Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరి ఏం చేద్దాం...? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2022

మరి ఏం చేద్దాం...?

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. బలవంతుల దౌర్జన్యాలూ... ధనవంతుల పన్నాగాలూ... చిరకాలం జరిగిన మోసం... ఇదే కదా చరిత్రసారం...! ఈ చరిత్ర గతి మారేదెన్నడు? సమాజ నిర్మాణానికి నెత్తురు ధారపోసి, నాగరికతకు నడకలు నేర్పిన శ్రామికజనుల హాహాకారాలూ, ఆర్తనాదాలూ, శతాబ్దాల చరిత్రకు రాళ్లెత్తిన కూలీల ఆకలికేకలూ ఏ ప్రగతికి ప్రతీకలు? సమాజ గమనంలో శతాబ్దాలు గడిచినా పెరగడమే తప్ప తరగతని అంతరాలు ఎవరి ప్రగతికి సూచికలు? దావోస్‌లో జరిగిన 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం'' సమావేశాలూ, దానికి ముందు ఎప్పటిలాగే వెలువడిన ''ఆక్స్‌ఫామ్‌'' నివేదికల సారమేమిటి? మానవజాతి పురోగమనానికి దారులు వేసిన జీవితాల్లో ఇంకా ''ఆకలి గీతాలు'' వినిస్తున్నాయనే కదా..!
కాలగతిలో సమాజం సాధించిన పురోగమనాన్ని ఈ తీవ్రమవుతున్న అంతరాలు వెక్కిరిస్తున్నాయి. సంపద నానాటికీ కేంద్రీకృతమవుతుండగా అంతరాలు లేని సమాజం కలగానే మిగిలిపోతోంది. నేటి కరోనా కాలంలో వికృతరూపం దాల్చిన ఈ దోపిడీ మరింత పెట్రేగిపోతున్నది. సామాన్యులను చావనీయకుండా బతకనీయకుండా వేదిస్తున్నది. ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదికలో వెల్లడైన గణాంకాలు ప్రపంచ వ్యాపితంగా ఈ దోపిడీ పర్వాన్ని ఎత్తిచూపుతున్నాయి. ప్రపంచం సంగతి అటుంచితే కేవలం మనదేశంలోనే గత ఏడాది కొత్తగా 16కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. దేశ జనాభాలో 84శాతం ప్రజల ఆదాయాలు క్షీణించాయి. కేవలం 10శాతం మంది ధనవంతులు మొత్తం దేశ సంపదలో 45శాతం కలిగి ఉండగా, అట్టడుగు పేదల్లో 50శాతం మంది ప్రజలు 6శాతం మాత్రమే కలిగివున్నారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?
''అన్నపురాశులు ఒక చోట - ఆకలి మంటలు ఒక చోట
హంస తూలికలొకచోట - అలసిన దేహాలొకచోట
సంపదలన్నీ యొకచోట - గంపెడు బలగంబొకచోట'' అంటూ కాళోజీ ఏనాడో ఎత్తి చూపిన ఈ అసమానతలు ఈనాటికీ కొనసాగడమే కాదు, మరింత తీవ్రమవడం అవాంఛనీయం, అమానవీయం. పిడికెడు మంది అపారమైన సంపదలననుభవిస్తుండగా, అసంఖ్యాకులైన ప్రజలు అంతులేని దారిద్య్రంలో అలమటించడాన్ని ఎలా భరించగలం?
నేడు అన్నీ ఉన్నవాడికి బతుకే కాదు, చావుకూడా ఓ పండగే. అందుకేనేమో ''స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళిలాంటిదే'' అన్నాడు శ్రీశ్రీ. కానీ ఏమీ లేనివాడి బతుకే దుర్భరం. చావుకుముందు బతకాలంటే కనీసం నాలుగు వేళ్లయినా నోట్లోకి పోవాలి కదా? జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవని ప్రజల జీవితాలు దేనికి సంకేతాలు? వికృతమైన, విస్తృంఖలమైన దోపిడీకి కాదా..? కరోనా పేరుతో నష్టాల సాకు చూపి కార్మికులకూ, వారి వేతనాలకూ కోత విధించిన యజమానులు కోటాను కోట్లు పోగేసుకోగా, కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఓ విషాదమైతే... ఈ కష్ట సమయంలో ప్రజలకు దన్నుగా నిలబడాల్సిన ప్రభుత్వాలు ఈ దోపిడీకి వంతపాడటం మహా విషాదం. ఫలితంగా రాళ్లెత్తిన కూలీల రక్తమాంసాలతో ఈ ప్రపంచం అభివృద్ధి చెందడం ఎంత నిజమో, ఆ అభివృద్ధికి కారణమైన శ్రామిక జనావళి ఆకలి కేకలు వేస్తున్నది కూడా అంతే నిజమని ఈ ఆక్స్‌ఫామ్‌ నివేదిక మరోసారి రుజువు చేస్తున్నది.
కనుక మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు... ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి, పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమిది. సంపదలో వాటా ప్రజలందరి హక్కు అని పోరాడవలసిన సమయమిది. కానీ ఈ హక్కులూ, పోరాటాలు ''టైమ్‌వేస్ట్‌'' వ్యవహారాలంటున్నారు పాలకులు. ఈ 75ఏండ్లూ అందువల్లనే నష్టపోయామని వాపోతున్నారు!? అంటే ఈ దోపిడీ నిలువునా దహిస్తున్నా తలొంచుకుని బతుకమనేనా వారు చెప్పదలచుకున్నది? అయినా మనుషుల్ని మనుషులుగా గాక మతానికి పుట్టిన పుట్టగొడుగులుగానో, కులం గొడ్లు ఈనిన బలిపశువులుగానో చూసేవారు ఇంతకన్నా ఏం చెప్పగలరు? అయినా మన పిచ్చిగానీ... ఎక్కాల్సిన పీఠాల కోసం మనిషిని మతం పేర జాతిపేర ముక్కలు చేసేవారు సమాజాన్ని శాంతివైపు, సమతవైపు నడిపించగలరా..? వారికి తెలిసిందల్లా నడవాల్సిన దారుల నిండా అసమానతల అగ్గిరాజేసి బతుకుల్ని బుగ్గి చేయడమే. ప్రజలను మాయచేయడానికి నిత్యం అలజడి నదుల్ని పారించి, అభద్రతా తీరాలను పోటెత్తించి, అజ్ఞానపు సొరంగాలు తవ్వి కాలాన్ని అంధకారంలోకి మళ్లించాలనుకునే వారు సమానత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? అసమానతలను ఎందుకు తొలగిస్తారు? అందుకే ''ఈ దేశపు పవిత్ర మట్టిలో ఏ పోరాటాల్నీ విత్తకండి, ఏ హక్కుల్నీ నినదించకండి, ఏ అసమానతలనూ ప్రశ్నించకండి. సమస్తాన్నీ మాకప్పగించి నిశ్చింతగా నిద్రపొండి. కేవలం ఐదేండ్లకోసారి చూపుడు వేలుపై వాత మాత్రం పెట్టుకోండి'' అంటున్నారు! మరి ఏం చేద్దాం...?

