Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బుల్డోజర్‌ డేస్‌ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 15,2022

బుల్డోజర్‌ డేస్‌

దేశంలో బుల్డోజర్‌ రాజకీయాలు ఇప్పుడు కనీ వినని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. నుపూర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ల వాచాలతతో ప్రపంచదేశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దేశానికి వచ్చినా వారి విద్వేషాగ్ని ఇంకా చల్లరడంలేదు. శుక్రవారం నిరసన తెలిపిన వారిని హెచ్చరిస్తూ యూపీ సీఎం మీడియా సలహాదారు మృంత్యుంజరు కుమార్‌ ''గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది'' అని ట్విట్టర్‌ వేదికగా నిరసనకారులకు 'బుల్డోజర్‌ వార్నింగ్‌'ను పంపారు. అగ్నికి ఆజ్యం పోసేలా హర్యానా బీజేపీ ఐటీ సెల్‌ బాధ్యులు అరుణ్‌ యాదవ్‌ ''ఇప్పుడు శుక్రవారం స్టోన్‌-డే. శనివారంను 'బుల్డోజర్‌ డే'గా ప్రకటించాలి'' అని ఆ ట్వీట్‌ చేశాడు. అంతే కాదు నిరసన తెలిపిన జావేద్‌ మహమ్మద్‌, అఫ్రిన్‌ ఫాతిమా ఇండ్లపై బుల్డోజర్లనే ప్రయోగించారు. విద్వేషాన్ని రగిల్చిన నేతలపైకి లేవని లాఠీలు... ఆ వ్యాఖ్యలపై నిరసనలు తెలిపిన వారిపై మాత్రం విరుచుకుపడుతున్నాయి. బుల్డోజర్లు శిక్షలను అమలు చేస్తుంటే, న్యాయస్థానాలు నోరెళ్లపెడుతున్నాయి. పాలకులే స్వయంగా చట్టాలను పక్కన పెట్టి శిక్షలు అమలుచేస్తూన్నారు. డెబ్భయి ఐదేండ్ల స్వాతంత్య్రం సాక్షిగా రాజ్యాంగాన్నే బుల్డోజ్‌ చేయడం నేటి విషాదం.
గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో భారత్‌కున్న సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. గల్ఫ్‌లో 90లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్‌ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారు 'ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు' అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రకటన చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్‌ శర్మ కానీ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
రెచ్చగొట్టడం... చిచ్చుపెట్టడం... ఓట్లుపట్టడం... అంతిమంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం... తద్వారా దేశాన్ని మత రాజ్యంగా మార్చడం. దానిని అడ్డం పెట్టుకొని పాలించడం, దోపిడీ చేయడమే కమలనాథుల లక్ష్యం. అందుకోసం మరుగునపడిన సమస్యలను వారే పైకి తీసుకువస్తారు. లేకుంటే సమస్యలను వారే సృష్టిస్తారు. ప్రజల మౌలిక సమస్యలేవీ సామాజిక, రాజకీయ కార్యక్షేత్రంలోకి రాకుండా ఉండేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. దేశ ప్రజలలో విభజన తీసుకొచ్చి, వారిని రెండు శత్రు శిబిరాలుగా మార్చే భావోద్వేగాలపై కేంద్రీకరించి రాజకీయం నడుపుతారు. అందుకు ప్రధాని మొదలు వారి పరివారమంతా విద్వేషాన్ని నిత్యం రగిలిస్తూనే ఉంటారు. అందుకు తాజా ఉదాహరణలే మన ముందు జరుగుతున్న ఘటనలు.
నిజానికి ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పరిపాటిగా మారిపోయింది. ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది.
మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయమై కూర్చుంది. ప్రతి విషయాన్నీ మత కోణంలో చూడడం పెరిగిపోయింది. ఆకలి, నిరుద్యోగం, అప్పులు, అధిక ధరలు, ప్రజా ఆస్తులు ఆమ్మకం వంటివేవి చర్చనీయాంశాలు కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. ఈ బుల్డోజర్‌ రాజకీయాలను ఖండించాల్సిన అవసరాన్ని ఈ దేశ ప్రతిపక్షపార్టీలు గుర్తించాలి. రాజ్యాంగం ప్రజలకిచ్చిన ప్రశ్నించే హక్కును, నిరసన తెలిపే హక్కును హరించే దుర్మార్గామైన పాలన గురించి ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయ శక్తులు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు కూడా మెల్కొనకపోతే ఇంతకంటే దారుణమైన, దౌర్జన్యకరమైన పాలనను మనం చూడాల్సి వస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...
ఇదేం ''గతి'' సార్‌!
శ్రీలంకపై ఐఎంఎఫ్‌
ఆనందం అందని ద్రాక్షేనా..?
ధనిక దేశాల్లో మాంద్య ఘంటికలు మనకూ హెచ్చరికే!
'పీస్‌' ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే?

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.