Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాటో కూటమి రణోన్మాదం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jul 01,2022

నాటో కూటమి రణోన్మాదం!

జూన్‌ 28 - 30 తేదీల్లో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ నగరంలో కొలువు దీరిన నాటో కూటమి ఆమోదించిన తీర్మానాలు, చేసిన నిర్ణయాలు, ప్రకటనలు ప్రపంచాన్ని శాంతిగా ఉండనిచ్చేది లేదని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌ను కూటమిలోకి చేర్చుకొని రష్యా ముంగిట మారణాయుధాలతో కొలువు తీరాలన్న దుష్టాలోచనే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు కారణం. అది కుదిరే అవకాశం కనిపించకపోవటంతో తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్‌లాండ్‌కు నాటో తీర్ధం ఇచ్చేందుకు నాంది పలికింది. దీంతో ఉక్రెయిన్‌తో పాటు మరో 1,300 కిలోమీటర్ల మేర రష్యా సరిహద్దులకు నాటోను రప్పించేందుకు పూనుకున్నారు. ఈ రెండు దేశాలూ తటస్థ వేష వలువలు విలువలను తొలగించుకొని తమ నిజరూపాన్ని ప్రదర్శించాయి. రష్యాను బూచిగా చూపి అమెరికా చంకనెక్కేందుకు పూనుకున్నాయి. ఈ దేశాలలో గనుక ఆయుధాలను మోహరించి తమకు ముప్పు తలపెడితే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, దెబ్బకు దెబ్బ తీస్తామని రష్యా హెచ్చరించింది.
నాటో కూటమి 2010లో ఆమోదించిన వ్యూహాత్మక సంకల్ప పత్రంలో రష్యాను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నది. ఆ సమయంలో దానికి జి7 కూటమిలో చోటిచ్చి జి8గా మార్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అనేక ఆర్థిక సమస్యలతో ఉన్న రష్యా తమకు ఇంకేమాత్రం పోటీ కాబోదనే అంచనాతో పశ్చిమ దేశాలు తమతో పాటు కలుపుకుపోవాలని చూశాయి. కానీ తరువాత పరిస్థితులు మారటంతో దాన్ని అణగదొక్కేందుకు పూనుకున్నాయి. అదే తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభానికి, ఇప్పుడు మరోమారు నాటో విస్తరణకు కారణం. మాడ్రిడ్‌ సమావేశంలో ఆమోదించిన తాజా వ్యూహాత్మక సంకల్ప పత్రంలో రష్యానుంచి తమకు ప్రత్యక్ష ముప్పు తలెత్తిందంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. 2010నాటి పత్రంలో ప్రస్తావనే లేని చైనా తమకు శత్రువు కాదంటూనే దాని నుంచి ఇప్పుడు ప్రపంచ స్థిరత్వానికి మొత్తంగానే సవాలు ఎదురైందంటూ దాడికి నాంది పలికింది. ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా దీర్ఘకాలిక ఎత్తుగడలో భాగమే ఇది. దానిలో భాగంగానే తొలిసారిగా నాటో సమావేశాలకు జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా నేతలను ఆహ్వానించారు. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నాటో నుంచే ప్రపంచానికి ముప్పు ఉన్నదని, తమ ప్రయోజనాలకు హాని తలపెడితే తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది. శీఘ్రదాడులకు అవసరమైన దళాలను 40వేల నుంచి వచ్చే ఏడాది నాటికి మూడు లక్షలకు పెంచాలని, వారిని ఆయుధాలను మోహరించే తూర్పు ఐరోపా దేశాలకు అందుబాటులో ఉంచాలని, పోలాండ్‌లో రెండు శాశ్వత అమెరికా సైనిక కేంద్రాల ఏర్పాటు, స్పెయిన్‌లో మరో రెండు విధ్వంసక నౌకల మోహరింపు, బ్రిటన్‌లో మరో రెండు స్క్వాడ్రన్ల ఎఫ్‌35ను మోహరించాలని నిర్ణయించినట్లు అమెరికా అధినేత జో బైడెన్‌ ప్రకటించాడు.