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గన్‌కల్చర్‌
ప్రణాళిక లేని ప్రభుత్వం...
కల్తీ వెల్లువ
మూడు స్తంభాలాట!
కలగా మిగిలేవుంది...
నిన్న బాబ్రీ.. నేడు జ్ఞానవాపి.. రేపు..!?
ఉక్రెయిన్‌లో మలుపు తిరిగిన మరియుపూల్‌ ఘట్టం!
పోరాటాలతోనే సీసీఐ పునరుద్ధరణ..
''చింత'' తీరుతుందా!?
గురివింద కూతలు
సున్నిత హృదయ విశాల కరుకుతనం
'రాజు'గారికి షాక్‌
ఇది మిథ్య కాదు సారూ!
శ్రీలంక నేర్పిన పాఠమేంటి?
ఈ మాంద్యానికి విరుగుడెప్పుడు...?
కేంద్రం కిరికిరి...
అమ్మకో రోజు..!
ఇంకా ఆకలి ఎందుకు?
ఈ ఆంక్షలు అనర్థానికే...
అన్నదాత అరిగోస...
మేడే రోజూ భజనేనా..!
ఇక హిందీస్థాన్‌..!
మేడే ఒక సజీవ ధార...
ఇదేమి తిరకాసు సారూ..!
రష్యాను దెబ్బతీసేందుకు పావుగా ఉక్రెయిన్‌!
ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
రాశి కాదు.. వాసి ముఖ్యం...
బ్రిక్స్‌ పగిలిపోతే!?
బంధువులమేనా మనం!
బుల్డోజర్‌లకెదురుగా...

తాజా వార్తలు

08:12 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

07:49 PM

బండి సంజయ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

07:46 PM

హైదరాబాద్‌ మెట్రో సేవలకు మళ్లీ అంతరాయం

07:21 PM

టాస్ గెలిచిన‌ బౌలింగ్ ఎంచుకున్న వెలాసిటీ

07:13 PM

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో బెట్టింగ్ ముఠా అరెస్టు

07:07 PM

రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోడీ : మంత్రి నిరంజన్ రెడ్డి

06:51 PM

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపడి ఒకరు మృతి

06:33 PM

మ‌హిళ‌లు వాష్‌రూమ్‌లో కెమెరా.. హైదరాబాద్‌లో బాయ్ నిర్వాకం..!

06:20 PM

గుజరాత్‌లో భారీగా కొకైన్ స్వా‌ధీనం

06:17 PM

అమలాపురం అల్లర్లలో బీజేపీ నేతలు..!

05:53 PM

సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

05:30 PM

తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

05:14 PM

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త : సీఎం కేసీఆర్​

05:00 PM

ఏటీఏం చోరీకి యత్నం.. కాలి బూడిదైన నోట్లు

04:53 PM

టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

04:44 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులు.. రేకులు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం

04:33 PM

మాజీ మంత్రి నారాయణకు ఊరట..!

04:26 PM

నాకు కోపం వస్తే ఎవరినీ వదలను.. తోకలు కత్తిరిస్తా.. : చంద్రబాబు

04:09 PM

మూడు రోజుల నష్టాలకు మార్కెట్లు బ్రేక్..!

04:01 PM

పాలసీ విధానాలు కాగితాలకే పరిమితం కావద్దు : ప్రధాని మోడీ

03:52 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్డు మార్గాన ప్రధాని..

03:35 PM

వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ.. ఒకరు మృతి

03:28 PM

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన నటి..!

03:17 PM

ఎఫ్3లో ఆ హీరోలు కనిపించబోతున్నారు : దిల్ రాజు

03:06 PM

పెండ్లి వాహనం బోల్తా.. నలుగురు మృతి

03:00 PM

ఒకరికి సైట్ కొడితే మరొ అమ్మాయి పడింది : అనిల్ రావిపూడి

02:51 PM

ఏపీలో కాంగ్రెస్ ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు

02:45 PM

ఐఎస్‌బీకి చేరుకున్న ప్రధాని

02:14 PM

గీతారెడ్డి, జగ్గారెడ్డి కండ్లు ఉండి లేనట్టు మాట్లాడుతున్నారు : మంత్రి హరీశ్ రావు

02:04 PM

మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.