్లి ఏమాత్రం తటపటాయించకుండా తన జట్టు సహచరుడికి బాసటగా నిలిచాడు. మ్యాచ్‌లో ఓటమికి అనేక కారణాలుంటాయి. షమీ సాధించిన విజయాలు మరిచిపోయారా? మరుగునపరిచారా? అటువంటి వారి గురించి ఒక్క నిమిషం ఆలోచించినా వృథానే అంటూ కోహ్లి విద్వేషకుల నోర్మూయించాడు. జట్టులో సమిష్టితత్వాన్ని, ఐక్యతను పెంపొందించడంలో కెప్టెన్‌గా కోహ్లి నూటికి నూరు మార్కులు సంపాదించాడు. జట్టు సభ్యుల బలాలు, బలహీనతలను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రోత్సహించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. కోహ్లి తన దూకుడైన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. అటువంటి మేటి ఆటగాడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం బాధాకరం. ఆ లోటును భర్తీ చేయగల ఆటగాడు దొరకడం కష్టమే. అయినా, కోహ్లి కేవలం కెప్టెన్సీ నుంచే తప్పుకున్నాడు. జట్టులో సీనియర్‌ ఆటగాడిగా కొనసాగుతాడు కాబట్టి కోహ్లి నుంచి కొత్త సారథి సహకారం పొందే సౌలభ్యం ఉంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.