Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేల చూపులే | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 11,2022

నేల చూపులే

'వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్‌ తలపెట్టవోయ్'' అన్నారు మహాకవి గురజాడ. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. గడిచిన ఎనిమిదేండ్లలో సుపరిపాలన అందించామని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నామని, 'బయో-ఎకానమీ' 8 రెట్లు వృద్ధి చెందని స్వయంగా ప్రధానే అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయచేస్తున్నారు. ఏలినవారివి అసత్యాలే అని కుండబద్దలు కొట్టి మరి చెప్పాయి పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు. ఒక్క ఆకలి విషయంలోనే కాదు. ప్రజాస్వామ్యం, లింగసమానత్వం, మానవాభివృద్ధి, ఉపాధి, విద్య, వైద్యం వంటి పలు అంశాల్లో మన దేశం నేల చూపులే తప్ప తలెత్తుకునే పరిస్థితి లేదని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. ఇలా.. ఏ రంగం వైపు చూసినా 'ఏమున్నది గర్వ కారణం' అన్నట్టుగానే పరిస్థితులున్నాయి.
75ఏండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా ఈ దేశంలో ఆకలే రాజ్యమేలుతుంటే.. ఇన్నేండ్లుగా మన దేశాధినేతలేం చేస్తున్నట్టు..!? ఎందరు ప్రధానులొచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరిదీ పేదరికంపై యుద్ధమే..! పేదరిక నిర్మూలనకే అన్ని పథకాలు. బడ్జెట్‌లో వేలకోట్లు కేటాయింపులు... పథకాలు అమలవుతూనే ఉంటాయి, వేల కోట్లు ఖర్చవుతూనే ఉంటాయి. అయినా అదేం విచిత్రమోగానీ ఇవేవి పేదరికాన్ని నిర్మూలించలేదు సరికదా ''ఆకలి సూచి''ని మాత్రం మరింత పెంచుతున్నాయి! గత ప్రధానుల కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన మోడీ అధికారంలోకి వచ్చేనాటికి ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం 55గా ఉంది. 2021నాటికి దానిని 101వ స్థానానికి తీసుకువెళ్లి ''ఆకలి'' అభివృద్ధిలో మన దేశాన్ని ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలబెట్టారు మోడీజీ.
ఏ దేశ సుస్థిరాభివృద్ధికైనా ప్రజల ఆరోగ్యమే గీటురాయి. ప్రజల ఆకలి సమస్యను పరిష్కరించడమే సుస్థిరాభివృద్ధి అవుతుంది కానీ, ఎత్తైన విగ్రహాలు పెట్టడంలోనో, ఉన్న భవనాలను కూల్చి విలాసవంతమైన భవంతులు కట్టడంలోనో ఉండదు. మనిషి అంతరిక్షానికి ప్రయాణిస్తున్న కాలంలో కూడా ఇంకా ''ఆకలి'' అనేది తీరని సమస్యగానే ఉండటం ఎంత విషాదం..!? ''ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్..'' అన్న ప్రశ్న ఇప్పుడు గురజాడదే కాదు... తిండికి మలమలలాడుతున్న కోట్లాది భారతీయులది. దీనికెవరు సమాధానం చెప్పాలి?
ప్రస్తుత పాలకుల ఆచరణ రాజ్యాంగ ఆదర్శాలకు భిన్నంగా ఉందని మన అనుభవం తెలుపుతోంది. మోడీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో, దైనందిక అవసరాలు తీర్చడంలో విఫలమైందని ప్రజల సామాజికార్థిక స్థితిని చూస్తే విధితమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి పెట్టుబడి సేవలో, సామ్రాజ్యవాద సేవలో తరించి పోతున్నారు ఏలికలు. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి మానవాభివృద్ధి కాదు, అది సంపన్నుల అభివృద్ధి అని పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజల రాజ్యం కాదు, పెద్దల రాజ్యమని చెప్పడానికి ఇంతంటేే రుజువులేమి కావాలి. అన్ని అంశాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌ల కంటే భారత్‌ వెనుకబడి ఉందని పలు నివేదికలు ఘోషిస్తుంటే అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పడం మోడీజీకే చెల్లుతుంది!
పేదరిక నిర్మూలనే తమ ప్రధాన ఎజెండా అంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ... పేదరికం, పౌష్టికాహారలోపం, నిరక్షరాస్యత తన ముందున్న అతిపెద్ద సవాళ్లనీ, వీటి నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడమే తన ధ్యేయమనీ కూడా చెప్పింది. కానీ గడచిన ఎనిమిదేండ్లలో ప్రపంచ ఆకలి సూచీ, విదేశాలకు వెళ్లివారి సంఖ్యను తెలిపే పాస్‌పోర్ట్‌ సూచీ, ప్రపంచ సంతోష సూచీ, ప్రజాస్వామ్య సూచీ, లింగభేద సూచీల్లో భారత్‌ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. దీనిపై సోషల్‌ మీడియాలో వరల్డ్‌ రిపోర్ట్‌ కార్డ్‌ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే 'భారత్‌ ఎంతో మెరుగైందంటూ సోషల్‌ మీడియాలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌ను ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఈ ర్యాంకింగ్‌కి ఏలాంటి విశ్వసనీయత లేదని వీటిని నిలిపివేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు గతంలోనే పేర్కొన్నది. ఇలాంటి విలువ లేని రిపోర్ట్‌లను తమ గొప్పలంటూ గోబెల్స్‌ పచారాన్ని మోడీ సర్కారు చేసుకుంటున్నది. అదే విశ్వసనీయతున్న సూచీల నివేదికలను మాత్రం తప్పుడు నివేదికలని, అశాస్త్రీయమని కొట్టిపారేస్తోంది. వాస్తవాలను అంగీకరించలేక, నిజాలను కప్పిపుచ్చడానికి కమలనాథులకు ఉన్న ఏకైక అస్త్రం ఎదురుదాడే. ఇప్పటి వరకు దేశానికి, దేశనాయకులకే పరిమితమైన ఈ ఎదురుదాడి.. ఇప్పుడు సరిహద్దులు చెరుపుకొని అంతర్జాతీయ సంస్థలపైకి కూడా దిగుతోంది. అందుకు ప్రధాని మొదలుకొని వారి అనుంగులందరూ నాలుకలకు కత్తులు కట్టుకొని మరి కూర్చుకున్నారు. అయితే ప్రజలేమి అమాయకులు కారు... అన్ని గమనిస్తూనే ఉంటారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...
ఇదేం ''గతి'' సార్‌!
శ్రీలంకపై ఐఎంఎఫ్‌
ఆనందం అందని ద్రాక్షేనా..?
ధనిక దేశాల్లో మాంద్య ఘంటికలు మనకూ హెచ్చరికే!
'పీస్‌' ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే?

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.