మాడ్రిడ్‌ సమావేశం రణోన్మాదంతో ఊగిపోయింది. మానవాళికి ముప్పుతెచ్చే పదేండ్ల కొత్త ప్రణాళికను ముందుకు తెచ్చింది. యుద్ధాలు వద్దు-శాంతి కావాలని కోరుతున్న ప్రపంచశాంతి శక్తులకు ఒక సవాలు విసిరింది. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా అమెరికా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్ల ధనదాహానికి ఐరోపాను బలిపెడితే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాను తన గుప్పిట్లో పెట్టుకొనేందుకు అమెరికా నాటో ఖర్చులో సింహభాగాన్ని భరించింది. ఇప్పుడు అదేమీ కుదరదు, సభ్యదేశాలు తమ జీడీపీలో రెండుశాతం కేటాయించాలని వత్తిడి తెస్తున్నది. ఇప్పటి వరకు 30కి గాను తొమ్మిది దేశాలు మాత్రమే ఆ మేరకు ఖర్చు చేస్తున్నాయి. మిలిటరీ ఖర్చును పెంచటం అంటే కార్మిక సంక్షేమానికి చేసే ఖర్చుకు కోతపెట్టటమే. ఇప్పటికే అనేక పథకాలకు కోత పెట్టారు. ఉక్రెయిన్‌ సంక్షోభం పేరుతో రష్యా మీద విధించిన చమురు, ఇతర ఆర్థిక ఆంక్షల పర్యవసానాలను ఐరోపా అనుభవిస్తున్నది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థలకు ఆటంకం వంటి అనేకం కనిపిస్తున్నాయి.
నాటో కూటమి ఏర్పడిన నాటికీ నేటికి ప్రపంచం ఒకేలా లేదు. గతంలో దాని దాడి ఒక్క సోవియట్‌ మీదనే కేంద్రీకృతం కాగా ఇప్పుడు రష్యాతో పాటు ఒకేసారి చైనాను దెబ్బతీయాలని నాటో కూటమి చూస్తున్నది. దాన్ని పసిగట్టే ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-చైనా పరిమితులు లేని భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నాయి. రోజులు మారాయని గ్రహించకుండా రష్యా వద్ద ఉన్న ఆయుధాలను, చైనా ఆర్థిక, మిలిటరీ సత్తాను తక్కువ అంచనా వేస్తే అమెరికా కూటమికి భంగపాటు తప్పదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది జెండా పండుగ మాత్రమేనా?
గమ్యం చేరేందుకు...
ఇండియా @ 75
చెక్‌ పెట్టాలె..!
బ్రెజిల్‌కు మరోసారి నియంతృత్వ ముప్పు!
ఈ(మో)డీ సర్కార్‌!
హళ్లికి హళ్లి
ఏ ప్రయోజనాలనాశించి...
క్షమాపణ ఎవరు చెప్పాలి?
జెండా ఎగరాలి..!
ఉచితాలే అనుచితమా...?
పెలోసీ ముందుకా.. వెనక్కా..!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రవచనం సరేసార్‌!
జన సృజనకారులు
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
పుట్టుకైనా.. చావైనా.. జీఎస్టీయే జీఎస్టీ...
ఐరోపాను వణికిస్తున్న అసాధారణ వడగాలులు!
అన్నింటా అట్టడుగునే..!
తత్వం బొధపడ్డట్టేనా..?!
కోరలు చాచిన రాజు
రూపాయి పతనం పట్టని అపర నీరోలు!
పోడుకు పరిష్కారమెప్పుడు?
వ్యాధులొస్తున్నాయ్‌ జాగ్రత్త...
ఇదేం ''గతి'' సార్‌!
శ్రీలంకపై ఐఎంఎఫ్‌
ఆనందం అందని ద్రాక్షేనా..?
ధనిక దేశాల్లో మాంద్య ఘంటికలు మనకూ హెచ్చరికే!
'పీస్‌' ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే?

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.