Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాప్‌ 27 ఏం చేయనుంది ! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

కాప్‌ 27 ఏం చేయనుంది !

నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. పొంచి ఉన్న పర్యావరణ ముప్పు నుండి ప్రపంచాన్ని కాపాడేందుకు ఈ సదస్సు ఏం చేయబోతోంది..? ఇప్పుడు ప్రతి చోటా ఇదే ప్రశ్న. వాతావరణం మారిపోయింది. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే ప్రాంతాల్లో కూడా ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలి కాలంలో రోళ్లుపగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏకమవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచుకొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమండలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొని తెచ్చుకున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యా వరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవంటూ, ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను 1.5 సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవావరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద, వర్ధమాన దేశాలు చేసేదేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయువులు 43 శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6 శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొనడం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియజేస్తోంది.
శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగిపోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడేస్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు 'ద లాన్సెట్‌' మెడికల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈ నేసథ్యంలో ఈజిప్టులో కాప్‌ 27 సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. కానీ బ్రిటన్‌ నూతన ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ఈ సదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.