Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మేడే ఒక సజీవ ధార... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • May 01,2022

మేడే ఒక సజీవ ధార...

ఎనిమిది గంటలే పని చేస్తామన్నందుకు తుపాకులు నిప్పులు కక్కాయి. బాయినెట్లు నెత్తురోడాయి. నాయకులు ఉరికొయ్యలకు వేలాడారు. దీన్ని కలియుగమన్నారు. ఇది పెట్టుబడిపై తిరుగుబాటన్నారు. ''శూద్రులు స్వర్గానికి అర్హులు కారా?'' అంటూ ప్రశ్నించి కఠోర తపస్సు చేస్తున్న శంభూకుడి తల నాడు తెగిపడింది. దానిని త్రేతాయుగమన్నారు. ధర్మం నాలుగు పాదాల నడిచే, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ''విరాజిల్లుతున్న'' రామరాజ్యంలో అది కుల వ్యవస్థపై తిరుగుబాటన్నారు. యుగాలు మారినా దోపిడీ స్వభావం మారలే!
మే నెలంటే పిడికిళ్లు బిగుసుకునే రోజు. మేడే అంటే ప్రాణాల్ని తృణప్రాయంగా ఉద్యమానికి అందించిన రోజు. యంత్ర భూతాల కోరలు తోమడానికే కాదు.. తామూ ఎనిమిది గంటలే పనిచేస్తామనీ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు ఉద్యమించిన రోజు. చికాగోలో రక్తం ఏరులైపారిన రోజు. అందుకే, మేడే పెట్టుబడిపై ప్రత్యక్ష వర్గయుద్ధం ప్రకటించిన రోజు! కానీ, మేడేని పురాణ గాథస్థాయికి దిగజార్చి పండుగ దినంగా జరుపుకోడానికి అలవాటుపడ్డ కార్మిక సంఘాలు నేటి భారతదేశంలో ఏమిచెప్తాయి? చట్టాలు మారకముందే, కోడ్‌లన్నీ ఉనికిలోకి రాకముందే నేడు 12గంటల పనిదినం సార్వత్రికం అయిపోయింది. సంఘటితరంగ పరిశ్రమల్లో సైతం వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, క్యాజువల్‌ కార్మికులకు 12 గంటల పనిదినం సర్వసాధారణంగా మారింది. దీన్ని శాశ్వత కార్మికులు, వారి సంఘాలు పట్టించుకోకపోతే నెత్తురు మరిగిన పులి అక్కడితో ఆగుతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది మన దేశంలో!
మేడేలో విదేశీ వాసనుందనీ, తాము దాన్ని ఆఘ్రాణించని నిఖార్సయిన దేశవాళీ తాత్విక వారసులమనీ, అందుకే విశ్వకర్మ జయంతి జరుపుతామనే వారి గురించి ఒక్కమాట. తన కొడుకును వధించి అతని వెన్నుపూసతో వజ్రాయుధం తయారుచేసి తన యజమాని అయిన ఇంద్రుడికి బహూకరించాడట విశ్వకర్మ. యజమాని కోసం పుత్రుణ్ణి బలిచ్చినవాడి జ్ఞాపకార్థం జరిపేది ఒకటైతే, కార్మికుల మూలుగులు పీల్చే యాజమాన్యాల దౌష్ట్యాన్ని ఎదిరించేది మరొకటి. మేడే ఒక సజీవ ధార. 1886 నాటి రుధిర తర్పణల జపమే కాదు, మళ్ళీ పెచ్చరిల్లుతున్న పెట్టుబడి వేటని ప్రతిఘటించే ప్రణాళికల కదంబం మేడే! ప్రభుత్వరంగమంటే మ్యూజియమ్‌లో చూసుకునే జంతు కళేబరం కాదని మోడీ సర్కార్‌ కర్ణభేరి పగిలేలా కార్మికవర్గం అరవాల్సిన రోజు. అదానీ జేబులు నింపే ఆత్మనిర్భర్‌ కాదు. దేశాన్ని తన కాళ్లపై తనను నిలబెట్టే స్వావలంబన కోసం నినదించాల్సిన రోజు.
