Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హక్కులకు సంకెళ్లా! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jun 28,2022

హక్కులకు సంకెళ్లా!

ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేశారు. దీన్ని ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ వాదులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆమె రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిందే తప్ప ఏ దేశ వ్యతరేక కార్యక్రమాలకు, కుట్రలకు పాల్పడలేదు. అందుకే ఆమె అరెస్టును ఐరాస మానవహక్కుల విభాగం సైతం ఖండించింది. న్యాయాన్ని ఆశ్రయించడమే నేరమైతే ఈ దేశంలో పౌరులుంటారా? ప్రజలు న్యాయం కోసం కోర్టులను కాకుండా ఎవర్ని ఆశ్రయించాలి? ప్రభుత్వ పెద్దలే ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తుంటే, రాజ్యాధినేతలే రాజ్యాంఘోల్లంఘనకు పాల్పడుతుంటే అలాంటి నేతలనేమనాలి? ప్రజలేం చేయాలి..?
''నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు.. కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం నా ప్రాణమిస్తా'' అంటాడు ప్రఖ్యాత ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్టేర్‌. భిన్నాభిప్రాయాలను సైతం సమున్నతంగా గౌరవించే ప్రజాస్వామ్యస్ఫూర్తికి ప్రతిబింబాలు ఈ వాక్కులు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ భిన్నాభిప్రాయాలపై మున్నెన్నడూ లేని అసహనం నిర్భంధం పెల్లుబుకుతోంది. 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆ కేసులో పోరాడిన హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ మోడీ ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆమెను గుజరాత్‌ పోలీసులు నిర్భంధంలోకి తీసుకోవడం గమనార్హం.
స్వతంత్రత, సమగ్రతకు నిలయమైన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం గుజరాత్‌ అల్లర్ల కేసులో ఇచ్చిన తీర్పు యావత్‌ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్‌ సరైన ఆధారాలు లేవంటూ మోడీ, ఆయన సన్నిహితులకు అహ్మదాబాద్‌ హైకోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌నే సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆమె 2002లో 'సిటిజెన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌' సంస్థను ప్రారంభించి, బాధితుల తరఫున పోరాడడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బాధితుల నుంచి పిటిషన్లు వేయించడం, వారికి న్యాయనిపుణులను సమకూర్చడం, సాక్షులను సమీకరించడం, వారికి న్యాయం జరిగేలా చూడడం ఆ లక్ష్యంలో భాగమే. ఈ సంస్థ పాత్ర కారణంగా నాటి 2002 గుజరాత్‌ అల్లర్ల కేసుల్లో 120మంది దోషులకు శిక్ష పడిందంటే వారి పోరాట ఫలితమే. దానిని మోడీ షాలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తీస్తా సెతల్వాద్‌ పై గుజరాత్‌ పోలీసులు పాత కేసులను తిరగదోడారు.
పౌరుల ప్రజాస్వామ్య హక్కుల్లో కోత విధించడానికి, రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించే అన్ని సంస్థలను ధ్వంసం చేయడానికి మోడీ ప్రభుత్వం తన ఎనిమిదేండ్ల పాలనలో ఒక పద్ధతి ప్రకారం అనేక చర్యలకు పాల్పడింది. ప్రశ్నించేవారి నోరు మూయించేందుకు పూనుకుంది. మానవ హక్కుల కార్యకర్తలని తీవ్రవాద సానుభూతి పరులుగానో లేదా తీవ్రవాదులు గానో అభివర్ణించడం ఆనవాయితీగా మారింది. 'మా పక్షాన లేని వారందరూ మా శత్రువులే' అనే మూర్ఖులు వ్యవస్థలను గౌరవిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.
జర్మనీ పర్యటనలో ఉన్న మన ప్రధాని ''దేశ ఉజ్వల ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చ''గా వర్ణించారు. ''సంస్కృతి, ఆహారం,ఆహార్యం వంటి అంశాల్లో ఉన్న వైవిధ్యమే మన ప్రజాస్వామ్యాన్ని ఉజ్వలంగా తీర్చింది'' అని వాపోయిన మన ప్రధాని, ప్రతి భారతీయుడి డీఎన్‌ఏ లోనూ నిక్షిప్తమై ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఆనాడు దారుణంగా అణిచివేశారని తీవ్ర ఆవేదన చెందారు. ఒక పక్క దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలుచేస్తూ విదేశాలలో మాత్రం ఆనాటి ఎమర్జెన్సీ గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడు తున్నారు. అవి అన్ని మొసలి కన్నీళ్లేనని భారతదేశ పరిస్థితులు నిత్యం గమనించే వారికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎమర్జెన్సీ రోజులు మళ్లీ రావచ్చని స్వయంగా బీజేపీ కురువద్ధుడు అద్వానీనే 2015లోనే ఇంటర్య్వూలో తెలిపారు. ఆ ప్రకటిత ఎమర్జెన్సీ 21 నెలలే ఉంటే.. నేడది ఎనిమిదేండ్లుగా కొనసాగుతోంది.
పతిపక్షాలైనా, పౌరసమాజమైనా తమను అనుసరించా ల్సిందే తప్ప ఆక్షేపించడానికి వీలులేదంటూ నియంతలాగా వ్యవహరిస్తుంటే ఇక ప్రజాస్వామ్యానికి మనుగడేముంటుంది? పౌరహక్కులన్నీ దిక్కులేనివైనప్పుడు రాజ్యాంగానికి అసలు అర్థముంటుందా? మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా, రాజ్యాంగం ఎంతటి ఉన్నతాశయాలతో రూపొందించుకున్నా... పాలకులకు వాటి అమలులో నిజాయితీ, ఆచరణలో నిబద్ధతా లేనప్పుడు అవి వృథాయే అవుతాయనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ఆనాడే ఎమర్జెన్సీని తీవ్రంగా ప్రతిఘటించి ఓడించారు. నేటి మోడీ నిర్భంద పరిపాలనను కూడా అంతకంటే తీవ్రంగానే నిలువరిస్తారు ప్రజలు. ఎంతటి నియంతలకైనా ఓటమి తప్పదని చరిత్ర రుజువు అనేక సందర్భాలలో రుజువు చేస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...
ఇదేం ''గతి'' సార్‌!
శ్రీలంకపై ఐఎంఎఫ్‌
ఆనందం అందని ద్రాక్షేనా..?
ధనిక దేశాల్లో మాంద్య ఘంటికలు మనకూ హెచ్చరికే!
'పీస్‌' ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే?

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.