Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్పొరేట్ల చెలికాని ప్రవచనం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2022

కార్పొరేట్ల చెలికాని ప్రవచనం

కార్పొరేట్లు మోడీ అంటే పడిచావడానికి కారణం పెద్ద రహస్యమేమీకాదు. ఇప్పటిదాక ఏ పాలకులూ మాట్లాడనంత ఖుల్లాగా ఆయన మాట్లాడుతున్నారు. వారి పక్షాన ఆయన నిలుస్తున్నారు. దానికాయన ఏమాత్రం సిగ్గుపడరు. మొహమాటపడరు. అవి కార్మికకోడ్‌ల గురించైనా, వ్యవసాయ చట్టాలైనా, ఎన్‌ఎంపీ అయినా కార్పొరేట్లకు అంటకాగడమే ఆయన జీవిత పరమావధి. డౌట్‌ ఉండే వాళ్ళు నిన్నగాక మొన్న ఆజాదీకా అమృత మహౌత్సవ్‌లో ఆయన ప్రవచనాలు వినండి. లేదా చదవండి! ఈ 75ఏండ్లలో ''హక్కుల గురించి మాట్లాడటం, పోట్లాడటం వల్లనే మన దేశం వెనకపడిపోయింద''ట! మిగిలిన పాతికేండ్లూ కఠోర శ్రమ, త్యాగం, తపస్సు ద్వారా మనం అంకిత భావంతో పనిచేస్తే మన దేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందట! ఈ ప్రవచనాలు ఆయన 'బ్రహ్మకుమారీస్‌'లో ఇచ్చారు. ''మనిషి నిమిత్తమాత్రుడు. జరిగేదాన్ని మనం ఆపలేము. కాబట్టి దాన్ని ఆమోదించడం మంచిది'' ఇదీ బ్రహ్మకుమారీస్‌ సిద్ధాంతం. మన చుట్టూ జరుగుతున్న దోపిడీని వ్యతిరేకించలేము కాబట్టి తలొంచుకు బతకమనేది ఆ సిద్ధాంత సారాంశం. సరైన ప్లేసే ఎంచుకున్నారు మోడీ సాబ్‌!
   మోడీగారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. 'ఆజాదీ' దేనినుండి? దేనికి 75ఏండ్లు అయ్యింది? బ్రిటిషు సామ్రాజ్యవాదం మనదేశాన్ని పీల్చి పిప్పిచేసిన విధానాన్ని మోడీ ''పూర్వీకులు'' తప్ప (అంటే ఆర్‌ఎస్‌ఎస్‌వారు తప్ప) మిగిలిన యావత్‌ భారతావని ప్రతిఘటించింది. 1857 వరకు సాగిన మొదటి దశ సుమారు వందేండ్లూ బిర్సా ముండా వంటి గిరిజన తెగల నాయకుల నుండి రాజులు, మహారాజులు, నవాబుల వరకు మనదేశాన్ని పాలించుకునే 'హక్కు' కొరకు ప్రాణాలకు తెగించిపోరాడారు. అప్పటినుంచి 1947 వరకు కొత్తగా ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వర్గం దాని రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌, కార్మికవర్గం దాని పార్టీ అయిన కమ్యూనిస్టులే కాక, గదర్‌వీరుల మొదలు భగత్‌ సహచరుల వరకు, ఖిలాఫత్‌ ఉద్యమ కారుల వంటి ఎందరో భరతమాత దాస్య సృంఖలాలు తెంపే హక్కు కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యంపై పోరాడారు. రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు ఆ'హక్కు' కోసం సాగిన పోరే! మోడీకి, ఆయన అంతేవాసులకు ఈ విషయం అర్థం కాదు. జయచంద్రులకి వారసులుకదా? అందుకే నేడు అమెరికన్‌ సామ్రాజ్యానికి అంటకాగడానికి యథాశక్తి ప్రయత్నిస్తున్నారు.
   మోడీతర్కంలో మరో ప్రమాదకర అంశమేమంటే నేడు 'హక్కు'ల కోసం అడిగేవారు వాటికి భంగమొచ్చినప్పుడే అడుగుతున్నారు. ఆక్స్‌ఫామ్‌ నివేదిక మనదేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయంటే మన రాజ్యంగంలో ఆర్టికల్‌ 14 ఏమైనట్లు? దానిని ప్రశ్నించద్దా? వాక్‌స్వాతంత్య్రం వంటివి గ్యారంటీ చేసిన ఆర్టికల్‌ 19ని మోడీ సర్కార్‌ దెబ్బతీస్తుంటే ప్రశ్నించవద్దా? రాజ్యాంగమిచ్చిన జీవించే హక్కునే ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంటే అడగొద్ద్దా? ప్రశ్నించకూడదని మోడీ వాదన. ఒక్కమాటలో చెప్పాలంటే మోడీ సర్కార్‌ దృష్టిలో ప్రస్తుత రాజ్యాంగమే అడ్డు. అందుకే రాజ్యాంగాన్నే ధ్వంసం చేస్తున్నది.
   మోడీ మహాశయుడు ఆయన పరివారం అర్థం చేసుకోవాల్సిన కీలకాంశమేమంటే 'హక్కు'లకు భంగం వాటిల్లినప్పుడే కార్మికుడైనా, రైతైనా తన గొంతు విప్పుతాడు. ఒకరోజు సమ్మె చేస్తే కార్మికులకు జీతం కట్‌ అవుతుంది. తమ కుటుంబాలను ఇబ్బందుల పాల్జేసుకునేందుకు ఎవరూ 'హక్కు'లంటూ పోరాడరు. ఏడాదిపాటు తమ వ్యవసాయ 'హక్కు' కోసం రైతులు కుటుంబాలను వదులుకుని, ప్రభుత్వం దమనకాండను భరిస్తూ ఎందుకు పోరాడారు? వారి డిమాండ్‌ సహేతుకమనే కదా మోడీ సర్కార్‌ ఆ నల్లచట్టాలను వెనక్కి తీసుకుంది? కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు పనిచేయకుండా ప్రస్తుత 2.5లక్షల కోట్ల డాలర్ల జీడీపీ ఎలా సాధ్యమవుతుంది? కార్పొరేట్లే సంపద సృష్టికర్తలని మోడీ చెప్పుకున్నా వాళ్ళు లాభాలు వెనకేసుకోగలరు తప్ప సంపదలు సృష్టించలేరు.
   మోడీ మాటల వెనుక నిరంకుశ ధోరణి ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర ఉంది. మార్చగలమనే నమ్మకముంది. ప్రజలకున్న అన్ని హక్కులనూ కాలరాసి వేయాలనే ధృక్పధముంది. 2021 డిసెంబర్‌ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులున్నారనీ, వారిలో పెద్ద సంఖ్యలో మహిళలున్నారనీ సీఎంఐఇ పేర్కొంది కదా! వీరు తమకు ఉద్యోగాలు కావాలని ఈ ప్రభుత్వాన్ని అడగొద్దా? దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉపాధి లేకపోతే దేశం ముందుకు పోగలదా? వీటన్నింటికీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకే మోడీ సర్కార్‌ను వీలైనంత త్వరగా సాగనంపకపోతే మనకి మిగిలేది మిగిలిన పాతికేళ్ళకూ ఆయన పెట్టిన లక్ష్యం ''కఠోర శ్రమ'', మన జీవితాల్నే 'త్యాగం' చేయడమే!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.