''పవిత్ర'' భారతదేశంలో యాజమాన్యాల దోపిడీతో పాటు కుల దోపిడీ, కుల వివక్ష విస్తారంగా ఉనికిలో ఉన్నాయి. కార్మికుల ఐక్యత కోసం శ్రమిస్తూ, సాధించిన ఆ ఐక్యతతో పెట్టుబడిపై నిరంతర యుద్ధంలో నిమగమైన ఒక కార్మిక సంఘం ఇటీవల చేసిన సర్వేలో చెత్త (స్వచ్ఛ) రిక్షా కార్మికుల వాడల్లోకి హమాలీ కార్మికులు రావడానికి నిరాకరించిన ఘటన వెలుగుచూసింది. అనేక మంది మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాల్లో, ముఖ్యంగా దళితేతర కుటుంబాలవారు దళిత పని మనుషులు తోమిన బాసాన్లపై పసుపునీళ్లు చల్లి ఇంట్లోకి తీసుకెల్తున్న ఘటనలు బయల్పడ్డాయి. మున్సిపల్‌ కార్మికులకు హైదరాబాద్‌ నగరంలోనే అనేక చోట్ల మంచినీళ్లివ్వని సందర్భాలు, ఇచ్చినా పైనుండి పోస్తున్న సందర్భాలు, అదీ బాత్‌రూంలోని నీళ్లిస్తున్న సంఘటనలు కోకొల్లలు. అధునాతన మెట్రో పాలిటన్‌ నగరంలో సైతం కులం అడగకుండా ఇల్లు కిరాయికి ఇవ్వకపోవడం, ఫలానా కులానికి లేదా మతానికి అసలు ఫ్లాటే అమ్మననడం జరిగిపోతూనే ఉన్నాయి. ముస్లింల, దళితుల వెలివాడలు వెలుస్తూనే ఉన్నాయి. మరో కీలకాంశం లింగవివక్ష. సమానపనికి సమాన వేతన చట్టం ఉన్నా మహిళలకు తక్కువ వేతనం యధేచ్ఛగా సాగిపోతూనే ఉంది. మార్చి 8న పెద్ద పెద్ద డైలాగులు వల్లించే పాలకులు ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోరు. కార్మికశాఖ దీని గురించి ఆలోచించదు. ఈ విషయంలో కనీసం కార్మికుల చైతన్యం ఏమిటి? దాన్ని పెంచడానికి కార్మిక సంఘాల కృషి ఏమిటి? పైన పేర్కొన్న కుల, మత, లింగ వివక్షలపై కనీసం చైతన్యవంతమైన కార్మిక సంఘాలైనా గళమిప్పకపోతే, పదం కదపకపోతే భారతదేశంలో కార్మికవర్గ ఐక్యత అసాధ్యం. ఢిల్లీ రైతు ఉద్యమం దారులు పరిచింది. తెగువ, పట్టుదల, మిలిటెన్సీలతో ముందడుగు పడాలి.
నేడు మనుధర్మం రాజధర్మమైంది. ''శంభూకుల''వేట సాగుతూనే ఉంది. పెట్టుబడి పైశాచికత్వం వికటాట్టహాసం చేస్తోంది. కార్మికవర్గంసవ్యసాచులై కదనరంగంలో దూకాలి. మిత్రవర్గాలను సమాయత్తం చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాటో కూటమి రణోన్మాదం!
ఇంటర్‌ తిప్పలు...
మహారాజ రాజశ్రీ...!
హక్కులకు సంకెళ్లా!
అన్నం ముద్దపై ఉమ్మొద్దు!
అమెరికాలో గళమెత్తిన పేదలు!
''మహా'' రాజకీయం
చదువు'కొనే'దెట్టా..?
ఇదెక్కడి న్యాయం?
సారు తటస్థమట!
ప‌ల్ల‌వించాలి
వాళ్లు అగ్ని పథికులే!
నిర్వాసితులపై యుద్ధం
బుల్డోజర్‌ డేస్‌
కల్తీలేని ఆహారం కలేనా?
జక్కలొద్ది
నేల చూపులే
అమెరికా తానాషాహీ నహీ చలేగీ!
ఆపేస్తే.. అంతే సంగతులు...
తలవంపులు!
కాషాయ కళ్ళద్దాలు!
గతి తప్పుతున్న పాఠాలు...
అభద్రతలో ఆధార్‌!
చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా మరో అడుగు!
మరో విద్వేష ప్రసంగం
ఉపాధికి ఊతమేది...?
ఆ దార్లోనే...!
పేరులో ఏముంది!
ప్రధాని వంచనా శిల్పం
గన్‌కల్చర్‌

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.